ETV Bharat / opinion

'నెలసరి వ్యర్థాల నిర్వహణకు సాంకేతికత అనివార్యం' - రుతుక్రమ వ్యర్థాలు

కరోనా సంక్షోభం మానవాళికి ఎన్నో సవాళ్లు విసిరింది. లాక్​డౌన్​లో సాధారణ జీవనం గడపలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా మహిళలు రుతుక్రమానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్​డౌన్​లో కనీసం వినియోగించిన శానిటరీ న్యాప్కిన్స్​ పారేయటంలోనూ అనేక సమస్యలు వెక్కిరించాయి. ఈ నేపథ్యంలో మహిళల నెలసరి సమస్యలకు, వ్యర్థాల నిర్వహణకు సాంకేతికత వినియోగించుకోవాలంటున్నారు.. జెండర్​ రైట్స్​, ఫ్యామిలీ ప్లానింగ్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా డైరెక్టర్​ నిషా జగదీశ్​.

menstrual waste
నెలసరి వ్యర్థాల నిర్వహణకు.. అధునాతన సాంకేతికత అనివార్యం
author img

By

Published : Nov 25, 2020, 12:40 PM IST

దేశంలో మహిళలు రుతుక్రమ ఆరోగ్యం కాపాడుకోవటం, ఉపయోగించిన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను సురక్షితంగా పారవేయటం పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ముఖ్యంగా లాక్​డౌన్​ పరిస్థితులు ఈ సమస్యలపై తీవ్ర ప్రభావం చూపించాయి. దేశంలో మహిళల నెలసరి సమస్యలను కరోనా పరిస్థితులు మరింత పెంచాయి.

కరోనా వేళ కష్టాలు..

కరోనా విజృంభించిన వేళ.. దేశం పూర్తిస్థాయి లాక్​డౌన్​లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో శానిటరీ ప్యాడ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు మహిళలు. దేశవ్యాప్త లాక్​డౌన్​ విధించిన తర్వాత 7 రోజులు.. అంటే మార్చి 30 వరకు వీటిని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చలేదు. మరోవైపు వినియోగించిన శానిటరీ ప్యాడ్లను సురక్షితంగా పారేసేందుకు సైతం అగచాట్లు పడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

దేశంలో మహిళల నెలసరి సమస్యల గురించి అవగాహన పెంచేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ, స్వీయ పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులను విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మాట్లాడుకోవటానికి కూడా ఇష్టపడని వాడిపాడేసే నెలసరి వ్యర్థాల నిర్వహణ గురించి మాత్రం పెద్దగా చర్యలు తీసుకోవట్లేదు.

దేశంలో దురవస్థ

మ్యూస్​ ఫౌండేషన్​.. మహారాష్ట్ర ఠాణే మురికివాడల్లో నిర్వహించిన అధ్యయనం మహిళల దురవస్థకు అద్దం పట్టింది. ఇక్కడ దాదాపు 71% మంది డిస్పోజబుల్​ శానిటరీ న్యాప్కిన్స్​ వినియోగించారు. వీరిలో దాదాపు 45% మంది.. డస్ట్​బిన్​లు లేని కారణంగా పబ్లిక్​ టాయ్​లెట్లలోనే ఈ వ్యర్థాలను పారేశారు. ఇక మహమ్మారి సమయంలో ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లు, క్లాత్ ప్యాడ్‌లను పారవేసేందుకు మహిళల పడ్డ అవస్థలను చూస్తే... పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇది మహిళలకు పరిస్థితి ఎంత దయనీయంగా తెలియజేయటమే కాదు.. వ్యర్థాల నిర్వహణలో ఉన్న డొల్లతనాన్ని బయటపెడుతోంది. అనేక వ్యాధులు ప్రబలటానికి కారణాలను తెలియచెబుతోంది.

నిర్వహణపై అశ్రద్ధ

ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమానికి సంబంధించిన పరిశుభ్రత పట్ల మానవీయ కోణంలో స్పందించాలన్న వాదన పట్ల శ్రద్ధ పెరుగుతోంది. కానీ, ముఖ్యాంశాల్లో ఒకటిగా ఉండే వ్యర్థాల నిర్వహణ పట్ల అశ్రద్ధ కనిపిస్తోంది. మన దేశంలో ఘన వ్యర్థాలు ఏటా 6.3కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. మరోవైపు దేశంలోని మహిళలు ఏటా దాదాపు 4వేల 412 కోట్ల కిలోల రుతుక్రమ వ్యర్థాలు పారవేస్తున్నారు.

ఇదీ చూడండి: 'నెలకు నాలుగురోజుల పీరియడ్ ​లీవ్స్​పై స్పందించండి'

అవగాహన అత్యవసరం

2016 ఘన వ్యర్థాల నిర్వహణ నియమాల ప్రకారం.. నెలసరి వ్యర్థాలన్నింటినీ పెద్ద ఎత్తున బయోమెడికల్​ విధానాలతో కాల్చి బూడిద చేయాలి. అయితే, ఇలా చేయాలంటే ముందుగా ఈ వ్యర్థాల సేకరణ, వేరుచేయటంపై దృష్టి సారించాలి. ప్రజల్లోనే ఈ అవగాహన తీసుకురావాలి. క్షేత్రస్థాయిలో ఈ విధానాలపై దృష్టి పెడితే.. డంపింగ్ యార్డులలో ఇవి మండించకుండా నిరోధించగలం. లేదంటే ఇవి ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి.

ఫైనాన్షియల్​ ఇంక్లూజన్​ ఇంప్రూవ్స్​ శానిటైజేషన్​ అండ్​ హెల్త్​ (ఫినిష్​) సొసైటీ.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో 68% మహిళలు నాన్​-బయోడిగ్రేడబుల్​ ప్యాడ్లు వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. 24% మంది మహిళలు మాత్రమే కంపోస్టబుల్​ న్యాప్కిన్లు వాడుతున్నారు.

ప్లాస్టిక్​ భూతం..

వేర్వేరు అధ్యయనాల ప్రకారం... ఈ శానిటరి ప్యాడ్లలో ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్​ వినియోగించటం వల్ల.. ఒక్కో న్యాప్కిన్​ భూమిలో పూర్తిగా కలిసిపోవటానికి దాదాపు 500 నుంచి 800 ఏళ్లు పడుతుంది. ఇది మానవాళి ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో ప్రమాదకరం. చాలా మంది మహిళలు నెలసరి వ్యర్థాలను ఘన వ్యర్థాల్లోనే కలిపి పడేస్తుంటారు. యూనిసెఫ్​.. రుతుక్రమం వ్యర్థాలపై దేశాలు అశ్రద్ధ చేస్తున్నాయని చాలాసార్లు హెచ్చరించింది. వ్యర్థాల నిర్వహణ, సరైన అవగాహన లేకపోవటం వల్ల వీటి విషయంలో చాలాసార్లు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రత్యామ్నాయాల బాట..

సురక్షితమైన, పర్యావరణ హితమైన పారిశుద్ధ్య ఉత్పత్తులను ప్రోత్సహించటం ఇప్పుడు అత్యవసరం. శానిటరీ న్యాప్కిన్ల విషయంలోనూ ఈ మార్పు రావాలి. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను అందించి వాటిని ప్రజలకు చేరువ చేయాలి. ఇందుకోసం ఆచరణీయమైన పరిష్కారాలు అన్వేషించాలి. నెలసరి వ్యర్థాల నిర్వహణ సమస్యను వేగంగా పరిష్కరించేందుకు కలిసికట్టుగా అడుగేయాలి. సాంకేతిక పరిష్కారాలపై దృష్టిసారించాలి. తక్కువ ధరకే ఉత్పత్తులు అందించేలా.. అధునాతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. రుతుక్రమ ఆరోగ్య నిర్వహణను కీలకంగా భావించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.

సాంకేతికతే సమాధానం..

దేశంలో 2000 నుంచి ఘన వ్యర్థపదార్థాల నిర్వహణను.. చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. పరిస్థితులకు అనుగుణంగా దానికి అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను తీసుకొచ్చారు. ముఖ్యంగా కంపోస్టింగ్​పై దృష్టిసారించారు. పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, వ్యర్థాలను వేరుచేయడం, రీసైక్లింగ్, పునర్వినియోగం వంటి వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, కరోనా కష్టకాలంలో ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ సవాలుగా నిలిచింది. ఈ పరిస్థితులు కొత్త విధానాల గురించి ఆలోచించటం అనివార్యం. అధునాతన సాంకేతిక విధానాల వైపు అడుగులేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా మెనుస్ట్రువల్‌ వ్యర్థాల నిర్వహణలో మార్పులకు శ్రీకారం చూట్టాలి.

(రచయిత- నిషా జగదీశ్​, జెండర్​ రైట్స్​, ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా డైరెక్టర్)

ఇదీ చూడండి: తొలిదశలో కోటి మంది ఆరోగ్య సిబ్బందికి టీకా!

ఇదీ చూడండి: కొవిడ్​కు అనుబంధంగా మరో రెండు వ్యాధులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.