ETV Bharat / opinion

చైనాను ఎదుర్కొవడానికి భారత్​ దౌత్య అస్త్రం! - భారత్ చైనా తాజా వార్తలు

వక్రదారిలో పయనిస్తున్న చైనాకు బుద్ధి చెప్పడానికి భారత్​ దౌత్యమార్గాన్నే ఎంచుకుంది. వ్యూహాత్మకంగా డ్రాగన్​ను ఇరకాటంలో​ పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బంగ్లాదేశ్, తైవాన్​లలో నూతన ప్రతినిధులను నియమించడం వెనకున్న కారణం సైతం ఇదేనని స్పష్టమవుతోంది. మరోవైపు తాలిబన్ల ప్రభావంతో కుదేలైన అఫ్గాన్​కు సైతం నూతన రాయబారిని నియమించింది కేంద్రం. వీటన్నింటి వెనక ఉన్న అసలైన కారణాలేంటి? చైనాకు భారత్ ఏ విధంగా చెక్​ పెట్టబోతోంది?

New Indian diplomatic appointments Countering Chinas expansionism dealing with Taliban
చైనాను ఎదుర్కొవడానికి భారత్​ దౌత్య అస్త్రం!
author img

By

Published : Jul 25, 2020, 6:08 PM IST

ఇటీవల కొత్తగా ముగ్గురు భారత రాయబారులను నియమించడాన్ని బట్టి చూస్తే చైనా విస్తరణవాద చర్యలకు భారత్ వ్యూహాత్మకంగా బదులు చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు అఫ్గానిస్థాన్​లో పెరిగిపోతున్న తాలిబన్ల ప్రభావానికి అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శి(అంతర్జాతీయ సంస్థలు, సదస్సులు)గా ఉన్న విక్రమ్ దొరైస్వామిని బంగ్లాదేశ్​లో భారత హైకమిషనర్​గా నియమించింది కేంద్రం. ఆసియాన్ కూటమిలో భారత రాయబారిగా ఉన్న రుద్రేంద్ర టాండన్​ను అఫ్గానిస్థాన్​ రాయబారిగా, విదేశాంగ శాఖలో జాయింట్ సెక్రెటరీ(అమెరికా)గా ఉన్న గౌరంగలల్ దాస్​ను తైవాన్​లోని ఇండియా-తైపీ అసోసియేషన్​కు డైరెక్టర్ జనరల్​గా నియమించింది.

లద్దాఖ్​లో హింసాత్మక ఘర్షణలు, దక్షిణాసియాలో చైనా ఏకపక్ష ధోరణి, దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో డ్రాగన్ మితిమీరిన వైఖరి, అఫ్గాన్​ శాంతిస్థాపన ప్రక్రియలో తాలిబన్ల పాత్ర వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటే భారత్​ తీసుకున్న ఈ నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది.

బంగ్లాను కాపాడేందుకు..

దక్షిణాసియా దేశాలను తన అధీనంలోకి తీసుకోవాలన్న కుటిల బుద్ధితో బంగ్లాదేశ్​కు ఆకర్షణ మంత్రం వేస్తోంది చైనా. ఈ నేపథ్యంలో 1992 బ్యాచ్​కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి దొరైస్వామిని బంగ్లాదేశ్​కి పంపుతోంది భారత్.

ఇదీ చదవండి- కళ్లు చెదిరే సొరంగ వ్యూహంతో చైనాకు భారత్​ చెక్!

పెకువాలోని బీఎన్​ఎస్ షేక్ హసీనా సబ్​మెరైన్ బేస్​ సహా బంగ్లాదేశ్​లో డిఫెన్స్​ ప్రాజెక్టులను చైనా వేగవంతం చేస్తోంది. బంగ్లాదేశ్ నావికాదళానికి రెండు సబ్​మెరైన్​లను అందించనుంది. చైనా సంస్థ సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్​కు బంగ్లాదేశ్ వైద్య పరిశోధన సంస్థ ఆమోదం తెలిపింది. ఇవన్నీ భారత్​కు ఆందోళన కలిగించే విషయాలే.

మరోవైపు చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్​(బీఆర్​ఐ)ని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్వాగతిస్తున్నారు. ఈ ప్రాజెక్టును తొలి నుంచి భారత్ వ్యతిరేకిస్తోంది. చైనా బీఆర్​ఐ ప్రాజెక్టును అభివృద్ధి చెందిన దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు చిన్నదేశాలను అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేస్తుందని మండిపడుతున్నాయి.

దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్​తో భారత్​కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ బంగాళాఖాతంలో సముద్ర జలాల నిర్వహణలో చైనాకు సహకరించేందుకు బంగ్లాదేశ్ ఒప్పుకుంది.

భారత్-బంగ్లా కీలక ఒప్పందాలు

గతేడాది అక్టోబర్​లోనే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్​లో పర్యటించారు. ఇందులో భాగంగా ఏడు ఒప్పందాలు, మూడు ప్రాజెక్టులకు ఇరు దేశాధినేతలు ఆమోదముద్ర వేశారు.

ఇదీ చదవండి- డోక్లాం కోసం చైనా ఆరాటం- భూటాన్​తో 'దౌత్య' పోరాటం!

భారత్​ నుంచి రాకపోకల కోసం బంగ్లాదేశ్​కు చెందిన ఛట్టోగ్రామ్(చిట్టాగాంగ్), మోంగ్లా పోర్టులను ఉపయోగించుకోవడం, త్రిపురలోని సోనాంపురా నుంచి బంగ్లాదేశ్​లోని దౌడ్​కాంది వరకు వాణిజ్య జల మార్గాన్ని ఆచరణలోకి తీసుకురావడం సహా భారత్ ఇచ్చిన హామీ మేరకు బంగ్లాదేశ్​కు​ 8 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్​ను అమలు చేయడం వంటి ఒప్పందాలు చేసుకున్నారు. ప్రజా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం రోడ్డు, రైల్వే కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి.

మూడు ప్రాజెక్టులలో భాగంగా

  • బంగ్లాదేశ్​ నుంచి భారీగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్​పీజీ) దిగుమతి చేసుకోవడం
  • ఢాకాలోని రామకృష్ణ మిషన్​లో వివేకానంద భవన్(విద్యార్థుల హాస్టల్)ను ఏర్పాటు చేయడం
  • ఖుల్నాలోని ఇన్​స్టిట్యూషన్ ఆఫ్ డిప్లమా ఇంజినీర్స్ బంగ్లాదేశ్​(ఐడీఈబీ)లో బంగ్లాదేశ్-భారత్ వృత్తి నైపుణ్య అభివృద్ధి సంస్థను నెలకొల్పడం

ఈ నేపథ్యంలో దొరైస్వామిని బంగ్లాదేశ్​కు పంపించడం వెనక వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. మాండరీన్, ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఈయన.. దిల్లీలోని విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో జాయింట్ సెక్రెటరీగా, ఇండో-పసిఫిక్ వ్యవహారాల అధిపతిగా పనిచేశారు.

తైవాన్​ నుంచి చైనాకు చెక్!

ఇండో-పసిఫిక్​లో శాంతి, సామరస్యాలు నెలకొల్పే విధంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి చతుర్భుజ కూటమిగా ఏర్పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో 1999 బ్యాచ్​కు చెందిన ఐఎఫ్​ఎస్ అధికారి దాస్​ను తైవాన్​కు రాయబారిగా నియమించింది భారత్. దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు వైఖరి, పొరుగుదేశాలతో వివాదాలు, జపాన్​ సెంకకు ద్వీపాలపై హక్కులు ప్రకటించుకోవడం, తైవాన్ గగనతలంలోకి తరచుగా చొరబడటం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్​ వ్యూహాత్మకంగానే ఈ నియామకం చేపట్టింది.

ఇదీ చదవండి- భూటాన్ మాదేనంటూ చైనా కొత్త కుట్రలు

ఈ ప్రాంతంలో చైనా సైనిక సన్నద్ధతను పెంచుకుంటోందని తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ ఇటీవల వెల్లడించారు. ఇప్పటికే నావికాదళ విన్యాసాలు, గగనతలంలో చొరబాట్లు పెరిగిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

దౌత్యం లేకున్నా దోస్తీ..

వన్​ చైనా పాలసీ ప్రకారం తైవాన్​తో భారత్​కు దౌత్యపరమైన సంబంధాలు లేవు. కానీ ఇండియా-తైపీ అసోసియేషన్​లో భాగంగా తైవాన్​లో భారత్​ ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ అసోసియేషన్​కు కొత్త డైరెక్టర్ జనరల్​గా దాస్​ను నియమించింది కేంద్రం. ఇదే విధంగా దిల్లీలో ఉన్న తైవాన్ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం ద్వారా ఆ దేశం భారత్​లో ప్రాతినిథ్యం వహిస్తోంది. అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ హయాంలో విదేశాలతో సహకారం పెంచుకునే విధంగా తైవాన్ నూతన విధానాన్ని రూపొందించుకుంది. భారత్​ సహా ఆగ్నేయాసియా, దక్షిణాసియా, ఆస్ట్రేలియాసియాలోని 18 దేశాలతో సహకారం పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

తైవాన్​లో ప్రాతినిథ్యం వహించనున్న దాస్​కు..​ మాండరీన్​లో అత్యంత ప్రావీణ్యం ఉంది. బీజింగ్​లోని భారత రాయబార కార్యాలయంలో రెండు సార్లు సేవలందించారు. మన్మోహన్ సింగ్ హయాంలో ప్రధాని కార్యాలయం డిప్యూటీ సెక్రెటరీగా పనిచేశారు. వాషింగ్టన్​లోని భారత రాయబార కార్యాలయంలో కౌన్సెలర్​గా బాధ్యతలు నిర్వహించారు.

అఫ్గాన్..

అఫ్గానిస్థాన్​కు నూతన భారత రాయబారిగా టాండన్​ను నియమించడం సైతం ఆసక్తికరమైన వ్యూహంగానే కనిపిస్తోంది. తాలిబన్ కేంద్ర నాయకత్వంలో మార్పులు జరగడం, అఫ్గాన్​ నుంచి అమెరికా దళాలు ఉపసంహరించుకోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఈ మార్పులు చేపట్టింది.

ఇదీ చదవండి- చైనా 'ఇరాన్‌' తంత్రం.. ఎందుకీ దోస్తీ?

తాలిబన్ అధినేత హిబతుల్లాకు కరోనా సోకిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అతను మరణించి ఉండవచ్చని పేర్కొంటున్నాయి. పాకిస్థాన్ మద్దతు ఉన్న హక్కానీ నెట్​వర్క్ అధినేత, తాలిబన్ డిప్యూటీ లీడర్ సిరాజుద్దీన్ హక్కానీ సైతం వైరస్​ వల్ల అనారోగ్యం బారిన పడ్డారని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో డిప్యూటీ లీడర్ మహమ్మద్ యాకూబ్ తాలిబన్​కు నేతృత్వం వహిస్తున్నారని సమాచారం. అమెరికాతో శాంతి చర్చలకు యాకూబ్ సముఖంగా ఉన్నారు. ఫలితంగా భారత్​తో స్నేహ సంబంధాల పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

శాంతి చర్చల మాటేంటి?

అఫ్గాన్​లో తాలిబన్లతో శాంతి చర్చల్లో పాల్గొనకూడదనే వైఖరిని భారత్ అవలంబిస్తోంది. అఫ్గాన్ శాంతి ప్రక్రియ 'అఫ్గాన్ నేతృత్వంలో, అఫ్గాన్ యజమాన్యంలో, అఫ్గాన్ నియంత్రణలో ఉండాలి' అని భారత్ స్పష్టం చేస్తోంది.

అఫ్గాన్​కు సహకారాలు అందిస్తున్న అతిపెద్ద దేశం భారత్​. అయినప్పటికీ బహుళ పక్షాల శాంతి చర్చలకు భారత్ దూరమైపోయింది. ప్రస్తుతం ఈ శాంతి చర్చల్లో అమెరికా కీలకంగా వ్యవహరిస్తోంది. అదేసమయంలో భారత్​ను చర్చల్లో పాల్గొనేలా చేసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అఫ్గాన్ పునరుద్ధరణలో అమెరికా ప్రత్యేక ప్రతినిధులు చేపట్టిన శాంతి ప్రక్రియకు మద్దతివ్వాలని కోరుతోంది. ఈ విషయమై అఫ్గాన్​లోని అమెరికన్ దౌత్యవేత్త జల్మీ ఖాలిల్జద్​ భారత్​తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అఫ్గాన్​కు నూతన రాయబారిని నియమించడం ప్రాధాన్యతతో కూడిన అంశమే. టాండన్ ఇదివరకే కాబూల్​లోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. జలాలాబాద్​లో కాన్సూల్ జనరల్​గా వ్యవహరించారు. టాండన్​ను అఫ్గాన్ వ్యవహారాల్లో నిపుణుడిగా పరిగణిస్తారు.

(రచయిత-అరూనిమ్ భూయాన్)

ఇదీ చదవండి- భారత్,​ నేపాల్​ మధ్యలో చైనా- నిలిచేది ఎవరి బంధం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.