ETV Bharat / opinion

ఇంటిదొంగల స్వైరవిహారం జాతి మనుగడకే ప్రమాదకరం - isi corruption

కాసుల కోసమో, వలపు వలలోనో చిక్కి మాతృభూమికి ద్రోహం చేసే కేటగాళ్లతో దేశభద్రత పెనుప్రమాదంలో పడుతోంది. ఈ అక్రమార్కుల వల్ల దేశంలో రక్తం ఏరులై పారుతోంది. భారతావని సురక్షితం కావాలంటే విషవృక్షం వేళ్లను తుదికంటా పెకిలించి పారేయాల్సిందే.  దేశరక్షణలో ప్రాణాలనే పణంగా పెట్టే భద్రతా దళాలకు తలవంపులు తెచ్చే విశ్వాసఘాతకులందరినీ  కలుగుల్లోంచి బయటికి లాగాలి. ఇంటిదొంగల వెన్నులో వణుకు పుట్టేలా కఠిన శిక్షలు విధించాలి.

National security
దేశ భద్రత
author img

By

Published : Aug 15, 2021, 7:15 AM IST

పాలిచ్చిన అమ్మ రొమ్మునే గుద్దే భ్రష్టసంతానంతో తల్లి భారతి తరచూ శోకతప్తమవుతోంది. ముష్కర మూకలు విదిల్చే రూకలకు అంగలార్చే అక్రమార్కులతో దేశభద్రతే పెనుప్రమాదంలో పడుతోంది. అయిదేళ్ల క్రితం పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన భీకర ఉగ్రదాడిలో ఇంటిదొంగల ప్రమేయంపై నాడు రేగిన అనుమానాలు నేడు వాస్తవాలై విస్మయపరుస్తున్నాయి. స్థావరం చుట్టుపక్కల నిఘా పలచగా ఉండే ప్రాంతాల గుర్తింపు మొదలు లోపలికి ఆయుధాల చేరవేత వరకు- స్థానిక పోలీసుల్లోని అవినీతిపరులు కొందరు ఉగ్రవాదులకు అండదండలు అందించారన్నది అంతర్జాతీయ పాత్రికేయుల పరిశోధనాత్మక పుస్తక కథనం! తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ద్రోహుల్లో వీరే మొదటివారు కాదు.. చివరివారు అంతకంటే కాదు! ఇంటిదొంగల స్వైరవిహారం జాతి మనుగడకే ప్రమాదకరమని రోమన్‌ రాజనీతిజ్ఞుడు సిసెరో సహస్రాబ్దాల క్రితమే హెచ్చరించారు. అయితేనేమి? శత్రువుల మోచేతి నీళ్ల రుచిమరిగిన వారిని వీలైనంత త్వరగా గుర్తించి బోనెక్కించడంలో భారత యంత్రాంగ వైఫల్యం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.

మాతృదేశానికి ద్రోహం..

'ఆనాడు ఆ ముష్టి డబ్బుల కోసం నేను ఆశపడకపోయి ఉంటే సైన్యం నుంచి గౌరవప్రదంగా పదవీ విరమణ చేసి ఉండేవాణ్ని'- 1970ల్లో సంచలనం సృష్టించిన 'సాంబా స్పై కేసు' సూత్రధారి శర్వణ్‌ దాస్‌ నాలుగు దశాబ్దాల తరవాత చేసిన ప్రాయశ్చిత్త ప్రకటన ఇది! గూఢచర్యం ఆరోపణలపై యాభై మందికి పైగా సైన్యాధికారులు, సిబ్బంది అరెస్టు అయిన ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డబ్బుల కోసమే సరిహద్దులు దాటివెళ్ళిన జవాన్‌ దాస్‌- తిరిగి వచ్చిన తరవాత తోటివాళ్లనూ గూఢచర్య రొంపిలోకి దించాడు. 1993లో బొంబాయి నగరంలో నెత్తుటేళ్లు పారించిన వరస బాంబు పేలుళ్ల వెనకా కస్టమ్స్‌, పోలీసు అధికారుల కాసుల కక్కుర్తి ఉంది. ఆర్డీఎక్స్‌తో పాటు ఇతర మారణాయుధాల రవాణాకు సహకరించి లక్షల్లో లంచాలు పుచ్చుకొన్న ఆ ప్రబుద్ధుల 'దేశభక్తి' ఆ తరవాత విచారణలో బయటపడింది. డబ్బుల కోసం దేశాన్ని ఉగ్రవాదానికి అమ్మేసే ఇటువంటివాళ్లు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కోకొల్లలు! ఉగ్రవాదులతో అంటకాగడంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పిన డీఎస్పీ దేవీందర్‌ సింగ్‌ ఉదంతం కశ్మీరు లోయలో కలకలం సృష్టించింది. భద్రతాదళాల కళ్లుగప్పి తిరుగుతున్న ముష్కరులతో చెట్టపట్టాలు పట్టి కారులో షికారు చేస్తున్న ఆ పెద్దమనిషి నడిరోడ్డుపై అడ్డంగా దొరికిపోయాడు. ఖలిస్థాన్‌ ఉగ్రవాదికి స్వేచ్ఛను ప్రసాదించడానికి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు రూ.45 లక్షల లంచం స్వీకరించారని పంజాబ్‌ అధికారులు నాలుగేళ్ల నాడు బాంబు పేల్చారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు పాక్‌ ఐఎస్‌ఐతోనూ సంబంధాలు కలిగిన ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్ల గుట్టు ఈమధ్య రట్టు అయ్యింది. నావికా దళం రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్న పది మంది నావికులకు 'ఆపరేషన్‌ డాల్ఫిన్‌నోస్‌'తో సంకెళ్లు పడ్డాయి. 2019 చివరిలో, నిరుడు మొదట్లో విశాఖపట్నం, ముంబైల్లో చోటుచేసుకున్న ఈ అరెస్టులు- భద్రతా దళాల్లోకి పాకిన అవినీతి మహమ్మారి విశ్వరూపాన్ని కళ్లకు కట్టాయి. యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారు శత్రువులకు బేరంపెట్టారు!

ఉగ్ర'ప్రేమ'కు బానిసలై..

కాసుల కోసం లక్ష్మణరేఖ దాటేవారు కొందరైతే, వలపు వలలో చిక్కి మాతృదేశానికి ద్రోహం చేసేవారు మరెందరో ఉన్నారు. మత్తెక్కించే మాటలతో యాభై మంది జవాన్లను తనకు దాసోహం చేసుకొన్న 'అనిక చోప్రా'- భారత దళాలపై దాయాది దేశం ప్రయోగించిన నారీశరం! 'ఆమె' మాయలో పడిన సిపాయి సోమ్‌వీర్‌ సింగ్‌ అయితే ఏకంగా తన భార్యకు విడాకులు ఇచ్చేయడానికీ సిద్ధమైపోయాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఇద్దరు పాక్‌ మహిళలకు మన సైనిక స్థావరాల దృశ్యాలను బట్వాడా చేసిన గౌరవ్‌ కుమార్‌(రోహ్‌తక్‌, హరియాణా), ఐఎస్‌ఐ అడుగులకు మడుగులొత్తిన వాయుసేన గ్రూప్‌ కెప్టెన్‌ అరుణ్‌ మార్వాహ(దిల్లీ).. ఇలా ఎందరో ఉగ్ర'ప్రేమ'కు బానిసలై దేశ రహస్యాలను సరిహద్దులు దాటించారు. భద్రతా సిబ్బందిపై వలపు బాణాలను సంధించే 150కి పైగా నకిలీ సామాజిక మాధ్యమాల ఖాతాలను ఆ మధ్య సైన్యం గుర్తించింది. అటువంటి వాటి నుంచి బలగాలను కాచుకోవడానికి స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై త్రివిధ దళాలు ఆంక్షలు విధించాయి. పదుల కొద్దీ యాప్‌లను ప్రమాదకర జాబితాలో చేర్చాయి. క్రమశిక్షణ కంఠోపాఠమైన బలగాల్లో అసలు ఈ అవలక్షణాలు ఎందుకు ముమ్మరిస్తున్నాయి? శిక్షణలో లోపమా, పర్యవేక్షణలో అలసత్వమా? భారతావని సురక్షితం కావాలంటే విషవృక్షం వేళ్లను తుదికంటా పెకిలించి పారేయాల్సిందే. దేశరక్షణలో ప్రాణాలనే పణంగా పెట్టే భద్రతా దళాలకు తలవంపులు తెచ్చే విశ్వాసఘాతకులందరినీ కలుగుల్లోంచి బయటికి లాగాలి. ఇంటిదొంగల వెన్నులో వణుకు పుట్టేలా కఠిన శిక్షలు విధించాలి. అంతర్గత శత్రువుల ఆనుపానులను ఆగమేఘాలపై ఆరా తీసి అరదండాలు వేయడంలో దేశమెంత ఆలస్యం చేస్తే అంతగా ప్రతిఫలం చెల్లించుకోవాల్సి వస్తుంది. తస్మాత్‌ జాగ్రత్త!

ఇదీ చదవండి:భరతమాతకు స్వాతంత్ర్యం- ఎందరో మహానుభావుల త్యాగఫలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.