ETV Bharat / opinion

పండుగ రోజుల్లో జాగ్రత్త! అప్రమత్తతే శ్రీరామరక్ష

పండుగల హడావిడి ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో కరోనా వైరస్​ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. నగరాల నుంచి ప్రజలు స్వస్థలాలకు భారీగా తరలిపోతుంటారు. ఈ క్రమంలో మహమ్మారి ఒకచోట నుంచి మరో చోటుకు వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. దీన్ని నిరోధించడానికి ప్రభుత్వాలు, ప్రజలు, వైద్యులు అప్రమత్తంగా మెలగాలి.

People need to be more vigilant during festivals due to the corona.
పండుగ రోజుల్లో జాగ్రత్త! అప్రమత్తతే శ్రీరామరక్ష
author img

By

Published : Oct 18, 2020, 7:09 AM IST

స్కూళ్లు, సినిమాలతోపాటు అన్ని వ్యాపారాలపై కరోనా ఆంక్షలు ఎత్తివేసి పునఃప్రారంభానికి అనుమతించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా వైరస్‌ కొత్త లక్షణాలు బయటపడుతూ, సమర్థ చికిత్స కోసం ప్రపంచమంతా ఇంకా అన్వేషిస్తున్న సమయంలో- ఇలా ఒత్తిడి పెరగడం చిక్కులు కొనితెస్తోంది. కరోనా కారణంగా వచ్చే కొవిడ్‌ వ్యాధిని తట్టుకోవడానికి ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరగాల్సి ఉంది. ఈ వైరస్‌ దీర్ఘకాలంలో చూపే ప్రభావంపై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా ఒకసారి వచ్చివెళ్లాక మళ్ళీ సోకే అవకాశం ఉందంటున్నారు. ఈ కీలకాంశాలపై వైద్య ప్రపంచం తుది నిర్ధారణకు రావలసి ఉంది. ఇలాంటి పరిస్థితిలో దసరా, దీపావళి పండుగల సీజన్‌ ప్రారంభమవుతోంది. జనం షాపింగ్‌ కోసం దుకాణాలు, మాల్స్‌, సినిమాలు, పార్కులు, బంధుమిత్రుల ఇళ్లకూ వెళ్ళే సమయమిది. నగరాల నుంచి స్వస్థలాలకు జనం భారీయెత్తున తరలిపోతుంటారు. దీంతో వైరస్‌ ఒకచోటి నుంచి మరోచోటికి వేగంగా వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది. దీన్ని నిరోధించడానికి ప్రభుత్వాలు, వైద్యులు, ప్రజలు అప్రమత్తంగా మెలగాలి. సరైన వ్యూహాలు అనుసరించాలి. సార్స్‌-కోవ్‌ 2 లేదా కరోనా వైరస్‌ కొన్ని జన సముదాయాల్లో విరివిగా వ్యాపిస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి మధ్య భిన్న లక్షణాలు ప్రదర్శిస్తోంది.

సమాచారం కీలకం..

దక్షిణ కొరియా, జపాన్‌, సింగపూర్‌, జర్మనీ వంటి సంపన్న దేశాలు భారీయెత్తున టెస్టింగ్‌, ట్రేసింగ్‌లను నిర్వహించి కొవిడ్‌ వ్యాప్తిని అదుపు చేయగలిగాయి. ప్రజారోగ్య రక్షణ యంత్రాంగాన్ని సమర్థంగా రంగంలోకి దింపడం ద్వారా ఈ విజయాన్ని సాధించాయి. ఈ దేశాల కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ జనాభా ఉన్న భారతదేశంలో అవే పద్ధతులను అనుసరించి అదే స్థాయి విజయం సాధించడం నిజంగా సవాలే. అలాగని ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించజాలదు. పెరిగిపోతున్న కరోనా కేసులను ఎప్పటికప్పుడు పసిగట్టి సత్వర చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో వైరస్‌ మళ్లీ విరుచుకుపడినా ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలి. మన ప్రజావైద్య రంగంలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. ఆస్పత్రులు, వ్యాక్సిన్లు, ఔషధాలతో భావి సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. కరోనాపై పోరాటంలో ముందుండే వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి టీకాలు వేసి యుద్ధ సన్నద్ధులుగా ఉంచాలి. కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న జన వర్గాల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా కేసులు పెరిగినా దీటుగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి.

ప్రపంచ దేశాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా కరోనా వైరస్‌ జన్యు క్రమం, దాన్ని ఎదుర్కొనే మార్గాల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతోంది. కరోనా వైరస్‌పై తిరుగులేకుండా పనిచేస్తుందని రుజువైన ఔషధమేదీ లేకపోయినా, ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోగలుగుతున్నాం. కొవిడ్‌ తీవ్రతను, మరణాల రేటునూ తగ్గించగలుగుతున్నాం. కరోనా వైరస్‌ గురించి ఇంతకుముందు సరైన సమాచారం లేకపోవడం వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఇప్పుడు సమగ్ర సమాచారం అందుబాటులో ఉన్నందువల్ల మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా ఆర్థిక దుష్ప్రభావాలను నివారించడం సాధ్యమవుతుంది. కరోనా తెచ్చిపెట్టిన లాక్‌డౌన్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా 7.1 కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోనున్నారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. దీన్ని నివారించాలంటే లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించక తప్పదు. అయితే, ఇందుకు సహేతుక పద్ధతిని పాటించాలి. ఇంతవరకు విధించిన ఆంక్షలు జనం ఎక్కువమంది ఒకచోట గుమిగూడకుండా చూడటానికి ఉద్దేశించినవి. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి ఆంక్షలు సడలించి జనం గుంపులుగా మార్కెట్లకు, మాల్స్‌కు, పబ్బులకు గుంపులుగా వెళ్లడానికి అనుమతిస్తే వైరస్‌ విజృంభణకు తావిచ్చినట్లే!

బాధ్యత అందరిదీ...

కొవిడ్‌ మన సమాజంలో ఇంతకుముందు నుంచి ఉన్న లోపాలను బయటపెట్టింది. వైద్య చికిత్స రంగం మన దేశ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో లేకపోవడం వల్ల కలిగే అనర్థమేమిటో కొవిడ్‌ వెల్లడించింది. వైరస్‌పై పోరాటంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు తగు భద్రత కల్పించలేకపోతున్నామనీ స్పష్టీకరించింది. ఆర్థిక రథాన్ని మళ్ళీ పట్టాలకు ఎక్కించి, ప్రజల జీవనోపాధిని పునరుద్ధరించడం ఆవశ్యకమే కానీ, ఈ లక్ష్యాలు నెరవేరాలంటే పైన చెప్పుకున్న లోపాలను యుద్ధ ప్రాతిపదికపై సరిదిద్దాలి. త్వరలో బిహార్‌ శాసన సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఉప ఎన్నికలూ జరగనున్నాయి. పోలింగ్‌లో పాల్గొనడానికి ఓటర్లు సహజంగానే పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వీరు ఒకరికొకరు తగు దూరం పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది కానీ, అంతకన్నా ముఖ్యంగా ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకొంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. వైరస్‌ వ్యాపకులుగా మారకుండా ఎవరికి వారు జాగ్రత్తపడాలి. లేకపోతే వైరస్‌ నిరోధంలో గడచిన ఏడెనిమిది నెలలుగా సాధించిన పురోగతి కాస్తా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. వైరస్‌పై అంతిమ విజయం వ్యక్తుల బాధ్యతాయుత ప్రవర్తన ద్వారానే సిద్ధిస్తుంది. వ్యక్తులు, వ్యాపారాలు, సమాజంలో అన్ని వర్గాలూ నిబద్ధతతో ముందుకు కదిలితేనే కరోనా వైరస్‌ భరతం పట్టగలుగుతాం!

-- డాక్టర్‌ అనిల్‌ కృష్ణ గుండాల (హృద్రోగ నిపుణులు)

ఇదీ చూడండి: కేరళలో ఆగని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 9,016 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.