ETV Bharat / opinion

అమెరికా ప్రస్థానం ఎటువైపు- చైనాకు చెక్​ పెట్టేనా? - affect of radical extremism in america election news

అగ్రరాజ్యంలో విభజన రాజకీయాలకు తావు లేదంటూ జోబైడెన్‌ స్పష్టం చేశారు. కానీ అమెరికా దేశీయ రాజకీయాల్లో పెరుగుతున్న అగాథాన్ని పూడ్చటం కష్టతరమే. ఒకవేళ అమెరికా సమాజం నిలువునా చీలేట్లయితే చైనా అత్యున్నత శక్తిగా ఆవిర్భవించాలని ప్రయత్నిస్తున్న ప్రస్తుత సమయంలో ఈ పరిణామాన్ని ఆందోళనకరంగానే భావించాలి.

right wing extremists -react to biden winning- in america president election
అమెరికా దేశీయ రాజకీయాల్లో పెరుగుతున్న అగాథం - చైనాకు అనుకూలం !
author img

By

Published : Nov 12, 2020, 6:50 AM IST

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పలు విశేషాలున్నాయి. విజేత జో బైడెన్‌ భారీ స్థాయిలో ఓట్లు సంపాదించినా, ఓటమి పాలైన డొనాల్డ్‌ ట్రంప్‌నూ తీసిపారేయడానికి లేదు. 2016, 2020 ఎన్నికల్లో నమోదైన ఓట్లను పరిశీలిస్తే ట్రంప్‌ తన విధానాల పట్ల మద్దతును పెంచుకున్నట్లే కనిపిస్తోంది.

2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుచుకున్న ఓట్లు 6,29,84,824. పోలైన మొత్తం ఓట్లలో అవి 46 శాతం. 2020 ఎన్నికల్లో 7,19,25,299కి పెరిగి, 47.5 శాతంగా నమోదయ్యాయి. ఈ లెక్కన ట్రంప్‌ ఓడినా, ఆయన వాదనకు జనామోదం పెరిగిందని ఓట్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020 సెనేట్‌ ఎన్నికల్లో పరిస్థితిని పరిశీలిస్తే- రిపబ్లికన్‌ పార్టీ 18 సీట్లను కైవసం చేసుకుని సెనేట్‌లో 48 సీట్ల బలం సంపాదించింది. డెమోక్రటిక్‌ పార్టీ 13 సీట్లను గెలుచుకొని 46 స్థానాలకు పరిమితమైంది. మరో రెండు స్థానాలు స్వతంత్రుల చేతిలో ఉన్నాయి. జార్జియాలో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికీ 50 శాతం మించి ఓట్లు రాలేదు. దీంతో అక్కడ మళ్లీ జనవరి ఆరంభంలో ఎన్నిక జరపనున్నారు. ఈ నేపథ్యంలో, జార్జియాలో నిర్వహించే ‘రన్‌ఆఫ్‌’ ఎన్నిక కీలకంగా మారింది. బైడెన్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలంటే, సెనేట్లో ఆధిక్యం సాధించాల్సిందే. లేనిపక్షంలో రిపబ్లికన్లపై ఆధార పడాల్సి వస్తుంది.

పార్టీని గుప్పిట్లో పెట్టుకునే వ్యూహం

అమెరికా ఆవిర్భావం నుంచీ అక్కడి రాజకీయాల్లో భాగమైన ‘సబ్‌టెర్రేనియన్‌ భావజాలం’తో ట్రంప్‌ అనుసంధానమయ్యారు. ఫలితంగానే ఆయనకు అంతటి ఆదరణ లభించింది. జాతి, లింగ, వర్గ, శాస్త్రీయ దృష్టి వంటి అంశాల పట్ల వేళ్లూనికుని ఉన్న ప్రగాఢ మితవాద విశ్వాసాలు, భావజాలాల సమ్మేళనాన్నే ట్రంపిజంగా వ్యవహరిస్తున్నారు. ఈ నయా మితవాద వాతావరణం ట్రంప్‌ సృష్టించిందేమీ కాదు. కాకపోతే, ఈ భావజాలం ప్రధాన రాజకీయ స్రవంతిలోకి చొరబడేందుకు ఆయన వాహకంగా మారారు. ఈ భావజాలం తనకు అనుబంధంగా పనిచేసే గ్రూపుల రూపంలో రిపబ్లికన్‌ పార్టీకి గణనీయంగా ఓట్లు సమకూర్చినా, అవి పార్టీలో భాగం కాదు. ఈ గ్రూపులు పార్టీ అదుపాజ్ఞల్లో ఉండేవీ కావు. అయితే ఈ తరహా సమూహాలను పార్టీతో అనుసంధానించిన ఘనత పూర్తిగా ట్రంప్‌, ఆయన అనుచరులదే. రిపబ్లికన్‌ పార్టీపై ట్రంప్‌ భల్లూకపు పట్టుకు మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఎన్నికల ఓటమితో నిమిత్తం లేకుండా ట్రంప్‌, ఆయన విశ్వాసపాత్రులు పార్టీని గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఉంది. డెమోక్రాట్లు, తమ ప్రత్యర్థులుగా భావించే ఇతరులతో ఘర్షణ వైఖరిని కొనసాగిస్తూనే ఉంటారు.

విభజన రాజకీయాలు

ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్‌ అధ్యక్ష పాలనకు గీటురాళ్లయిన విభజన రాజకీయాలు- ఆయన ఓటమి అనంతరమూ యథేచ్ఛగా కొనసాగనున్నాయి. అమెరికాలో అటు రిపబ్లికన్‌ పార్టీతో పాటు, ఇటు డెమోక్రటిక్‌ పార్టీలోనూ ప్రమాదకరమైన బీటలు కనిపిస్తున్నాయి. 2016నాటి అధ్యక్ష ఎన్నికల అనంతరం, రాడికల్‌ వర్గాల ప్రాబల్యం పెరగడమనే ప్రమాదాన్ని రెండు పార్టీలూ ఎదుర్కొంటున్నాయి. సామాజిక-రాజకీయ, ఆర్థిక సంస్కరణల నత్తనడక పట్ల అసహనంగా ఉన్న వామపక్ష వర్గాల నుంచి డెమోక్రటిక్‌ పార్టీ అధినాయకత్వానికి పెను సవాలు ఎదురవుతోంది. బెర్నీ శాండర్స్‌, ద స్క్వాడ్‌ డెమోక్రాట్స్‌ (2018లో ప్రతినిధుల సభకు ఎన్నికైన నలుగురు మహిళలు- అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్‌, న్యూయార్క్‌; ఇల్హన్‌ ఒమర్‌, మిన్నెసోటా; అయన్నా ప్రెస్లీ, మసాచుసెట్స్‌; రషీదా త్లాయిబ్‌, మిషిగన్‌)- వామపక్ష ఆకాంక్షలపై పదేపదే గళం విప్పుతున్నారు. ఇక ట్రంప్‌, స్టీఫెన్‌ కెవిన్‌ బానన్‌ విసిరిన శుద్ధ మితవాద సవాలుకు రిపబ్లికన్‌ పార్టీ వ్యవస్థ లొంగిపోయింది. పార్టీలోని వామపక్ష శక్తులను అదుపు చేయడంలో విఫలం కావడం వల్లే గత అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లు భారీ మూల్యం చెల్లించారు. తాజా ఎన్నికల్లో ట్రంప్‌ పరాజయానికి ఆ పార్టీ మితవాద వ్యవస్థే కారణమైనట్లు స్వింగ్‌ రాష్ట్రాల ఓటింగ్‌ సరళి స్పష్టం చేస్తోంది.

ఆందోళనకర మార్పులు

విభజన రాజకీయాలకు తావు లేదంటూ బైడెన్‌ స్పష్టం చేస్తున్నా- అమెరికా దేశీయ రాజకీయాల్లో పెరుగుతున్న అగాథాన్ని పూడ్చటం కష్టతరమే. కొవిడ్‌ మహమ్మారిని తోసిరాజంటూ అసాధారణ రీతిలో ఓటర్లు వెల్లువెత్తడానికి దారితీసిన సమకాలీన అంశాలను బైడెన్‌ ప్రభుత్వం విస్మరించజాలదు. కొవిడ్‌ సంబంధిత ప్రజారోగ్య చర్యలు, పోలీసు సంస్కరణలు, వలస నిబంధనల్లో సడలింపులు వంటి అంశాలపై బైడెన్‌ ప్రభుత్వం చేపట్టే ఎలాంటి నిర్ణయాత్మక చర్య అయినా సరే, ఆవేశకావేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికా సమాజం నిలువునా చీలేట్లయితే, బహుళపక్ష అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహించే సామర్థ్యం తిరిగి పొందగలదా? మరీ ముఖ్యంగా, చైనా అత్యున్నత శక్తిగా ఆవిర్భవించాలని ప్రయత్నిస్తున్న ప్రస్తుత సమయంలో ఈ పరిణామాన్ని ఆందోళనకరంగానే భావించాలి.

- కుమార్‌ సంజయ్‌సింగ్‌

(దిల్లీ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.