ETV Bharat / opinion

'ఎంఎస్​​ఎంఈ'లే దేశార్థికానికి పెద్ద ఆసరా

దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కరోనా మహమ్మారి పిడుగుపాటులా పరిణమించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ సైతం వాటికి అండగా నిలవలేకపోయిందన్న మూడీస్‌ సంస్థ విశ్లేషణ.. సత్వర దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతోంది! నిర్వహణ నిధులకు కొరత, పాత అప్పులపై వడ్డీ భారం, ముడి సరకు, నిపుణులైన కార్మికుల లేమితో దిక్కుతోచని దుస్థితిలో ఉన్న ఎంఎస్​​ఎంఈలకు దన్నుగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.

MSME's
'ఎంఎస్​​ఎంఈ'లే దేశార్థికానికి పెద్ద ఆసరా
author img

By

Published : Jun 24, 2020, 7:41 AM IST

పరిమిత పెట్టుబడులతో స్వయం ఉపాధి కల్పించడంలో, రకరకాల ఉత్పాదనలతో దేశార్థికానికి ఊపిరులూదడంలో ముందుండేవి- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్​​ఎంఈ)లు. మనుగడకై పోరాటంలో అవి ఏటికి ఎదురీదుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంకే లోగడ ధ్రువీకరించినా, నేటికీ వాటి తలరాత మెరుగుపడలేదు. కొన్నేళ్లుగా వరస కడగండ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న లఘు పరిశ్రమల పాలిట కరోనా మహమ్మారి పిడుగుపాటులా పరిణమించింది. ఇటీవలి కేంద్రప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ సైతం వాటిని కుదుటపరచలేకపోయిందన్న 'మూడీస్‌' సంస్థ విశ్లేషణ, సత్వర దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతోంది! దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న పరిశ్రమలకు వ్యవస్థాగత తోడ్పాటు సాకారం కావడం లేదన్న మొత్తుకోళ్లకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తాజా నివేదికా వత్తాసు పలుకుతోంది. దేశంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు పునరుజ్జీవం పొంది ఆర్థిక పురోగతికి క్రియాశీల సహకారం అందించడానికి కనీసం మూడేళ్లపాటు అన్నిరకాల నిబంధనలనుంచీ వాటికి మినహాయింపు ప్రసాదించాలన్నది సీఐఐ ముఖ్యసిఫార్సు. 'ఆత్మ నిర్భర్‌ అభియాన్‌' ప్యాకేజీ వెలుగుచూసిన ఆరువారాల తరవాతా నిర్దేశిత మూడు లక్షల కోట్ల రూపాయల రుణ వితరణలో భాగంగా విడుదలైనది కేవలం ఎనిమిది శాతమేనన్నది సుమారు పాతిక వాణిజ్య సంఘాలు, పారిశ్రామిక సంస్థల సమాఖ్య నిగ్గుతేల్చిన లెక్క. నిర్వహణ నిధులకు కొరత, పాత అప్పులపై పేరుకుపోతున్న వడ్డీ భారం, ముడి సరకుతోపాటు నిపుణ కార్మికులూ అందుబాటులో లేని వైనం- లఘు పరిశ్రమల్ని దిక్కుతోచని దుస్థితిలోకి నెట్టేస్తున్నాయి. వాటికి అత్యవసరంగా ప్రాణవాయువు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!

దేశంలోని మొత్తం శ్రామికశ్రేణిలో దాదాపు 45కోట్లమంది (90శాతం) అసంఘటిత రంగ కార్మికులేనని, వారిలో 40శాతందాకా లఘు పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో రమారమి 30శాతం వాటా, ఎగుమతుల పద్దులో 40శాతం వరకు ప్రాతినిధ్యం- చిన్న సంస్థల విశేష ప్రాధాన్యాన్ని చాటుతున్నాయి. అటువంటి లఘు పరిశ్రమలెన్నో కరోనా ధాటికి కుదేలై, గిరాకీ సన్నగిల్లి, అత్యవసర పెట్టుబడులపై సరైన భరోసా కొరవడి- తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. పూర్తిగా మూతపడే దురవస్థ నుంచి గట్టెక్కడానికంటూ అవి అభ్యర్థిస్తున్నవి- అసంబద్ధ డిమాండ్లేమీ కాదు. సిబ్బంది జీతాల్నీ చెల్లించలేకపోతున్న చిన్న పరిశ్రమలు రుణపరిమితిలో 50శాతందాకా ఎటువంటి షరతులూ లేకుండా ఇవ్వాలని, యూనిట్లు మూతపడిన కాలానికి విద్యుత్‌ ఛార్జీలు మాఫీచేయాలని కోరుతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ నాలుగు శాతానికి రెపోరేటును తగ్గించినా, చిన్న సంస్థలనుంచి బ్యాంకులు 8-14శాతం వడ్డీరేటునే వసూలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్‌టీ వసూళ్లలో 30శాతం వరకు లఘు పరిశ్రమలనుంచే జమపడుతోంది. సీఐఐ సహేతుక సిఫార్సును మన్నించి, ఎంఎస్​​ఎంఈల పునరుజ్జీవాన్ని లక్షించి కేంద్రం సమగ్ర ఉద్దీపన చర్యల్ని చురుగ్గా పట్టాలకు ఎక్కించాలి. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని నిలబడలేక 70శాతం మేర చిన్న సంస్థలు మూతపడుతున్న దృష్ట్యా- అవకాశాల్ని, ఆధునికతను ఒడిసిపట్టేలా శిక్షణనిచ్చే నిమిత్తం జిల్లాకొక ప్రత్యేక విశ్వవిద్యాలయం నెలకొల్పాలన్న సూచనలూ వినిపిస్తున్నాయి. తయారీ రంగాన భారత్‌ కొన్ని మెట్లు పైకి ఎక్కడానికి ఎంఎస్​​ఎంఈల సముద్ధరణే రాజమార్గం. సంక్షోభంలో సదవకాశం చూడాలంటున్న మోదీ ప్రభుత్వం, ఈ గడ్డుసవాలుకు దీటుగా స్పందించాలి!

ఇదీ చూడండి: 20 రోజుల్లో రూ.79 వేల కోట్ల రుణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.