ETV Bharat / opinion

'పెట్రో' ధరల మంటతో సామాన్యుల విలవిల

author img

By

Published : Mar 12, 2021, 8:51 AM IST

Updated : Mar 12, 2021, 9:16 AM IST

గడచిన ఏడాదికాలంలో పెట్రో, డీజిల్​ల చిల్లర ధరలు లీటర్​కు రూ. 18 నుంచి రూ. 20లకు పెరిగాయి. కొవిడ్​ సంక్షోభానికి తోడు పెట్రో దెబ్బ సామాన్య ప్రజానీకాన్ని మరింత కుంగదీసింది. భయాందోళనలో మగ్గుతున్న ప్రజలకు.. ధరల పెరుగుదల శరాఖాతంలా పరణమించింది. ఈ విషయంలో రాష్ట్రాలు చురుగ్గా, చొరవగా, ఉదారంగా కదలివస్తే తప్ప ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కాదన్న భావన ఆర్థికమంత్రి మాటల్లో ధ్వనించింది. మరీ భారాన్ని తగ్గించడం కోసం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయా?

పెట్రో ధరలు ఆకాశానికి ఎగబాకడం ధరలకు ఆజ్యం పోస్తోంది. రవాణా సహా అన్ని రంగాలపైనా ప్రభావం ప్రసరించి ధరలు మండిపోతున్నాయి. ద్రవ్యోల్బణానికి రెక్కలు మొలుచుకొస్తున్నాయి. చమురు, ఆహార వస్తువుల రేట్లు ఇనుమడించడం ఆర్థిక వ్యవస్థను దిగ్భ్రాంతపరచేదే. గడచిన ఏడాదికాలంలో పెట్రో, డీజిల్‌ల చిల్లర ధరలు లీటర్‌కు రూ.18నుంచి రూ.20లకు పెరిగాయి. కొవిడ్‌ బారిన పడి అప్పటికే విలవిల్లాడుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాలను పెట్రో దెబ్బ మరింత కుంగదీసింది. ఉద్యోగాలు కోల్పోయి, భవిష్యత్తు అగమ్యగోచరమై భయాందోళనలో మగ్గుతున్న ప్రజలకు ధరల పెరుగుదల శరాఘాతంలా పరిణమించింది. వినియోగ ధరల సూచీ ప్రాతిపదికన అంచనా వేసే టోకు ధరల ద్రవ్యోల్బణం రిజర్వ్‌ బ్యాంకు విధానం ప్రకారం నిర్దేశించిన ఆరు శాతానికి మించి ఉంది. గడచిన ఆరునెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. టోకు ధరల ద్రవ్యోల్బణం రెండు రకాలు.. ఒకటి: ప్రాధాన్య ద్రవ్యోల్బణం. ఆహారం, చమురు మినహా వస్తు సేవల ధరల్లో మార్పులకు ఇది ప్రాతిపదిక. రెండు: ప్రాధాన్యేతర ద్రవ్యోల్బణం. కాలానుగుణ ప్రభావాలుంటాయి కాబట్టి ఆహారం, ఇంధన ధరల్లోని మార్పులకు ఇది కొలమానం. రవాణా రంగం ప్రాధాన్యేతర ద్రవ్యోల్బణం కిందికి వచ్చినా- పెట్రో ధరల పెరుగుదలవల్ల రవాణా ఛార్జీలు మోతెక్కి, ఆ ప్రభావం అన్ని రంగాలపైనా ప్రసరిస్తుంది. ఫలితంగా ప్రాధాన్య ద్రవ్యోల్బణం అనూహ్యంగా ఎగబాకుతుంది.

గడచిన ఏడాదిలో అంటే 2020, మార్చి అయిదోతేదీ నుంచి 2021 మార్చి అయిదోతేదీ మధ్యకాలంలో దిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.71.29 నుంచి రూ.91.17కు పెరిగింది. అంటే ఏడాదికాలంలో రూ.20 పెరిగిందన్నమాట. అదేవిధంగా డీజిల్‌ ధర లీటర్‌కు రూ.63.94 నుంచి 2021 మార్చి అయిదో తేదీనాటికి రూ.81.47కు చేరింది. అంటే రూ.17.53 పెరిగిందన్నమాట. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రో, డీజిల్‌ ధరలు కళ్లు బైర్లు కమ్మించే స్థాయికి పెరిగాయి. మరోవంక ఎల్పీజీ సిలిండర్‌ ధర అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా మధ్యతరగతి, పేద, బడుగు వర్గాల పరిస్థితి గందరగోళంలో పడింది. టోకు ధరల ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతంలోపే కట్టడి చేసి ఉంచాల్సిన బాధ్యత రిజర్వ్‌ బ్యాంకుపై ఉంది. అరుదైన పరిస్థితుల్లో ఈ ద్రవ్యోల్బణం ఆరు శాతం వరకు ఉండవచ్చు. కానీ, ఇది పుంజాలు తెంచుకుని ఆరుశాతానికి మించి ఎగబాకి, ఆరునెలలపాటు అదే స్థాయిలో కొనసాగితే పార్లమెంటుకు రిజర్వ్‌బ్యాంకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

ఏటా ఐదున్నర లక్షల కోట్లు..

కేంద్ర ప్రభుత్వం 2019-20 కాలానికిగాను పెట్రోలియం రంగం నుంచి పన్నుల ద్వారా రూ.2,87,540 కోట్లు సముపార్జించింది. 2020-2021 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వం రూ.2,63,351 కోట్లు పన్నుల రూపంలో సమీకరించగలిగింది. పెట్రోలియం రంగం నుంచి కేంద్రం వసూలు చేసే మొత్తాల్లో ఎక్సైజ్‌ సుంకం కీలకమైనది. కిందటి ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రానికి 2.23 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. మరోవంక ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే కేంద్రానికి రూ.2.36 లక్షల కోట్లు దఖలుపడ్డాయి. మరోవంక రాష్ట్రాలు సైతం కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.2.21 లక్షల కోట్లు, ప్రస్తుత ఆర్థిక వత్సరం తొమ్మిది నెలల కాలానికి రూ.1.45 లక్షల కోట్లు సముపార్జించాయి. 2016 నుంచి 2020 వరకు పెట్రోలియం రంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు ఏటా సుమారు అయిదున్నర లక్షల కోట్ల రూపాయల మొత్తం సమకూరుస్తోంది.

నిరుడు కేంద్ర ప్రభుత్వం రెండు దఫాల్లో పెట్రోలు మీద పదమూడు రూపాయలు, డీజిల్‌ మీద పదహారు రూపాయలు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. దాంతో లీటరు పెట్రోలు మీద ఈ సుంకం ఎప్పుడూ లేని విధంగా రూ.32.98కి చేరగా, డీజిల్‌పై అది రూ.31.83కి చేరింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో లీటరు పెట్రోలుపై ఎక్సైజ్‌ సుంకం రూ.9.48; డీజిల్‌పై అది రూ.3.56గా ఉంది. కరోనా లాక్‌డౌన్ల వేళ దాదాపుగా దేశం స్తంభించిన సమయంలోనూ కేంద్రం, రాష్ట్రాలకు పెట్రోలియం రంగం నుంచి భారీ మొత్తమే సమకూరింది. కేంద్రం, రాష్ట్రాల మనుగడకు పెట్రో ఆదాయం కీలకమనడంలో సందేహం లేదు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుత పరిస్థితిని కేంద్రం ఎదుర్కొంటున్న 'ధర్మ సంకటం'గా అభివర్ణించారు. చమురు ద్వారా కేంద్రం సంపాదించే మొత్తంలో 41శాతం రాష్ట్రాలకే వెళుతున్న నేపథ్యంలో- ఈ విషయంలో రాష్ట్రాలు చురుగ్గా, చొరవగా, ఉదారంగా కదలివస్తే తప్ప ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కాదన్న భావన ఆర్థికమంత్రి మాటల్లో ధ్వనించింది. ప్రజలపై విపరీతంగా పడుతున్న భారాన్ని తగ్గించడంకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కతాటిపైకి వస్తాయా అన్నదే ఇప్పుడు ప్రశ్న.

- కృష్ణానంద్‌ త్రిపాఠి

ఇదీ చూడండి: జీడీపీతో పోలిస్తే 267 శాతం అధికంగా అప్పులు!

Last Updated : Mar 12, 2021, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.