ETV Bharat / opinion

నిధుల కొరతతో కోమాలో దేశారోగ్యం - global inequality report

ప్రఖ్యాత 'ఆక్స్​ ఫామ్​' సంస్థ అసమానతల తగ్గింపు నిబద్ధతా సూచీని వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం సర్వే నిర్వహించిన 158 దేశాల్లో 129వ స్థానానికి భారత్ పరిమితమైంది. బడ్జెట్​లో ఆరోగ్యానికి కేటాయింపులు 4 శాతానికి మించటంలేదని పేర్కొంది. ఇది ప్రపంచంలోనే నాలుగో అత్యంత కనిష్ఠ వ్యయంగా స్పష్టం చేసింది.

oxfarm report on indian health care sector
నిధుల కొరతతో కోమాలో దేశారోగ్యం
author img

By

Published : Oct 14, 2020, 8:21 AM IST

విశ్వ జనాభాలో 17శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్‌ అంతర్జాతీయంగా వివిధ వ్యాధుల భారంలో అయిదోవంతు దాకా తలకెత్తుకోవాల్సి వస్తోంది. ఈ దుస్థితికి మూలాలు ఎక్కడున్నాయో దేశదేశాల స్వచ్ఛంద సంస్థల సమాఖ్య 'ఆక్స్‌ఫామ్‌' తాజా అధ్యయన నివేదిక ఎలుగెత్తుతోంది. అసమానతల తగ్గింపు నిబద్ధతా సూచీలోని 158 దేశాల్లో 129వ స్థానానికి పరిమితమైన భారత్​.. తన బడ్జెట్లో ఆరోగ్యపద్దు కింద వెచ్చించేది నాలుగు శాతానికి మించడంలేదని 'ఆక్స్‌ఫామ్‌' వేలెత్తి చూపింది. ఇది ప్రపంచంలోనే నాలుగో అత్యంత కనిష్ఠ వ్యయం.

ఖర్చు కొండంత

వేరే మాటల్లో, ప్రజారోగ్య పరిరక్షణకు బడ్జెట్‌ కేటాయింపుల్లో అటు అఫ్గానిస్థాన్‌ ఇటు భారత్‌ ఇంచుమించు ఒకే తరహా ప్రాధాన్యమిస్తున్నాయి. తక్కిన ఇరుగుపొరుగు దేశాల్ని పరికించినా ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపుల్లో మనకన్నా శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ సైతం మెరుగ్గా ఉన్నాయి! దేశ జనాభాలో సగం మందికే అత్యవసర వైద్యసేవల భాగ్యం దక్కుతోందన్న నివేదిక- సర్కారీ వైద్య తోడ్పాటుపరంగానూ ఇక్కడి స్థితిగతుల్ని మదింపు వేసింది. దేశదేశాల్లో పౌరుల సొంత ఆరోగ్య వ్యయ సగటు 18శాతం. ఇక్కడేమో అనారోగ్యం పాలబడినవారు చికిత్సకయ్యే ఖర్చులో 70శాతం దాకా తామే భరించాల్సి వస్తోంది.

కొవిడ్​పై పోరులోనూ..

అసమానతల తగ్గింపులో బాగా వెనకబడిన నైజీరియా, బహ్రెయిన్‌, ఇండియా... కొవిడ్‌పై పోరులోనూ చతికిలపడ్డాయన్న విశ్లేషణ- చాటుతున్నదేమిటి? ప్రభుత్వ ప్రాథమ్య క్రమంలో నిర్లక్ష్యానికి గురైన ఆరోగ్యరంగం కొరతల కోమా పాలబడి దయనీయ దురవస్థకు దిగజారింది. సత్వర దిద్దుబాటు చర్యలెంత ఆవశ్యకమో, అందుకోసం శిరోధార్య కార్యాచరణ ఏమిటో- మెరుగైన ఆరోగ్య వ్యూహ సన్నద్ధత కలిగిన దేశాల్లో దేన్ని పరికించినా ఇట్టే బోధపడుతుంది!

బడ్జెట్​లో భారీ కోత

బడ్జెట్‌ కేటాయింపుల్లో నికర వాటా ప్రాతిపదికనా దేశీయ ఆరోగ్య పద్దు తలరాత అధ్వానమేనని 'ఆక్స్‌ఫామ్‌' నివేదిక కన్నా ముందే, ప్రపంచబ్యాంకు గణాంకాలు ధ్రువీకరించాయి. జపాన్‌ తన వార్షిక బడ్జెట్లలో సగటున సుమారు 23శాతాన్ని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేకిస్తోంది. స్వాస్థ్య పద్దుకు ఉన్నతాదాయ దేశాల కేటాయింపుల సరాసరి 18.6శాతం దాకా లెక్క తేలుతోంది. దిగువ మధ్యాదాయ దేశాల సగటు 5.1శాతం కన్నా తక్కువగా వెచ్చిస్తుండటమే, భారతావని అనారోగ్యానికి కారణమవుతోంది.

ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఎక్కడ ?

సముచిత కేటాయింపులు పొందుతున్న దేశాల్లో, ప్రతి వెయ్యిమంది రోగులకు ఒక వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక నిర్దేశాల కన్నా మెరుగైన నిష్పత్తి నమోదవుతోంది. అది జర్మనీలో 4.3; ఆస్ట్రేలియాలో 3.7. ఇక్కడ 1445 మందికి ఒక డాక్టర్‌ చొప్పున ఉన్నట్లు కేంద్రప్రభుత్వమే పార్లమెంట్లో ప్రకటించింది. 60శాతానికి పైగా జనాభా పల్లెపట్టుల్లో నివసిస్తుండగా, సుమారు 70శాతం వైద్యులు పట్టణాలకే పరిమితం కావడంవల్ల సకాలంలో సరైన ఆరోగ్య సేవలు ఎందరికో అందకుండా పోతున్నాయి. దేశంలో ఏటా అలా 24 లక్షలమంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు.

అర్హతలు లేకున్నా..

అల్లోపతీ వైద్యులుగా చలామణీ అవుతున్నవారిలో 57శాతం దాకా తగిన అర్హతలు లేనివారేనన్న అధికారిక ధ్రువీకరణ, రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కుకే నిలువునా తూట్లు పడుతున్నాయనడానికి ప్రబల సూచిక. కొవిడ్‌ సంక్షోభంతోనైనా గుణపాఠాలు నేర్చి సాకల్య క్షాళనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఆరు లక్షల మంది వైద్యులకు, 20లక్షల మంది నర్సులకు, 20శాతం దాకా ప్రాథమిక ఆరోగ్య, 30శాతం మేర సామాజిక స్వాస్థ్య కేంద్రాలకు కొరత, ఎటు చూసినా దారుణ అవ్యవస్థ- దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అరకొర కేటాయింపులతో ఆరోగ్య రంగానికి కాయకల్ప చికిత్స దుర్లభం. ‘శ్రేష్ఠ్‌ భారత్‌’ అవతరణకు ప్రజారోగ్యరంగ సముద్ధరణ ప్రాణావసరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.