ETV Bharat / opinion

అవినీతి గుంతల్లో జనశ్రేయం - రోడ్లపై కథనాలు

మారుమూల గ్రామాలకు వీలైనంత త్వరగా రహదారి సౌకర్యం కల్పించేందుకంటూ సుమారు రెండు దశాబ్దాలక్రితం వాజ్‌పేయీ చేతుల మీదుగా 'పీఎం గ్రామ్‌ సడక్‌ యోజన' ప్రారంభమైంది. ఇప్పటికీ దేశ జనాభాలో దాదాపు 69శాతం దాకా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. రహదారులు లేని జనావాసాలు నేటికీ పెద్దయెత్తున పోగుపడి ఉండగా, రోడ్లు వేసిన చోట్లా సకాలంలో మరమ్మతులకు నోచక ప్రజానీకం పడుతున్న అవస్థలు చెప్పనలవి కాదు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతావనిలో రహదారుల అధ్వానస్థితిని క్షేత్రస్థాయి విశ్లేషణాత్మక కథనాలు కళ్లకు కడుతున్నాయి.

roads
గుంతల రోడ్లు
author img

By

Published : Sep 7, 2021, 5:49 AM IST

Updated : Sep 7, 2021, 10:09 AM IST

పల్లెసీమలకు సరైన రవాణా సదుపాయాలు కల్పిస్తే వ్యవసాయాభివృద్ధి, ఉపాధి వనరుల పెంపుదల సుసాధ్యమై పేదరికం ఉపశమిస్తుందన్న విశ్లేషణలెన్నో లోగడ వెలుగుచూశాయి. ఆ సదాశయ స్ఫూర్తికి గొడుగు పడుతూ మారుమూల గ్రామాలకు వీలైనంత త్వరగా రహదారి సౌకర్యం కల్పించేందుకంటూ సుమారు రెండు దశాబ్దాలక్రితం వాజ్‌పేయీ చేతుల మీదుగా 'పీఎం గ్రామ్‌ సడక్‌ యోజన' ప్రారంభమైంది. ఇప్పటికీ దేశ జనాభాలో దాదాపు 69శాతం దాకా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. రహదారులు లేని జనావాసాలు నేటికీ పెద్దయెత్తున పోగుపడి ఉండగా, రోడ్లు వేసిన చోట్లా సకాలంలో మరమ్మతులకు నోచక ప్రజానీకం పడుతున్న అవస్థలు చెప్పనలవి కాదు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతావనిలో రహదారుల అధ్వానస్థితిని క్షేత్రస్థాయి విశ్లేషణాత్మక కథనాలు కళ్లకు కడుతున్నాయి. దక్షిణాదినా కొత్తగా వేసిన రోడ్లు ఎన్నో ఒకటి రెండు వానలకే గుంతలమయమై పాదచారులకు, వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. గుత్తేదారులు ఉద్దేశపూర్వకంగానే తక్కువ ధర కోట్‌ చేసి టెండర్లు దక్కించుకుంటున్నారని, నిర్మాణ పనుల్లో నాణ్యతను గాలికొదిలేస్తున్నారని పార్లమెంటరీ స్థాయీసంఘం ఏడాదిన్నర క్రితం సూటిగా ఆక్షేపించింది. అవినీతి అధికారులు, గుత్తేదారుల మధ్య లోపాయికారీ ఒప్పందాల్ని ఛేదించాలంటే కనీస టెండర్‌ మొత్తాలు నిర్ణయించాలని కమిటీ అప్పట్లో సూచించింది. గుత్తేదారులు జేబులోంచి తీసి ఖర్చు పెట్టరు. ఫలానా రోడ్డు నిర్మాణానికి ఎంత వెచ్చించాల్సి వస్తుందో ప్రభుత్వానికీ తెలుసు.హేతుబద్ధమైన వ్యయ అంచనా ఖరారయ్యాక, తగిన మొత్తానికి కాంట్రాక్ట్‌ పనులు అప్పగించాక- అమలులో అడుగడుగునా డేగకన్ను పర్యవేక్షణ ఉండితీరాలి. రోడ్ల నాణ్యతను పరిశీలించే నిమిత్తం- ప్రత్యేక వ్యవస్థ అవసరమన్న కేంద్ర మంత్రి కపిల్‌ పాటిల్‌ తాజా ప్రతిపాదనకు సత్వరం మన్నన దక్కాలి. రోడ్డు వేశాక కనీసం అయిదేళ్ల పాటు మరమ్మతుల బాధ్యతపై నిబంధనలు దస్త్రాలకే పరిమితం కాకుండా కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వాలు కాచుకోవాలి. అంత పకడ్బందీగా వ్యవహరిస్తేనే, భారీయెత్తున వెచ్చిస్తున్నామంటున్న ప్రజాధనంలో ప్రతి రూపాయీ సద్వినియోగమవుతుంది.

'గుంతలు లేని రోడ్లు, సరైన పాదచారి బాటలు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు' అని ఆరేళ్ల క్రితం బాంబే హైకోర్టు ధ్రువీకరించింది. సక్రమంగా లేని రహదారులు, గుంతలమయమైన పాదచారి బాటలు పౌరుల ప్రాణాలకు పెనుముప్పుగా కర్ణాటక ఉన్నత న్యాయస్థానం అభివర్ణించడాన్ని నిరుడు సుప్రీంకోర్టూ సమర్థించింది.'గ్రామ్‌ సడక్‌ యోజన అమలు బాధ్యత కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతోపాటు సంబంధిత రాష్ట్రప్రభుత్వాలదీ' అని కాగ్‌(కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదిక నిర్ధారించిన సందర్భాలున్నాయి. ఆ స్ఫూర్తికి గొడుగు పడుతున్నదెక్కడ?వాస్తవంలో స్థానిక సంస్థలు, గుత్తేదారులు, రాష్ట్రాల రహదారి విభాగాల అధిపతులది తిలాపాపం తలా పిడికెడని సుప్రీం ధర్మాసనం ఛీత్కరించినా- ఎక్కడికక్కడ అవినీతి వాటాలు నిక్షేపంగా తెగుతూనే ఉన్నాయి. సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ వంటివి రాదారి భద్రతను పెంపొందించేందుకు రహదారి నిర్మాణ సంస్థలు, వాహన తయారీ కంపెనీలు, ఇంజినీర్లు, రవాణా యంత్రాంగం, ఆస్పత్రుల వరకు అందరికీ భాగస్వామ్యం కల్పిస్తున్నాయి. అదే ఇక్కడ రహదారి నిర్మాణ పద్దులో లెక్కకు మిక్కిలి అవకతవకలు, లొసుగులు, లోపాలు అంతర్భాగమై- జనశ్రేయాన్ని అవినీతి గుంతల్లో పూడ్చేస్తున్నాయి. గడ్డి కరిచిన గుత్తేదారుల వివరాలతో జాతీయ సమాచార నిధినొకదాన్ని రూపొందించాలని పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించి నాలుగేళ్లయింది. ఒక రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడినవాళ్లకు మరో రాష్ట్రంలో కాంట్రాక్టులు లభించకుండా చూసేందుకు అటువంటి సమాచార నిధి ఎంతో ఉపయుక్తమవుతుంది. రహదారి నిర్మాణంలో లోటుపాట్లకు గుత్తేదారుల్ని మాత్రమే బోనెక్కిస్తే సరిపోదు. వాళ్లతోపాటు ఇంజినీర్లను అధికార సిబ్బందిని నేరుగా బాధ్యుల్ని చేస్తేనే- రోడ్లు, జనం బతుకులు బాగుపడతాయి!

ఇదీ చూడండి: భారత్​ @కోటి డోసులు.. 11 రోజుల్లో మూడోసారి..

Last Updated : Sep 7, 2021, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.