ETV Bharat / opinion

పేదోడి కరోనా కష్టాలు తీర్చే బాధ్యత ప్రభుత్వాలదే! - కరోనా వైరస్ ప్రభావం

ఆకస్మిక కరోనా పరిణామం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ముఖ్యంగా బీదలపాట్లు వర్ణనాతీతం. పట్టణ ప్రాంతాల్లో ఆహార పంపిణీ కేంద్రాలు కొంతమేర ఆదుకుంటున్నప్పటికీ గ్రామాల్లో సబ్సిడీ సరకులను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!

corona lockdown
కరోనా కట్టడిలో పేదోడి కష్టాలు
author img

By

Published : Apr 16, 2020, 9:44 AM IST

ప్రపంచవ్యాప్తంగా కమ్మేసిన కరోనా వైరస్‌ పెద్ద సంఖ్యలో ప్రజలను పొట్టనపెట్టుకుంది. ఈ వైరస్‌ మహమ్మారిని అరికట్టేందుకు ఆయా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 శాతం ప్రజలు స్వీయనిర్బంధానికే పరిమితమయ్యారని అంచనా. వారిలో అత్యధిక శాతం భారత్‌లోనే ఉన్నారు. అమెరికాలో 17.2 కోట్లవరకు, ఐరోపా దేశాల్లో 30 కోట్ల మేరకు స్వీయనిర్బంధంలో ఉండగా లాటిన్‌ అమెరికాలో మాత్రం పోలీస్‌ పహారాలో నిర్బంధం కొనసాగుతోంది.

పంటలు అందితే..

పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆహార ధాన్యాల కొరత ఎదురుకాకతప్పదు. అందువల్ల పంట ఉత్పత్తుల సేకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయమిది. ప్రస్తుతం దేశంలోని ఆహార సంస్థల వద్ద మార్చి 9 నాటికి 584.97 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 53శాతం బియ్యం, 47శాతం గోధుమలు.

అత్యధికంగా పంజాబ్‌లో 202.52 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండగా, తెలంగాణలో 27.70, ఆంధ్రప్రదేశ్‌లో 21.21 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార పదార్థాలు నిల్వ ఉన్నాయి. ప్రస్తుత రబీ కాలంలో నిరుటికంటే 1.47శాతం వాటి సాగు పెరిగింది. ఆ పంటలు చేతికి అందితే ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కావు. కానీ కరోనా ప్రభావం కారణంగా ఆ పంటలు సకాలంలో చేతికి అందేలా లేవు.

ప్రతి గింజ కొనుగోలు..

అకాల వర్షాల బెడదా పొంచి ఉంటుంది. వీటివల్ల ఇప్పటికే కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రస్తుతం రైతుల నుంచి నేరుగా ధాన్య సేకరణ చేస్తున్న ప్రభుత్వం, తేమ ఉన్న పంటలను కొనుగోలు చేయడంలేదని రైతులు వాపోతున్నారు. కాబట్టి రైతుకు అన్యాయం చేయకుండా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖపై ఉంది.

భారత ఆహార సంస్థ కీలకపాత్ర పోషించాల్సిన సమయమిది. దేశంలో సుమారు 81 కోట్ల మంది సబ్సిడీ ఆహార పదార్థాల మీదే ఆధారపడుతున్నారు. వీరికి అందించే ఆహార పదార్థాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బియ్యం, పంచదార, కిరోసిన్‌ మాత్రమే అందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు అందించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అండగా నిలవాల్సిన సమయమిది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి 2.4 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికీ ఇవ్వలేదు. అయినప్పటికీ ఎఫ్‌సీఐ ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకొని ప్రజలకు నిరంతరాయంగా సబ్సిడీ సరకులు అందచేస్తూ సంస్థ బాధ్యతను నెరవేరుస్తుంది.

ఎఫ్​సీఐకి సాయమందించాలి..

ఇలాంటి కష్టకాలంలో ఎఫ్‌సీఐకి కేంద్రం బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పదార్థాల కోసం 1.51 లక్షల కోట్లు కేటాయించినా సవరణలో భాగంగా 75 వేల కోట్ల రూపాయలకే కుదించారు. అయితే నిధులు కేటాయిస్తున్నారు కానీ విడుదల చేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

మరో అంశం ఏమిటంటే ఎఫ్‌సీఐ ఖర్చు చేయాల్సిన నిధులను సకాలంలో ఖర్చు చేయడం లేదనేది స్పష్టం అవుతుంది. 2017-18 నుంచి 2019-20 మధ్య కాలంలో పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు చేయకపోగా సగటున 63శాతం నిధులు మాత్రమే వ్యయపరచారు. కాబట్టి నిధులను సద్వినియోగం చేసుకొని సరిపడా గోదాములను నిర్మించాల్సిన అవసరం ఉంది.

అమెరికాలోనే..

అదే విధంగా నిత్యావసర సరకులను దండిగా నిల్వ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన సమయమిది. ప్రస్తుతం మన దేశంలో ఆహార కొరత లేదు. కానీ ప్రస్తుత స్వీయ నిర్బంధాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

కరోనా తీవ్రతను అమెరికా కలలో కూడా ఉహించి ఉండదు. కానీ ఈ రోజు ఆ దేశమే కరోనా కారణంగా తీవ్ర నష్టాన్ని మూటగట్టుకొని పేదలను ఆదుకోలేక చేతులెత్తేసే పరిస్థితిలో ఉంది. అలాంటి పలు ప్రపంచ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలను ఆకలి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అదే విధంగా పేదలకు ప్రకటించిన నగదు సహాయాన్ని ప్రభుత్వాలు వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకొని వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన సమయమిది.

(డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌- ‘సెస్‌’లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.