ETV Bharat / opinion

ఈశాన్యంలో పుట్టుకొస్తున్న ఉగ్రసంస్థలు.. చైనా అండతోనే! - మణిపుర్​లో ఉగ్రసంస్థలు

ఇటీవల.. మణిపుర్​లోని చురాచాంద్‌పుర్‌ జిల్లాలో కర్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి వాహనశ్రేణిపై మెయ్‌తెయ్‌ తిరుగుబాటుదారులు భీకరదాడికి తెగబడ్డారు. త్రిపాఠితో పాటు ఆయన భార్యాబిడ్డలు, మరో నలుగురు సైనికులను చంపేశారు. కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఉగ్రబృందాలు ఒక్కసారిగా పేట్రేగిపోవడం భద్రతా దళాలకు విస్మయం కలిగిస్తోంది. చుట్టుపక్కల దేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ముష్కర మూకలు భారత్‌లో దాడులకు తెగబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. అయితే చైనా అండతోనే ముష్కర మూకలు చెలరేగిపోతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

NORTH EAST STATES
ఉగ్రసంస్థలు
author img

By

Published : Nov 18, 2021, 8:10 AM IST

వాస్తవాధీన రేఖ వెంట ఇండియా చైనాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. దీనికి తోడు మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ కల్లోల పరిస్థితులు తలెత్తుతున్నాయి. మిజో-అస్సాం గొడవలు, హింసాత్మక ఘటనలు ఇటీవల కొంచెం సద్దుమణిగాయని భావించేలోపే, మణిపుర్‌లో ముష్కరులు పంజా విసిరారు.

చురాచాంద్‌పుర్‌ జిల్లాలో అస్సాం రైఫిల్స్‌ బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి కర్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి కుటుంబంపై జరిగిన పాశవిక దాడి- ఈశాన్య భారతంలో ఉగ్రవాదం పూర్తిగా తొలగిపోలేదని తేటతెల్లం చేసింది. కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఉగ్రబృందాలు ఒక్కసారిగా పేట్రేగిపోవడం భద్రతా దళాలకు విస్మయం కలిగిస్తోంది. చుట్టుపక్కల దేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ముష్కర మూకలు భారత్‌లో దాడులకు తెగబడుతున్నాయి.

ఏడాదిలోనే పుంజుకొని...

ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క మణిపుర్‌లోనే అత్యధిక ఉగ్ర సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. చిన్న రాష్ట్రమే అయినా అక్కడ మెయ్‌తెయ్‌, ఇతర ఆదివాసీ తెగల మధ్య తీవ్ర విభేదాలు నెలకొని ఉన్నాయి. ఆధిపత్య మెయ్‌తెయ్‌ తెగలో అత్యధికులు సనమహిజం, హిందూ మతాలను అనుసరిస్తారు. స్వల్ప సంఖ్యలో ముస్లిములు(పంగల్‌), క్రైస్తవులు ఉన్నారు. మణిపుర్‌ 1949లో భారత్‌లో విలీనం కావడాన్ని మెయ్‌తెయ్‌ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అదే వేర్పాటువాదానికి బీజం వేసింది. 1964లో సమరేంద్ర సింగ్‌ నేతృత్వంలో 'ది యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌' (యూఎన్‌ఎల్‌ఎఫ్‌) పురుడు పోసుకుంది. 1972లో మణిపుర్‌ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడటంతో తమ గుర్తింపును కోల్పోతామన్న ఆందోళన మెయ్‌తెయ్‌ తెగలో అధికమైంది. మరోవైపు రాష్ట్రంలోని 89శాతం భూభాగానికి కేవలం 20 మంది శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 11శాతం పర్వత ప్రాంతాలకు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఇతర తెగల్లో అసంతృప్తిని రగిలిస్తోంది. ఇటువంటి కారణాలతో మణిపుర్‌లో ఉగ్రసంస్థలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి.

నాగా, కూకీ తెగలతో పాటు పర్వత ప్రాంతాల్లోని ఆదివాసీ వర్గాల బృందాలూ వాటికి తోడయ్యాయి. దక్షిణాసియా ఉగ్రవాద పోర్టల్‌ లెక్కల ప్రకారం ప్రభుత్వం ఉగ్ర సంస్థలుగా ప్రకటించిన ప్రజావిముక్తి సైన్యం(పీఎల్‌ఏ) వంటివి అక్కడ ఏడు ఉన్నాయి. అవి కాకుండా మరో 13 క్రియాశీల సంస్థలు, పెద్దగా కార్యకలాపాలు నిర్వహించని బృందాలు 12 వరకు కనిపిస్తాయి. కర్నల్‌ విప్లవ్‌ త్రిపాఠీపై దాడిలో భాగస్వామి అయిన మణిపుర్‌ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ ఈ కోవలోదే. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదుల ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక అక్కడి ఉగ్ర సంస్థలతో చర్చలు ప్రారంభించడం సానుకూల ఫలితాలను ఇచ్చింది. గత రెండేళ్లలో మణిపుర్‌లో ఉగ్రదాడులు, ఎదురుకాల్పుల్లో పదకొండు మంది మరణించారు. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 18కి చేరింది. నిరుడు నవంబర్‌లో భారత్‌, మయన్మార్‌ దళాలు సంయుక్తంగా పీఎల్‌ఏ, అరాకన్‌ ఆర్మీ స్థావరాలపై దాడులు జరిపాయి. సంవత్సరంలోనే పీఎల్‌ఏ పుంజుకొని అస్సాం రైఫిల్స్‌పై దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్ర కార్యకలాపాలు ఊపందుకోవడానికి- చైనా పాత్ర, మయన్మార్‌లో అస్థిరతలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈశాన్య భారతంలో ఉగ్రవాదాన్ని ఎగదోసిన చరిత్ర చైనాకు ఉంది. నాగా, మిజో వేర్పాటువాదులకు తొలినాళ్లలో చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌, లాసాలో శిక్షణ లభించినట్లు అమెరికా సీఐఏ నివేదికలు చెబుతున్నాయి. ఆ తరవాత భారత్‌లో చిచ్చుపెట్టడానికి మయన్మార్‌ను చైనా చాలాకాలం వేదిక చేసుకుంది. పేరుమోసిన ఉగ్రవాదులు నలుగురు నిరుడు యునాన్‌ ప్రావిన్స్‌లోని కున్‌మింగ్‌లో శిక్షణ, ఆశ్రయం పొందినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఉల్ఫా-ఐ నేత పరేశ్‌ బారువా ఇప్పటికీ చైనాలోనే ఉన్నాడు. మరోవైపు మయన్మార్‌లోని రాజకీయ అస్థిరతను డ్రాగన్‌ ఉపయోగించుకుంటోంది. ఆ దేశం ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందుతున్నాయి.

భద్రతాదళాలు స్వాధీనం చేసుకుంటున్న అక్రమాయుధాల్లో చైనా తయారీ ఏకే-47, ఎం-16 తుపాకులు, పిస్తోళ్లు ఉంటున్నాయి. అస్సాం, మణిపూర్‌, నాగాలాండ్‌, మిజోరమ్‌లలోని ఉగ్రమూకలు చైనా నిఘా సంస్థలతో సంబంధాలు నెరపుతున్నట్లు ఐబీ నివేదిక నిరుడు స్పష్టీకరించింది. మయన్మార్‌లో భారత్‌ చేపట్టిన కలాదాన్‌ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించేందుకు అక్కడి అరాకన్‌ ఆర్మీకి సైతం డ్రాగన్‌ ఆయుధాలు సమకూరుస్తోంది. యునైటెడ్‌ వా స్టేట్‌ ఆర్మీ, అరాకన్‌ ఆర్మీ కలిసి ఈశాన్య భారతంలోని ఉగ్రసంస్థలకు ఆయుధాలను చేరవేస్తున్నాయి. మాదకద్రవ్యాల అడ్డాగా పేరున్న ‘స్వర్ణ త్రికోణం’ (మయన్మార్‌, థాయ్‌లాండ్‌, లావోస్‌ దేశాల సరిహద్దులు కలిసే ప్రాంతం) ఈశాన్య భారతానికి అత్యంత సమీపంలో ఉండటమూ ముష్కర మూకల నిధుల సమీకరణకు కలిసివస్తోంది.

సమన్వయం అవసరం

ఈశాన్య రాష్ట్రాల్లో చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వ చర్చల వ్యూహం ఫలించింది. ఎక్కువ వర్గాలు ఉన్న మణిపుర్‌లో ఒకరి కోరికలు మరో బృందానికి సమస్యాత్మకమవుతున్నాయి. దాంతో చర్చలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఈశాన్య భారతంపై అవగాహన ఉండి, పనిచేయడానికి ఉత్సాహంగా ఉండే అధికారులను మాత్రమే అక్కడకు పంపించాలి. దానికితోడు ప్రభుత్వ పథకాలు ఆదివాసుల వరకు చేరేలా చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదుల ఏరివేతకు కేవలం బలప్రయోగంపైనే ఆధారపడకుండా, మానవీయ కోణాన్ని జోడించాలి. అప్పుడే ప్రతిభావంతులైన యువత తప్పుదోవ పట్టే అవకాశాలు తగ్గుతాయని విశ్రాంత సైనికాధికారి లెఫ్టినెంట్‌ జనరల్‌ బల్బీర్‌సింగ్‌ సంధూ సూచిస్తున్నారు. తిరుగుబాటుదారులను కట్టడి చేయాలంటే మయన్మార్‌, బంగ్లాదేశ్‌ల నుంచి సహాయ సహకారాలు అందేలా సంబంధాలను మెరుగుపరచుకోవడమూ కీలకమే. లేకపోతే భారత సైన్యంపై వాస్తవాధీన రేఖకు ఆవలివైపు నుంచి చైనా సేనలు; లోపల కేంద్ర సాయుధ బలగాలపై వేర్పాటువాదులు ఒత్తిడి పెంచే పరిస్థితులు దేశభద్రతకే విఘాతకరమవుతాయి.

ఆ ఒప్పందంపై అక్కసు?

భవిష్యత్తు సాంకేతికత మొత్తం సెమీకండక్టర్లదే. ఆ పరిశ్రమలను ఆకర్షించేందుకు ఇండియా విశ్వప్రయత్నాలు చేస్తోంది. తైవాన్‌ సెమీకండక్టర్‌ తయారీ సంస్థ (టీఎస్‌ఎంసీ) భారత్‌లో పెట్టుబడులు పెట్టే అంశంపై కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ ఒప్పందం కొలిక్కి వస్తే- ఇండియాలో టీఎస్‌ఎంసీ 750 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టి సెమీకండక్టర్ల తయారీని ప్రారంభించే అవకాశం ఉంది. చైనా దీన్ని మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తైవాన్‌తో భారత్‌ ఒప్పందం చేసుకుంటే, ఈశాన్య భారతంలోని వేర్పాటువాద బృందాలతో చైనా చేతులు కలుపుతుందని గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ఇటీవల ఓ కథనంలో హెచ్చరించింది. ఇండో తైవాన్‌ చర్చలు త్వరలోనే సఫలం కాబోతున్నాయనే వార్తలు వెలువడుతున్న తరుణంలో మణిపుర్‌లో ఉగ్రదాడి చోటు చేసుకోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.

- పెద్దింటి ఫణికిరణ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.