ETV Bharat / opinion

పౌష్టికాహారం... సుదూర లక్ష్యం! - పౌష్టికాహారం... సుదూరలక్ష్యం!

దేశంలో సామాజిక అసమానతల మధ్య జీవనం గడుపుతున్న ప్రజలను కరోనా వైరస్​, లాక్​డౌన్​ వంటివి అభద్రతా భావానికి గురిచేస్తున్నాయి. సహజంగానే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, వారిపై వైరస్‌ ప్రభావం అధికంగా ఉండే అవకాశముంది. దేశంలోని ప్రజల మధ్య ప్రాంతీయంగా, సామాజికంగా పౌష్టికాహార లభ్యత విషయంలో నెలకొన్న అసమానతల్ని ప్రభుత్వాలు తొలగించాలి. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులపై ఎదురొడ్డి పోరాడాలంటే దేశంలో ప్రతి పౌరుడికీ పౌష్టికాహారం అందాల్సిందే.

Nutrition
పౌష్టికాహారం
author img

By

Published : May 14, 2021, 7:21 AM IST

భారత్‌లో పెనుభూతంలా విస్తరిస్తున్న మహమ్మారి కొవిడ్‌- ప్రజారోగ్య, ఆహార వ్యవస్థలకు సరికొత్త సవాళ్లు రువ్వుతోంది. ఇలాంటి సంక్షుభిత సమయంలో ప్రతి ఒక్కరికీ పౌష్టికాహార లభ్యత అవసరం ఎంతైనా ఉంది. పేదరికం, మహిళలు, అల్పసంఖ్యాక వర్గాలు, వలస కార్మికులు వంటి సామాజిక అసమానతల మధ్య జీవనం గడుపుతున్న ప్రజలను కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ వంటివి మరింత అభద్రతా భావానికి గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోరలు సాచిన కరోనా అన్ని వర్గాల ప్రజలపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపడం లేదు. సహజంగానే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, వారిపై వైరస్‌ ప్రభావ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఎక్కువే. ఆ నేపథ్యంలో దేశంలోని ప్రజల మధ్య ప్రాంతీయంగా, సామాజికంగా పౌష్ఠికాహార లభ్యత విషయంలో నెలకొన్న అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అసమానతలు..

పౌష్టికాహార కల్పన దిశగా 2025 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో భారత్‌ సహా 88 దేశాలు వెనకంజలో ఉన్నాయని తాజా ప్రపంచ పోషకాహార నివేదిక-2020 వెల్లడించడం క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. భారత్‌లోనూ పౌష్ఠికాహార లభ్యతలో అత్యధిక స్థాయిలో అసమానతలు ఉన్నట్లు ఈ నివేదిక గుర్తించడం గమనార్హం. 2012లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులోనే మహిళలు, శిశువులు, కౌమార దశలోని బాలబాలికల్లో పౌష్ఠికాహార కల్పన దిశగా 2025 నాటికల్లా సాధించాల్సిన లక్ష్యాలుగా ఆరు అంశాలపై దృష్టి సారించారు. అయిదేళ్ల లోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపాన్ని 40శాతానికి తగ్గించడం, 19 నుంచి 49 ఏళ్ల లోపు వయసున్న మహిళల్లో రక్తహీనతను సగానికి, తక్కువ బరువుండే శిశువుల జననాన్ని 30శాతం, చిన్నారుల్లో అధిక బరువును తగ్గించడం, ఆర్నెల్ల లోపు వయసు శిశువుల్లో తల్లి పాల వినియోగాన్ని పెంచడం, బాల్యంలో బలహీనత వంటి సమస్యలు అయిదు శాతానికి మించకుండా చూడటం ఈ లక్ష్యాలు. భారత్‌ నాలుగు అంశాల విషయంలో 2025 నాటికల్లా లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితులు లేవని ఈ నివేదిక వ్యాఖ్యానించింది.

కీలక సవాళ్లు..

ఈ దశాబ్ది చివరి నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యసాధనే ఆశయంగా సాగుతున్న క్రమంలో భారత్‌లో పౌష్టికాహార పరంగా కొన్ని కీలక సవాళ్లు ముందున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాల మధ్యా అంతరాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం చిన్నారుల మరణంతోపాటు, వయోజనుల్లో బలహీనతకు, వైకల్యానికి దారితీస్తోంది. దేశంలో అయిదేళ్లలోపు వయసున్న చిన్నారులు పౌష్టికాహార లోపంతో మృత్యువాత పడకుండా చూడాలంటే పోషకాహార కల్పనపై నిరంతరం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇటీవల నిర్వహించిన జాతీయ సమగ్ర పోషకాహార సర్వే కూడా పోషకాహార లోపంతో చిన్నారుల్లో తలెత్తుతున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే పరిమితమైన అధిక బరువు, స్థూలకాయం, ఇతర సాంక్రామికేతర వ్యాధులు చిన్న వయసులోనే వేధిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 19 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్లో దాదాపు 10 శాతం ముందస్తు మధుమేహంతో బాధ పడుతున్నారు. దేశంలో పెద్ద వయసువారిలోనూ పౌష్టికాహార లోపం తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. ఇది ముదిమి వయసు జీవితానికీ ప్రమాదకరంగా మారుతోంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, శారీరక జీవక్రియలు మందగించడంతో వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఇలా అధిగమించవచ్చు..

వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో పౌష్టికాహార సమస్యను అధిగమించవచ్చు. కౌమార దశ బాలల్లో, గర్భిణులు, యువతకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం, విచ్చలవిడిగా మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్న అనారోగ్యకరమైన చిరుతిళ్లు, పానీయాలను నియంత్రించడం, ప్రజల్లో పౌష్టికాహార సంబంధిత జ్ఞానాన్ని, అవగాహనను మెరుగుపరిచే ప్రయత్నాలను విస్తృత పరచడం వంటి విషయాల్లో ప్రభుత్వాలు దృష్టి సారించాలి. పౌష్టికాహార లోపానికి సంబంధించి పలు అధ్యయనాల్లో వెల్లడైన సమాచారాన్ని మదింపు చేసి శాస్త్ర ప్రపంచానికి అందుబాటులో ఉంచాలి. క్షేత్రస్థాయి పరిస్థితులకు సంబంధించిన వాస్తవిక సమాచారాన్ని అందుబాటులో ఉన్న అంగన్‌వాడీలు, ఆరోగ్య కార్యకర్తల నుంచి తెప్పించుకోవాలి. మానవుడి పరిపూర్ణ జీవిత చక్రానికి వర్తించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సవరించిన ఆవశ్యక పోషక విలువల మార్గదర్శకాలను మన దేశీయ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలి. భవిష్యత్తులో కరోనా వైరస్‌ వంటి మహమ్మారులపై ఎదురొడ్డి పోరాడాలంటే దేశంలో ప్రతి పౌరుడికీ పౌష్టికాహారం అందాల్సిందే.

- డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌, రచయిత

ఇదీ చదవండి: వారు వేధిస్తున్నారని 14 మంది వైద్యులు రాజీనామా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.