ETV Bharat / opinion

కరోనాతో సార్వత్రిక చదువులకు పరీక్షాకాలం! - online education nep2020

ఏటా దేశంలో 40లక్షల మంది విద్యార్థులు ఓపెన్‌, దూరవిద్యా సంస్థల్లో ప్రవేశం పొంది విద్యను అభ్యసిస్తున్నారు. కానీ కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యావిధానం 2020లో ఓపెన్​ యూనివర్సిటీల ప్రస్తావనే లేదు. దూరవిద్యాభ్యాసం గురించి ఇందులో సవివరంగా పేర్కొనకపోవటం బాధాకరం. మరోవైపు కరోనా.. ఓపెన్‌ యూనివర్సిటీలపైనా అనుకూల, ప్రతికూల ఫలితాలను కలిగిస్తోంది.

NEP 2020-OPEN - DISTANCE- EDUCATIONAL -INSTITUTIONS
సార్వత్రిక చదువులకు పరీక్షాకాలం
author img

By

Published : Oct 24, 2020, 8:50 AM IST

ఉన్నత విద్య రూపాంతరానికి జాతీయ విద్యావిధానం 2020 విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల అమలుకు ఓపెన్‌ యూనివర్సిటీలు తమ సామర్థ్యాలు, వ్యూహాలు, బోధన, పాలన, సాంకేతిక పద్ధతులు, వనరుల సమీకరణ మొదలైన అంశాల్లో మార్పులను ప్రవేశ పెట్టడం ఒక పెద్ద సవాలుగా పరిణమిస్తోంది.

ఆన్​లైన్​ విద్యకు ప్రాధాన్యం :

కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యావిధానం 2020 ఏకాంశ అధ్యయన స్థానంలో బహుళ అంశ అధ్యయనాన్ని ప్రతిపాదించింది. ఆన్‌లైన్‌, డిజిటల్‌ విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించింది. ఈ రెండు విధానాలు ఓపెన్‌ యూనివర్సిటీలకు కొత్త కాదు. వీటిని పరిమితంగా ఉపయోగిస్తున్నాయి. నూతన విద్యావిధానం అమలు నేపథ్యంలో ఈ రెండు పద్ధతులను ప్రాధాన్య అంశాలుగా గుర్తించి విస్తృతపరచుకోవాలి. భారత దేశం విజ్ఞాన సమాజంగా అవతరిస్తున్న ప్రస్తుత తరుణంలో యువతను ఉత్తమ సృజనాత్మక, విలువలు, ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉన్నత విద్యపై ఉంది. ఈ లక్ష్య సాధనలో సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు ఓపెన్‌ యూనివర్సిటీలూ ముఖ్యపాత్రను పోషిస్తున్నాయి.

40లక్షలమందికి దూరవిద్య :

దేశంలో ఉన్నత విద్యను ప్రజాస్వామ్యీకరణ చేసే ఉద్దేశంతో మొట్టమొదటి ఓపెన్‌ యూనివర్సిటీని 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. దేశంలో ప్రస్తుతం జాతీయ ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీతో పాటు పదమూడు రాష్ట్రస్థాయి ఓపెన్‌ యూనివర్సిటీలు సేవలు అందిస్తున్నాయి. వివిధ సంప్రదాయ విశ్వవిద్యాలయాలూ దాదాపు 250 దూరవిద్యాకేంద్రాలను స్థాపించి దూరవిద్యను బోధిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం దేశంలో 40లక్షల మంది విద్యార్థులు ఓపెన్‌, దూరవిద్యా సంస్థల్లో ప్రవేశం పొంది విద్యను అభ్యసిస్తున్నారు. దేశ స్థూల నమోదు నిష్పత్తిలో ఇది 23శాతం. దేశ ఉన్నత విద్య భవిష్యత్తు ఓపెన్‌, దూర విద్యాభ్యాసంపై ఆధారపడి ఉందని, దాన్ని విజయవంతం చేయడానికి ఓపెన్‌ యూనివర్సిటీలు సంసిద్ధంగా ఉండాలని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

నిర్వహణలో సమస్యలెన్నో :

ఇంత ప్రాధాన్యం ఉన్న రంగాన్ని జాతీయ నూతన విద్యావిధానం 2020 సవివరంగా పేర్కొనకపోవడం బాధాకరం.నిర్వహణలో సమస్యలెన్నో ఉన్నత విద్య రూపాంతరానికి జాతీయ విద్యావిధానం విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల అమలుకు ఓపెన్‌ యూనివర్సిటీలు తమ సామర్థ్యాలు, వ్యూహాలు, బోధన, పాలన, సాంకేతిక పద్ధతులు, వనరుల సమీకరణ మొదలైన అంశాల్లో మార్పులను ప్రవేశ పెట్టడం ఒక పెద్ద సవాలుగా పరిణమిస్తోంది. నూతన విద్యావిధానం ఏకాంశ అధ్యయన స్థానంలో బహుళ అంశ అధ్యయనాన్ని ప్రతిపాదించింది. ఆన్‌లైన్‌, డిజిటల్‌ విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించింది. ఈ రెండు విధానాలు ఓపెన్‌ యూనివర్సిటీలకు కొత్త కాదు. వీటిని పరిమితంగా ఉపయోగిస్తున్నాయి. నూతన విద్యావిధానం అమలు నేపథ్యంలో ఈ రెండు పద్ధతులను ప్రాధాన్య అంశాలుగా గుర్తించి విస్తృతపరచుకోవాలి.

పోటీని ఎదుర్కొవాల్సిందే!

ఉన్నత విద్యను అందించే పద్ధతి ఏదైనా కోర్సులు, సిలబస్‌, బోధనా పద్ధతులు, ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు, సూచికలతో సరితూగే విధంగా ఉండాలని విధానపత్రం సూచిస్తోంది. ఇది సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, ఓపెన్‌ యూనివర్సిటీల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి దారితీస్తుంది. ఈ పోటీని ఎదుర్కోటానికి ఓపెన్‌ యూనివర్సిటీలు సుపరిపాలనా లక్షణాలైన పారదర్శకత, జవాబుదారీతనం, విద్యార్థుల సమస్యలకు తక్షణ స్పందన మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి. విద్యార్థి సేవా విభాగం, దృశ్య శ్రవణ విభాగం, పరీక్షల విభాగాలను సమన్వయ పరచి, విద్యార్థుల సమస్యల సత్వర పరిష్కారానికి, ఏక గవాక్ష పద్ధతిని ప్రవేశ పెట్టడానికి అంతర్గత సంస్కరణలను చేపట్టాలి. అంతర్జాల విద్యాబోధనకు అనువుగా అవసరమైన సాంకేతిక నైపుణ్య అంశాల్లో కోర్సు రచయితలకు, బోధనాసిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించాలి. ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందే విద్యార్థుల నేపథ్యం పరిశీలిస్తే అధికశాతం సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన వారు. ఈ విద్యార్థులను మానసికంగా, సాంకేతికంగా ఆన్‌లైన్‌, డిజిటల్‌ బోధనకు సిద్ధపరచడం ఒక పెద్ద సవాలు. అధ్యయన కేంద్రాల స్థాయిలో డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేయడం, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ కోసం సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయడం, విద్యార్థులకు లాప్‌ టాప్‌లను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను తప్పక చేపట్టాలి.

కరోనా ప్రభావం..

ఓపెన్‌ యూనివర్సిటీలపై కరోనా ప్రతికూల, అనుకూల ఫలితాలను కలిగిస్తోంది. ఓపెన్‌ యూనివర్సిటీలు ఆధార నమూనా ప్రకారం పనిచేస్తాయి. సంప్రదాయ కళాశాలలు అందించే మౌలిక వసతులు, సదుపాయాలను వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులకు సేవలను అందిస్తాయి. కరోనా కారణంగా సంప్రదాయ విశ్వవిద్యాలయాలు. కళాశాలల పరిస్థితే గందరగోళంగా తయారైంది. ఓపెన్‌ యూనివర్సిటీల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓపెన్‌ యూనివర్సిటీల కోర్సుల ప్రవేశం, కౌన్సెలింగ్‌ తరగతుల నిర్వహణ, స్టడీ మెటీరియల్‌ పంపిణీ, సైన్సు ప్రాక్టికల్స్‌, పరీక్షల నిర్వహణ వంటి కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా విద్యార్థులు నేరుగా కళాశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితులు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌, డిజిటల్‌ విద్యాబోధనకే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. ఈ తరుణంలో ఓపెన్‌ యూనివర్సిటీలు తమ కోర్సులను పటిష్ఠపరచి, విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా కోర్సుల్లో ప్రవేశం పొందేవిధంగా చర్యలు చేపట్టాలి. ఈ చర్యలు యూనివర్సిటీల ఆర్థిక పరిపుష్టికి దారితీస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి..

జాతీయ నూతన విద్యావిధానం అమలు ఓపెన్‌ యూనివర్సిటీలకు గుదిబండగా మారకుండా ఉండాలంటే- రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సక్రమంగా విడుదల చేయటంతో పాటు అదనపు నిధులను సమకూర్చాలి.

కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఆత్మ నిర్భర్‌ పథకం కింద ఓపెన్‌ యూనివర్సిటీలకు ప్రత్యేక నిధులను మంజూరు చేయాలి. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు, క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యల పరిష్కారానికి యూనివర్సిటీల్లో విస్తృత స్థాయి చర్చ జరగాలి. అప్పుడే నూతన విద్యావిధానం అమలులో ఓపెన్‌ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించగల వీలుంటుంది.

- డాక్టర్‌ సిహెచ్‌.సి.ప్రసాద్‌(అసిస్టెంట్‌ డైరెక్టర్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.