ETV Bharat / opinion

దేవుడు రాసిన స్క్రిప్ట్.. 10ఏళ్ల క్రితం రాహుల్​ గాంధీ ఆ ఆర్డినెన్స్​ను చింపకుండా ఉండుంటే..

author img

By

Published : Mar 24, 2023, 6:32 PM IST

Updated : Mar 24, 2023, 6:50 PM IST

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడం, వెంటనే ఆయనపై అనర్హత వేటు పడడం.. పదేళ్ల నాటి ఓ ఘటనను గుర్తుకు తెస్తోంది. 2013 సెప్టెంబర్​లో మీడియా ముందు రాహుల్​ ఓ ఆర్డినెన్స్​ కాపీని చింపేసిన సంగతి.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ.. కాంగ్రెస్ అగ్రనేత అప్పుడు ఎందుకలా చేశారు? ఆ కాగితంలో ఏముంది? రాహుల్ అలా చేయకుండా ఉండుంటే.. ఇప్పుడు అనర్హత వేటును తప్పించుకునేవారా?

Rahul Gandhi disqualified
Rahul Gandhi disqualified

2013 సెప్టెంబర్ 27.. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రెస్​ మీట్.. ఒక్కసారిగా యువనేత రాహుల్​ గాంధీ ఎంట్రీ.. ఎందుకొచ్చారా అని సహచర నేతలు చూస్తుండగానే షాకింగ్ పరిణామం.. చేతిలో ఉన్న పేపర్​ను కసి తీరా చింపేశారు రాహుల్ గాంధీ.
"మా పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోందో నేను ఇప్పుడు మీకు చెబుతున్నా. కొన్ని రాజకీయ కారణాలతోనే మేము (యూపీఏ ప్రభుత్వం) ఈ ఆర్డినెన్స్​ తీసుకురావాల్సి వచ్చింది. ఆ విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్, బీజేపీ, జనతా దళ్, సమాజ్​వాదీ పార్టీ.. అందరూ ఇలానే చేస్తారు. ఈ నాన్​సెన్స్​కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది" అంటూ సీరియస్ కామెంట్స్​ చేసి.. ప్రెస్​మీట్​ నుంచి వెళ్లిపోయారు రాహుల్.

సీన్​ కట్ చేస్తే..
2023 మార్చి 24.. 'కేరళలోని వయనాడ్​ ఎంపీ రాహుల్​ గాంధీపై అనర్హత వేటు' అంటూ లోక్​సభ సచివాలయం నుంచి ప్రకటన వెలువడింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత నిబంధనలు సహా 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే.. ఇదంతా కక్షపూరితం అంటూ కాంగ్రెస్​ నేతాగణం బీజేపీ సర్కార్​పై విమర్శల దాడికి దిగింది. సూరత్​ కోర్టు తీర్పుపై అపీలుకు వెళ్లే సమయమైనా ఇవ్వకుండా మరుసటి రోజే అనర్హత వేటుపై ప్రకటన జారీ చేయడం దురుద్దేశపూర్వకమేనని మండిపడింది. అయితే.. అంతా చట్ట ప్రకారమే జరిగిందనేది బీజేపీ మాట. రెండు ప్రధాన పార్టీల మాటల యుద్ధం నడుమ.. మరో చర్చ సాగుతోంది. 2013లో రాహుల్​ గాంధీ ఆ ఆర్డినెన్స్​ విషయంలో అలా చేయకుండా ఉండుంటే.. ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదన్నది విశ్లేషకుల మాట.

2013 ఆర్డినెన్స్​లో ఏముంది?
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలు సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాసేలా 2013లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తెచ్చింది. సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఎవరైనా దోషిగా తేలితే.. వారిపై 3 నెలల వరకు అనర్హత వేటు వేయరాదన్నది ఆ ఆర్డినెన్స్​ సారాంశం. ఈ అత్యవసర ఆదేశం ప్రతులనే దిల్లీలో ప్రెస్​మీట్​లో అందరి ముందు చింపేశారు రాహుల్ గాంధీ. ఫలితంగా కొన్నిరోజులకు ఆ ఆర్డినెన్స్​ను యూపీఏ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హుల్ని చేసే నిబంధన అమలైంది. ఆ నిబంధన కారణంగానే ఇప్పుడు రాహుల్​ గాంధీపై వేటు పడింది.

ఆ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారు?
చట్టసభలు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుకు సంబంధించి.. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు శిక్ష పడితే ఏం చేయాలన్నదానిపై ఆ చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే కేసుల్లో దోషిగా తేలితే.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవికి అనర్హులవుతారు. శిక్షా కాలం పూర్తయ్యాక మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదు. అయితే.. ఒకప్పుడు ఈ చట్టంలోని నిబంధనలు మాజీ ప్రజాప్రతినిధులకు, సిట్టింగ్ సభ్యులకు వేర్వేరుగా ఉండేవి. మాజీ ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హులవుతారు. కానీ.. సిట్టింగ్​ సభ్యులకు మాత్రం దోషిగా తేలిన తర్వాత 3 నెలల పాటు సమయం ఉంటుంది. ఈలోగా పైకోర్టుకు అపీలుకు వెళ్లి, తీర్పు మారేలా చేసుకుంటే.. అనర్హత వేటు తప్పుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ లిలీ థామస్ అనే మహిళ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేశారు. 3 నెలలు ఆగాల్సిన పని లేకుండా.. వెంటనే అనర్హత వేటు పడాల్సిందేనని సుప్రీంకోర్టుతోనే చెప్పించారు.

యూపీఏ ఆర్డినెన్స్​కు కారణం వారే!
ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు.. అప్పటి యూపీఏ ప్రభుత్వ పెద్దల్ని కలవరపాటుకు గురిచేసింది. అసలే ఎన్నికల సమయం. వేర్వేరు రాష్ట్రాల్లోని మిత్రపక్షాల నేతల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. వీరిలో ముఖ్యులు.. రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. బిహార్​ రాజకీయాల్లో ఎంతో కీలకమైన ఆయనపై అప్పట్లో దాణా కుంభకోణం కేసు విచారణ జోరుగా సాగుతోంది. ఆయన దోషిగా తేలితే, అనర్హత వేటు పడే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు.. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్.. అవినీతి కేసులో దోషిగా తేలి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇలా చేసినందుకు బీజేపీ, వామపక్షాలు సహా ఇతర విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది నాటి మన్మోహన్ ప్రభుత్వం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రత్యర్థి పార్టీ విమర్శలను ఎదుర్కొంటూ, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్​ నేతలకు 2013 సెప్టెంబర్​ 27న తమ యువనేత కారణంగానే భారీ షాక్ తగిలింది. ప్రెస్​మీట్​లో ఆర్డినెన్స్ కాపీని రాహుల్ చింపేయడం, సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం.. సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనలో ఉండగా ఇలా జరగడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది నెలలే సమయం ఉన్న వేళ.. యూపీఏ హయాంలో జరిగిన 2జీ, అగస్టా వెస్ట్​లాండ్​ కుంభకోణాల నుంచి దూరంగా జరిగేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారన్న విశ్లేషణలు అప్పట్లో వినిపించాయి. పార్టీ పరంగా కాక.. ప్రధాని పదవిని కించపరిచేలా వ్యవహరించారన్న విమర్శలూ వెల్లువెత్తాయి.

అయితే.. ఆవేశంలో అలా చేశానంటూ మన్మోహన్​కు కొద్దిరోజులకు లేఖ రాశారు రాహుల్. కానీ.. తాను చెప్పిన విషయాన్ని పూర్తిగా నమ్ముతున్నానని స్పష్టం చేశారు. చివరకు.. అక్టోబర్ 2న అప్పటి ప్రధాని మన్మోహన్​ను వ్యక్తిగతంగా కలిశారు రాహుల్ గాంధీ. ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవడమే మేలని కాసేపటికి జరిగిన కాంగ్రెస్ కోర్​ గ్రూప్​ సమావేశంలో నిర్ణయించారు. మరుసటి రోజే ఆర్డినెన్స్​ను వాపస్ తీసుకున్నారు. ఫలితంగా.. దోషిగా తేలిన వెంటనే అనర్హత వేటు పడే నిబంధన యథాతథంగా అమలైంది. దాదాపు పదేళ్ల తర్వాత రాహుల్ గాంధీపై అదే నిబంధన ప్రకారం వేటు పడింది.

ఇవీ చదవండి : రాహుల్​ గాంధీపై అనర్హత వేటు ఫైనలా? మార్చొచ్చా? ఫైజల్​ కేసు ఏం చెబుతోంది?

8ఏళ్లు ఎన్నికలకు రాహుల్​ గాంధీ దూరం! అదొక్కటే ఆలస్యం!! 'ఆమె' పోరాటం వల్లే ఇలా..

Last Updated : Mar 24, 2023, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.