ETV Bharat / opinion

Madhya Pradesh Assembly Election 2023 : కమల్​నాథ్ కంచుకోటలో పాగాకు బీజేపీ ప్లాన్​.. దేవుని విగ్రహాల చుట్టూ రాజకీయం! - కమలనాథ్ vs వివేక్ బంటీ సాహు ఛింద్వాడ

Madhya Pradesh Assembly Election 2023 : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ప్రాంతాలను బట్టి రాజకీయ వాతావరణం కూడా మారుతోంది. ఛింద్వాడలో రాజకీయం.. దైవ విగ్రహాల చుట్టూ తిరుగుతోంది. అక్కడ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ పోటాపోటీగా ఎత్తైన దేవతల విగ్రహాలను నిర్మించారు. ఇదంతా ఓట్ల గెలుపు కోసమే అనే విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.

Madhya Pradesh Assembly Election 2023
మధ్యప్రదేశ్‌ ఛింద్వాడలో కమలనాథ్ vs బంటీ సాహు
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 8:44 AM IST

Madhya Pradesh Assembly Election 2023 : మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడ జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేందుకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ చేయని ప్రయత్నమంటూ ఏదీలేదు. ఛింద్వాడ.. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌కు కంచుకోట. అక్కడ పట్టుకోసం బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఛింద్వాడ లో దైవ విగ్రహాల చుట్టూ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది.

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఛింద్వాడ -నాగ్‌పూర్ రోడ్డులో సెమారియా వద్ద 2014లో 101 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయించారు. ఇందుకు ప్రతిగా ఆయన ప్రత్యర్థి, బీజేపీ నేత బంటి సాహు.. ఛింద్వాడ -జబల్‌పూర్‌ రోడ్డులో 81 అడుగుల శివుని విగ్రహం ఏర్పాటు చేయించారు. ఐతే ఎన్నికలు దగ్గరపడిన కొద్దీ విగ్రహాల ఏర్పాటుపై విమర్శలు వస్తున్నాయి. ఛింద్వాడలో మళ్లీ గెలవడం కోసం కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ మతాన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నారని ఆయన ప్రత్యర్థి బంటి సాహు ఆరోపించారు.

"ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే కమల్‌నాథ్‌ ఆలయం నిర్మించారు. రామేశ్వరం ధామ్‌ను మా కుటుంబమే నిర్మించింది. అయినప్పటికీ నేను ఎన్నికల కోణంలో చూడలేదు. ఏటా మేము ఆధ్యాత్మిక కార్యక్రమాలైన భగవత్‌ కథ, రామ్‌ కథ వంటివి నిర్వహిస్తూ ఉంటాం. కమల్‌నాథ్‌ మాత్రం ఎన్నికలకు నెల ముందు మాత్రమే నిర్వహిస్తున్నారు. అందుకే ఛింద్వాడ ప్రజలు ఆయన్ని ఓడించాలని నిర్ణయించారు."
-బంటి సాహు, బీజేపీ ఛింద్వాడ అభ్యర్థి

సాహు ఆరోపణలను కమల్‌నాథ్ కుమారుడు, ఛింద్వాడ లోక్‌సభ సభ్యుడు నకుల్‌నాథ్ తోసిపుచ్చారు. హనుమాన్‌ విగ్రహం ఏర్పాటుకు రాజకీయాలకు సంబంధంలేదని అన్నారు. హనుమాన్ ఆలయం నిర్మించిన నాటికి... అసెంబ్లీ ఎన్నికలకు అప్పటికే నాలుగేళ్ల సమయం ఉందని తెలిపారు. "భాగేశ్వర్‌ వద్దకు కమల్‌నాథ్‌ వెళ్లి. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఎన్నికలకు 9 నెలల సమయం ఉంది. అదేవిధంగా 6 నెలల క్రితం ప్రదీప్ మిశ్రా ఇందౌర్‌లో నాతో సమవేశమయ్యారు. అప్పటికి ఎన్నికల తేదీ నిర్ణయించలేదు. ఎన్నికల తేదీ ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడే అసలు కథ మొదలైంది." అని నకుల్ నాథ్‌ పేర్కొన్నారు.

ఛింద్వాడ ప్రజలు మాత్రం విగ్రహాలకు రాజకీయాలతో సంబంధం ఉందంటే నమ్మడం కష్టమని చెబుతున్నారు. తమ ప్రాంతం సమృద్ధిగా ఉండేందుకు దైవం సాయం ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. "ఇది భక్తులకు శుభవార్తే. ఎందుకంటే ఎవరైతే శివుడిపై నమ్మకం ఉందో వారు అక్కడకు వెళ్తారు. ఎవరైతే హనుమంతుడిని విశ్వసిస్తారో వారు ఇక్కడకు వస్తారు. ఒక వేల ఓటు బ్యాంకు కోసం ఇది పోటీనే అయితే చివరకు అది మంచిదే." అని విశాల్ శర్మ అనే స్థానికుడు తెలిపాడు. పోటీ ఉంటే పనులు బాగా జరుగుతయని అభిప్రాయపడ్డాడు. కాగా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబరు 17న.. ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  • 7:57 AM " class="align-text-top noRightClick twitterSection" data=" 7:57 AM "> 7:57 AM

India Alliance in Madhya Pradesh : ఇండియా కూటమి ఉన్నట్టా లేనట్టా? దిల్లీలో దోస్తీ.. అసెంబ్లీ ఎన్నికల్లో కుస్తీ!

BJP Tough Seats In Chhattisgarh : ఆ 9 స్థానాలే టార్గెట్​.. 23 ఏళ్లుగా గెలవని బీజేపీ.. ఈసారి పక్కా ప్లాన్​తో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.