ETV Bharat / opinion

సరిహద్దు వివాదంపై నేపాల్​ వైఖరికి కారణమేంటి? - నేపాల్​ ప్రధాని

సరిహద్దు విషయంలో చైనాతో పాటు నేపాల్​ కూడా భారత్​కు సవాళ్లు విసురుతోంది. అయితే చైనా అండతోనే నేపాల్​ భారత్​తో కయ్యానికి కాలుదువ్వుతోందని అనేక మంది భావిస్తున్నారు. ఇందులో నిజమెంత? నేపాల్​ అనూహ్య వైఖరితో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి సంబంధం ఉందా? నేపాల్​ను తక్కువ అంచనా వేయడమే ఇందుకు కారణమా?

Indo-Nepal border dispute: Oli trying to deflect attention from his troubles
సరిహద్దు వివాదంపై నేపాల్​ వైఖరికి కారణమేంటి?
author img

By

Published : Jun 21, 2020, 7:46 PM IST

చైనాతో సరిహద్దు వివాదం ముదురుతున్న తరుణంలో నేపాల్​ కూడా కయ్యానికి కాలు దువ్వడం భారత్​కు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఓవైపు భారత సైనికులపై చైనా దుస్సాహసానికి దిగితే.. మరోవైపు నేపాల్​ తన సరిహద్దు వివాదాన్ని పార్లమెంట్​కు తీసుకెళ్లింది. అసలు ఎన్నడూ లేని విధంగా సరిహద్దు విషయంపై నేపాల్​ ఇంత ఘాటుగా స్పందించడానికి కారణమేంటి?

చైనా హస్తం ఉందా?

సరిహద్దు వివాదాన్ని నేపాల్​ తెరపైకి తీసుకురావడం వెనుక చైనా హస్తం ఉందని అనేక మంది భావిస్తున్నారు. భారత సైన్యాధిపతి ముకుంద్​ నరవాణే సైతం ఇదే విధంగా స్పందించారు. నేపాల్​ చర్యకు కారణం చైనా అని ఆరోపించారు. అయితే ఇది 100శాతం నిజం కాకపోవచ్చు. 'నేపాల్​ లాంటి మిత్ర దేశం స్వతంత్ర నిర్ణయాలు తీసుకోదు' అని అనుకున్న భారత్​ ఆలోచన.. ఆ దేశ సర్కారును తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

అనంతరం.. భారత్​కు చెందిన మూడు ప్రాంతాలను తమదేవంటూ నేపాల్​ ఓ మ్యాప్​ను రూపొందించడం, దానికి ఆ దేశ పార్లమెంట్​ ఆమోద ముద్రవేయడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై భారత్​ ఏ విధంగా స్పందిస్తుందని ఆలోచించకుండానే నిర్ణయాలు తీసేసుకుంది నేపాల్​. బిల్లు గట్టెక్కేంత వరకు భారత్​ను సంప్రదించలేదు.

ఓలి వైఫల్యాలతో..

అయితే ఇటీవలి కాలంలో ప్రధాని కేపీ ఓలి ప్రభుత్వంపై నేపాల్​వాసులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభం పట్ల ఓలి వైఖరిపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూడా భారత్​ కారణమని నిందారోపణలు చేశారు ప్రధాని. సరిహద్దు నుంచి వస్తున్న వారి వల్లే నేపాల్​లో వైరస్​ కేసులు పెరుగుతున్నాయన్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు.

మరోవైపు.. భారత్​తో ఓలి మైత్రి గత కొన్నేళ్లుగా బలహీనపడుతోంది. ముఖ్యంగా తన ఆరోగ్యం క్షీణించిన సమయంలో తనను గద్దె నుంచి దించడానికి భారత్​ ప్రయత్నించిందని ఓలి భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఓలి అధికారం చేపట్టే విధంగా నేపాల్​లోని చైనా రాయబారి జోక్యం చేసుకున్నారు.

అవకాశం ఇలా..

భారత్​తో సరిహద్దు గొడవను తెరపైకి తీసుకురావడానికి ఓలి ఓ అవకాశం కోసం ఎదురు చూశారు. భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ రూపంలో ఆ అవకాశం ఓలి తలుపు తట్టింది. లిపులేక్​ పాస్​ నుంచి మానసరోవర్​కు నిర్మించిన రోడ్డు మార్గాన్ని రాజ్​నాథ్​ ప్రారంభించడాన్ని అస్త్రంగా మార్చుకుంది కాఠ్​మాండూ.

లిపులేక్​ తమ భౌగోళిక ప్రాంతమని ఎన్నో ఏళ్లుగా వ్యాఖ్యానిస్తున్న నేపాల్​కు రాజ్​నాథ్​ చర్యతో అవకాశం లభించింది. వెంటనే మ్యాప్​ రూపొందించేసి, ఆమోద ముద్ర వేయించేసుకుంది ఓలి ప్రభుత్వం.

హిందుత్వ కార్డు...

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం హిందూ నాగరికతను బలంగా విశ్వసిస్తోంది. భారత దేశ కీర్తిని, ఇతర దేశాల సంబంధాలపై భారత్​ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ హిందుత్వ కార్డును వినియోగించుకుంటోంది. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టింది. ముఖ్యంగా నేపాల్​తో ఇది అసలు సాధ్యపడటమే కష్టం. నేపాల్​ను​ హిందూ దేశంగా ప్రకటించడానికి అక్కడి ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్ల ఇరు దేశాలు మరింత దూరంగా జరిగాయి.

నేపాల్​ అనూహ్య వైఖరి వెనుక చైనా హస్తం ఉందనుకోవడం భారత్​ చేస్తున్న అతిపెద్ద తప్పు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారత్​-నేపాల్​ మైత్రి మరింత క్షీణిస్తుంది. ఇది ఇరు దేశాలకూ నష్టమే.

ఉద్యోగాల వేటలో ప్రతి ఏడాది అనేకమంది నేపాల్​ యువత భారత్​కు వస్తుంటారు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు కొనసాగుతున్న తరుణంలో వారు భారత్​కు రావడంపై పునరాలోచించుకునే అవకాశాలు లేకపోలేదు. ఇది భారత్​కు ఎంతో ఆందోళన కలిగించే విషయం.

(సంజయ్​ కపూర్​, సీనియర్​ పాత్రికేయులు)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.