ETV Bharat / opinion

కొత్త సాంకేతికతతో గృహవసతి

పెరుగుతున్న పట్టణ వలసల దృష్ట్యా ఎలాంటి వసతుల్లేని పేద, మధ్య తరగతి వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహనిర్మాణ పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణంలో కొత్త సాంకేతికతను ఉపయోగించాలని కేంద్రం ఉద్దేశించింది. ఈ అంశంపై సాంకేతిక ఉప కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. మరి ఈ కొత్త సాంకేతికతతో ఇళ్ల నిర్మాణాల వల్ల ఉపయోగమేంటి.. మొదలైన విషయాలను తెలుసుకుందాం.

editorial
కొత్త సాంకేతికతతో గృహవసతి
author img

By

Published : Jan 18, 2021, 6:54 AM IST

Updated : Jan 18, 2021, 7:18 AM IST

భారత్‌లో పట్టణీకరణ శరవేగంతో సాగుతోంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 31 శాతం పట్టణ వాసులే. 2030 నాటికి ఈ జనాభా 40 శాతానికి చేరి, 75 శాతం జీడీపీ పట్టణాల నుంచే లభిస్తుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మెరుగైన జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. ఇలాంటి వారందరికీ గృహవసతి, విద్య, ఉపాధి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాలకు పెనుసవాలుగా మారుతోంది. జీవన యోగ్యతకు గృహవసతి కల్పన కీలకమైన ప్రాధాన్యాంశం. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గూడు లేని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల కోసం రకరకాల గృహనిర్మాణ పథకాలు ప్రకటించి అమలు చేస్తున్నాయి.

2015లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను ప్రారంభించింది. 2022 నాటికి పట్టణాలు, నగరాలలో ఇళ్లు లేని వారందరికీ గృహవసతి కల్పించడం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(అర్బన్‌) లక్ష్యం. అందుకోసం 2022 నాటికి కోటి ఇళ్లు నిర్మించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటి వరకు 15 లక్షల గృహాలు నిర్మించి లబ్ధిదారులకు అందచేశారు. 37 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉండగా 12.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి నవ్య సాంకేతికతలను ఉపయోగించాలని ఉద్దేశించారు. విపత్తులను తట్టుకునేలా, తక్కువ వ్యయంతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణానికి ఉపయోగపడే నవ్య సాంకేతికత పరికల్పనలను అన్వేషించడానికి సాంకేతిక ఉపమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వంలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంక్షేమాభివృద్ధిలో భాగంగా వివిధ గృహనిర్మాణ పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం అల్పాదాయ వర్గాలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకాన్ని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వై.ఎస్‌.ఆర్‌. గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తున్నాయి.

విపరీత జాప్యం

అంతా బాగానే ఉన్నా- ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల్లో విపరీత జాప్యం జరుగుతుండటమే సమస్యగా మారుతోంది. సంఖ్యాపరమైన లక్ష్యాలను ఘనంగా నిర్దేశించుకున్నా, ఆ లక్ష్యాలను చేరుకోవడంలో భిన్న కారణాలతో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇటుక, సిమెంటు వినియోగించే సంప్రదాయ పద్ధతులతో నిర్మాణాలకు చాలా సమయం పడుతోంది. ఖర్చు అంచనాలను మించుతోంది. పర్యావరణానికీ హితకరంగా ఉండటం లేదు. పెరుగుతున్న పట్టణీకరణకు దీటుగా ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. ఇళ్ల కొరత 2019 నాటికి రెండు కోట్లకుపైగానే ఉంది.

ఈ క్రమంలో గృహనిర్మాణంలో నూతన ఆవిష్కరణలు, నవ్యసాంకేతికతల అన్వేషణకు ప్రాధాన్యం ఏర్పడింది. తక్కువ వ్యయంతో, శరవేగంగా, నాణ్యమైన గృహాల నిర్మాణానికి తోడ్పడేలా కొత్త ఆవిష్కరణలు ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా గృహ నిర్మాణ రంగంలో కనిపెడుతున్న నవీన ఆవిష్కరణలు, సాంకేతికతలను గుర్తించి, దేశంలోని భిన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మలచడం కోసం కేంద్రం 'గ్లోబల్‌ హౌసింగ్‌ టెక్నాలజీ ఛాలెంజ్‌(జీహెచ్‌టీసీ)'ను ఏర్పాటు చేసింది. తక్కువ ఖర్చుతో, ఉన్నత నాణ్యతతో, పర్యావరణ హితంగా, చిరకాలం మనగలిగే గృహనిర్మాణ సాంకేతికతల అభివృద్ధితో పాటు భవిష్యత్తులో చోటుచేసుకునే మార్పులకు అనుగుణమైన సాంకేతికతలను కూడా జీహెచ్‌టీసీ ప్రోత్సహిస్తుంది. ఇది గృహనిర్మాణ రంగంలో భిన్న వర్గాలతో సదస్సులు, సమావేశాలు నిర్వహించింది. వివిధ దేశాల నుంచి కొత్త ఆవిష్కరణల కోసం ప్రదర్శనలు ఏర్పాటు చేసింది.

లైట్​ హౌస్​ ప్రాజెక్టులు..

దేశంలోని భిన్న వాతావరణ పరిస్థితులు, జీవన యోగ్యత, నిర్వహణానుకూలత మొదలైన అంశాల ఆధారంగా 54 నవకల్పన గృహనిర్మాణ సాంకేతికతలను ఎంపిక చేసి, అందులోని ఆరు భిన్న పరిజ్ఞానాలతో దేశంలోని ఆరు నగరాల్లో లైట్‌హౌస్‌ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. జనవరి 1న ప్రధానమంత్రి వీటి నిర్మాణానికి ఆన్‌లైన్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఇందులో దేశంలోని ఇండోర్‌, రాజ్‌కోట్‌, చెన్నై, రాంచీ, అగర్తలా, లఖ్‌నవూ వంటి ఆరు నగరాల్లో వెయ్యి ఇళ్ల చొప్పున నిర్మిస్తారు. అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా, ఫిన్లాండ్‌ వంటి దేశాల్లో అవలంబిస్తున్న ఆధునిక నిర్మాణ విధానాలను అమలు చేస్తారు.

ఇండోర్‌లో ప్రీ-ఫ్యాబ్రికేటెడ్‌ సాండ్‌విచ్‌ పానెల్‌, రాజ్‌కోట్‌లో మోనోలితిక్‌ కాంక్రీట్‌, చెన్నైలో ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ (ముందస్తుగా తయారు చేసిన పలకలతో నిర్మించే ఇళ్లు), రాంచీలో ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌-3డి, అగర్తలాలో లైట్‌ గేజ్‌ స్టీల్‌ స్ట్రక్చరల్‌, లఖ్‌నవూలో స్టే-ఇన్‌-ప్లేస్‌ ఫ్రేం వర్క్‌ పరిజ్ఞానాల్ని వినియోగిస్తారు. వీటి నిర్మాణానికి కఠినమైన బిడ్డింగ్‌ పద్ధతుల ద్వారా ఆరు సంస్థలను ఎంపిక చేశారు. వీటిలో వినియోగించే పరిజ్ఞానాలు ఆయా నగరాల స్వభావానికి, భూవాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. నిర్మాణం చేపట్టేందుకు ఎంపికైన సంస్థలు 12 నెలల కాలవ్యవధిలో పూర్తి చేయాలి. గడువులోగా పూర్తి చేసిన సంస్థలకు ప్రోత్సాహకం లభిస్తుంది. లైట్‌హౌస్‌ ప్రాజెక్టులో ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్షా యాభై వేల రూపాయలు, టెక్నాలజీ ఇన్నోవేషన్‌ గ్రాంటు కింద మరో రెండు లక్షలు రూపాయలు లేదా అంచనా వ్యయంలో 20శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.

ఉపయోగాలెన్నో..

లైట్‌హౌస్‌ ప్రాజెక్టులు ఆధునిక గృహనిర్మాణ సాంకేతికతల అభివృద్ధికి సూచికలుగా ఉపయోగపడతాయని భావించవచ్చు. దేశం నలువైపులా చేపడుతున్న ప్రాజెక్టులతో వివిధ రాష్ట్రాల భాగస్వామ్యం సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది. పేదలకు అత్యాధునిక సాంకేతికతలు, నవ్య విధానాలతో నిర్మించిన సౌకర్యవంతమైన ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వాలకు నిర్మాణ వ్యయం తగ్గి, అధిక సంఖ్యలో గృహ నిర్మాణానికి అవకాశముంటుంది. లైట్‌హౌస్‌ ప్రాజెక్టులు గృహనిర్మాణ రంగంలో ఉన్న విద్యార్థులకు, పరిశోధకులకు, నిపుణులకు, సంస్థలకు ప్రణాళిక, డిజైన్‌, పరికరాల ఉత్పత్తి, టెస్టింగ్‌ లాంటి రంగాలలో ప్రయోగశాలలుగా ఉపయోగపడతాయి. నూతన గృహనిర్మాణ పరికరాలు, పదార్థాలు, నిర్మాణ పద్ధతులపై పరిశోధన కోసం జీహెచ్‌టీసీ నెలకొల్పిన అయిదు ఇంక్యుబేషన్‌ కేంద్రాలు దేశంలో నిర్మాణ రంగానికి ఊతమిస్తాయి. ఉద్యోగ కల్పన జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులకు ఆధునిక సాంకేతికత విధానాల్లో నైపుణ్యం అలవడుతుంది. సంప్రదాయక పద్ధతుల నుంచి నవీన సాంకేతికతల వైపు పరివర్తన లైట్‌హౌస్‌ ప్రాజెక్టుల ద్వారా సుసాధ్యమవుతుంది. ఇది ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలోనూ తోడ్పడుతుంది. అందరికీ ఇళ్లు అనే లక్ష్యాన్ని సైతం సులభంగా చేరుకోగలం.

తక్కువ వ్యయం..

లైట్‌హౌస్‌ ప్రాజెక్టు గృహాలు తక్కువ వ్యయంతో, స్వల్ప సమయంలో, నాణ్యతతో చిరకాలం మన్నేలా నిర్మితమవుతాయి. ప్రాజెక్టులో అంతర్గత రోడ్లు, నడకదారులు, పచ్చదనం, నీటి సరఫరా, మురుగు నీటిపారుదల వంటి మౌలిక వసతులు కల్పిస్తారు. సౌరవిద్యుత్తుకు ప్రాధాన్యముంటుంది. జాతీయ, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా భూకంపాలు, వరదలు, తుపాన్లను తట్టుకొనేలా గృహాల ఆకృతి, నిర్మాణం ఉంటాయి.

- పుల్లూరు సుధాకర్‌

ఇదీ చదవండి : '6 నెలల్లో రూ.864 కోట్ల కరోనా పాలసీల కొనుగోలు'

Last Updated : Jan 18, 2021, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.