ETV Bharat / opinion

చైనా దూకుడుకు పగ్గాలేసేలా భారత్​ కదలాలి! - bramhaputra river projects

బ్రహ్మపుత్ర నదిపై వరుస ప్రాజెక్టులను నిర్మిస్తున్న చైనా.. తాజాగా మరో భారీ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు ప్రకటిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నట్లు చైనా పేర్కొంది. ఈ ప్రాజెక్టు కారణంగా భారత్​ సహా బంగ్లాదేశ్, మయన్మార్​లపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

author img

By

Published : Mar 13, 2021, 7:12 AM IST

ఎవరెంత అదిలించినా ఏమాత్రం సరకు చేయని మదమత్తేభంలా జనచైనా చెలరేగుతున్న తీరు తీవ్రాందోళన కలిగిస్తోంది. 2035నాటికి సాధించదలచిన దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన పద్నాలుగో పంచవర్ష ప్రణాళికకు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌తో 'మమ' అనిపించిన చైనా - బ్రహ్మపుత్ర నదిపై అతి భారీ జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి పూర్వరంగం సిద్ధం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీ గోర్జెస్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టుకు ఏకంగా మూడింతల పరిమాణంతో బ్రహ్మపుత్ర దిగువన, మన అరుణాచల్‌ ప్రదేశ్‌కు 35 కిలోమీటర్ల దూరంలో 'సరిసాటి లేనిది'గా కొత్త ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నట్లు చైనా ప్రకటిస్తోంది. 60వేల మెగావాట్ల స్థాపక సామర్థ్యంతో నిర్మించనున్న ఈ జలవిద్యుత్‌ కేంద్రం- చైనా అభివృద్ధి లక్ష్యాలకే కాదు, విద్యుత్‌ అంతరాయాలతో సతమతమవుతున్న ఈశాన్య భారతావనికీ ఎంతగానో అక్కరకొస్తుందని బీజింగ్‌ నమ్మబలుకుతోంది.

బ్రహ్మపుత్ర ఎగువన, మధ్యభాగంలోనూ ఇప్పటికే నాలుగు ఆనకట్టలు నిర్మించిన చైనా- నది ఇండియా దిశగా ప్రవాహగతి మార్చుకొనే కీలక ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణంపై ఏనాడో కన్నేసినా.. పర్యావరణ దుష్ప్రభావాల రీత్యా వెనక్కి తగ్గింది. భారత్‌కు నష్టం కలిగేలా బ్రహ్మపుత్రపై ప్రాజెక్టులు కట్టబోమంటూ 2010లో ఇచ్చిన హామీని అటకెక్కించి తలపెట్టిన ఈ ప్రాజెక్టు అక్షరాలా తలకొరివి కానుంది. 2015 నాటికే దేశీయ అవసరాలకు మించి అదనంగా మూడు లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఒడిసిపట్టిన చైనా- పాత విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పాదకతను 50శాతం దిగువకు పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో- స్వచ్ఛ ఇంధనం పేరిట ఇండియాపై చైనా ఎక్కుపెడుతున్న అతి పెద్ద జలాయుధంగా ఈ ప్రాజెక్టును విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. చైనా ఇండియా బంగ్లాదేశ్‌లకు వరదాయిని అయిన బ్రహ్మపుత్ర మీద, హిమాలయ సానువుల్లో అత్యంత సున్నిత ప్రాంతంలో వేల కోట్ల ఘనపు మీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో బీజింగ్‌ కట్టనున్న ప్రాజెక్టు కలవరదాయినిగా మారనుంది!

దిగువ దేశాలకు నష్టం

చైనా అధ్యక్ష పీఠం ఖరారైన వెంటనే ఇండియాతో సత్సంబంధాలకు 'నయా పంచశీల' ప్రతిపాదించిన షి జిన్‌పింగ్‌ ఏలుబడేనా ఇది? అయిదేళ్లలో ఇండియాలో మౌలిక సదుపాయాల నవీకరణకు పదివేల కోట్ల డాలర్లు వెచ్చించదలచినట్లు షి జిన్‌పింగ్‌ 2014లో భారత పర్యటన సందర్భంగా చేసిన ప్రకటన కాగితాల్లోనే కొడిగట్టింది. తామెంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)లో చేరడానికి ఇండియా నిరాకరించినప్పటినుంచే బీజింగ్‌ వరస మారిపోయింది. 2017లో డోక్లాం, నిరుడు లద్దాఖ్‌లలో చైనా తెంపరితనాన్ని వెన్నంటి వెలువడిన జల విద్యుత్‌ కేంద్ర ప్రతిపాదన నదీ పరీవాహక దిగువ దేశాలైన భారత్‌, బంగ్లాలకు ప్రాణసంకటమే!

టిబెట్‌ పీఠభూమిలో చైనా చేపడుతున్న రైలు రోడ్డు మార్గాల నిర్మాణాలు, జల విద్యుత్‌ కేంద్రాలు, సొరంగాలు, నీటి మళ్ళింపు ప్రాజెక్టులతో దిగువన ఉన్న భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాల్లోని 140 కోట్లమంది ప్రజలకు ముప్పు పొంచి ఉన్నట్లు ఆస్ట్రేలియా టిబెట్‌ కౌన్సిల్‌ చేసిన హెచ్చరిక ఏమాత్రం తోసిపుచ్చలేనిదే! చైనా నిర్మించే ప్రాజెక్టువల్ల భారత భూభాగంలో ఆకస్మిక వరదలతోపాటు, నీటి ఎద్దడీ ఏర్పడే ప్రమాదం ఉండటం వల్ల దాన్ని అడ్డుకొనేందుకు ఇండియా సైతం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని యోచిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో 9.2 శతకోటి ఘనపుటడుగుల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్‌, 10వేల మెగావాట్ల విద్యుత్‌ కేంద్ర నిర్మాణ ప్రతిపాదనలున్నా- అది పర్యావరణ హితకరమైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జల విద్యుత్‌ ప్రాజెక్టులు సృష్టించగల విలయాన్ని ఇటీవలి ఉత్తరాఖండ్‌ ఉత్పాతం కళ్లకు కట్టిన దృష్ట్యా చైనా దూకుడుకు పగ్గాలేసేలా అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చేందుకు ఇండియా యుద్ధ ప్రాతిపదికన కదలాలి!

ఇదీ చదవండి : 'మేరా ​​​​​​రేషన్‌' మొబైల్ యాప్ ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.