ETV Bharat / opinion

ప్రభుత్వాలు కుదేలు- గతి తప్పిన ఆర్థిక రథాలు - companies close due to corona crisis

కొవిడ్‌ తదనంతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతర్లీనంగా దీర్ఘకాలిక మార్పులకు లోనవుతుందని, కొవిడ్‌ పెనుతుపాను నుంచి ఇండియాకు రక్షణ లేదన్న వాస్తవాలను నిరాకరించేంతగా మన ఆశావహ దృక్పథం కరడుగట్టింది. ఈ సమస్య స్వల్పకాలికమని, మన ఆర్థిక వ్యవస్థ దీన్నించి గట్టెక్కడానికి మహా అయితే కొన్ని నెలలే పడుతుందనే తప్పుడు భావనలో పడిపోయాం. మనం ఎదుర్కొనే ఇతర సమస్యలన్నింటి కంటే కొవిడ్‌ చాలా భిన్నమైంది. ఇది మానవ మనుగడ మూలాలనే పెకలించివేస్తోంది. కంపెనీలు, ప్రభుత్వాలు కుదేలయ్యాయి. ఆర్థిక రథాలు గతితప్పాయి.

Lightning on world trade .. settling uncertainty
ప్రపంచ వాణిజ్యంపై పిడుగు.. స్థిరపడుతున్న అనిశ్చితి
author img

By

Published : Aug 31, 2020, 7:44 AM IST

గడచిన 300 ఏళ్ల చరిత్రను అవలోకిస్తే, ప్రతి కొత్త శతాబ్ది ప్రథమార్థం దారుణ మారణహోమపు అపార విధ్వంసాన్ని ధరిత్రిపై లిఖించిన యుద్ధాలు, మహమ్మారులు, మహామాంద్యాలు, ఆర్థిక సామాజిక ఘర్షణలకు సాక్షీభూతంగా నిలిచింది. దురదృష్టవశాత్తు, మానవాళి తన చరిత్రను ప్రతిసారీ మరిచిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ కొత్తగా కనిపిస్తాయి. మనదేశంలో చాలామంది ఆశావాదులే. కొవిడ్‌ తదనంతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతర్లీనంగా దీర్ఘకాలిక మార్పులకు లోనవుతుందని, కొవిడ్‌ పెనుతుపాను నుంచి ఇండియాకు రక్షణ లేదన్న వాస్తవాలను నిరాకరించేంతగా మన ఆశావహ దృక్పథం కరడుగట్టింది. ఈ సమస్య స్వల్పకాలికమని, మన ఆర్థిక వ్యవస్థ దీన్నించి గట్టెక్కడానికి మహా అయితే కొన్ని నెలలే పడుతుందనే తప్పుడు భావనలో పడిపోయాం. మనం ఎదుర్కొనే ఇతర సమస్యలన్నింటికంటే కొవిడ్‌ చాలా భిన్నమైంది. ఇది మానవ మనుగడ మూలాలనే పెకలించివేస్తోంది. కంపెనీలు, ప్రభుత్వాలు కుదేలయ్యాయి. ఆర్థిక రథాలు గతితప్పాయి. ఎంతోమంది తమ ఆదాయ వనరులను కోల్పోతున్నారు. ఇంకెంతోమంది ఉన్న ఉపాధినీ వదిలేసుకుంటున్నారు. ముందు జాగ్రత్తలు, మందులు ఇత్యాది అవసరాల కోసం ఇతర వ్యయాలను పణంగా పెడుతున్నారు.

గాడి తప్పనున్న ఆర్థిక వలయం

గత వందేళ్లలో చవి చూసిన యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల మాదిరిగా కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఒక ఆరోగ్య సమస్య దెబ్బతీస్తోంది. మంచోచెడో ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు, వ్యాపార సంస్థలు అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతాయి. కానీ, ఇప్పుడలా లేదు. ప్రపంచమంతా అనిశ్చితి రాజ్యమేలుతోంది. వ్యాపార వేత్తలు అనిశ్చితిలో ప్రణాళికలు రూపొందించుకోలేరు. గిరాకీ సరఫరా గొలుసుల్లో జరుగుతున్న విధ్వంసానికి స్పందనగా- అన్ని వ్యయాలూ ఆపేసి ఉన్న వనరులను సంరక్షించుకుంటున్నారు. కోట్ల కొద్దీ వ్యాపార సంస్థలు చేపట్టిన ఈ వ్యయాల కట్టడి- వ్యాపార వలయం, ఆపై ఆర్థిక వలయం కుప్పకూలడానికి దారితీస్తుంది. ఫలితంగా, అసంఖ్యాక తిరోగమన చర్యలు ఒకదాని వెనక మరొకటిగా గొలుసులా తోసుకొచ్చి మొత్తం ఆరిక వ్యవస్థనే దెబ్బతీస్తాయి.

పర్యవసానాలిలా...

ప్రస్తుతం కొనసాగుతున్నవి వర్ధమాన దేశాలకు నిస్సందేహంగా ప్రతికూల పరిణామాలే. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై వీటి ప్రభావం పలు కారణాల వల్ల తీవ్రంగా ఉంటుంది. మొదటిది, ఈ దేశాల్లో వాణిజ్యపు ఆర్థిక గుణకం 2 గా ఉంటుంది. అంటే, వాణిజ్యం ద్వారా వచ్చే ప్రతి రూపాయీ అంతిమంగా విభిన్న రంగాల్లో రెండు రూపాయల రాబడికి దోహదపడుతుంది. వాణిజ్యం పతనం కావడం, తిరిగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడినపడేందుకు చాలా సమయం తీసుకుంటుంది. రెండోది, వర్ధమాన దేశాలు ప్రధానంగా ముడిసరకులు, మాధ్యమిక వస్తువులు ఎగుమతి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కార్యకలాపాలు తగ్గినప్పుడు వీటి గిరాకీ, ధరలు క్షీణిస్తాయి. మూడోది, భారత్‌ సహా అనేక వర్ధమాన దేశాలకు భారీగా ఆదాయ, పెట్టుబడి, ఆర్థిక లోటు ఉంటాయి. ప్రజల ఆదాయాలు క్షీణిస్తాయి. ఉద్యోగాలు పోతాయి. కరెన్సీల విలువలపై ఒత్తిడి పెరుగుతుంది. ఒకసారి ఆర్థిక సమస్యలు కరెన్సీ సమస్యలుగా మారినప్పుడు, తిరోగమనం అదుపు తప్పుతుంది. నెలల తరబడి లాక్‌డౌన్ల ఫలితంగా, ప్రపంచ గోదాముల్లో సరకులు నిండుకుంటున్నాయి. అనేక వస్తువుల నిల్వలు బాగా తగ్గిపోయాయి. సమీప కాలంలో కొన్నయినా కర్మాగారాలు తెరుచుకోక తప్పదు. వాణిజ్యమూ పుంజుకొంటుంది. ఇది స్వల్పకాలిక ఊరటను కలిగిస్తుంది. కొవిడ్‌ ప్రబలి ఇప్పటికే ఆరు నెలలు దాటిపోయింది. క్రమంగా ప్రజలూ అలవాటు పడిపోతారు. అనిశ్చితే ఒక కొత్త సాధారణ స్థితి అవుతుంది. పెద్దగా మార్పు రానప్పటికీ, పరిస్థితి మెరుగు పడుతుందని ఎవరికి వారే అనుకుంటూ ఉంటారు. ఆర్థికంగా సాధారణస్థితి నెలకొనడానికి దోహదపడే మానసికాంశం ఇది.

స్తంభింపజేసిన కొవిడ్‌

జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యంపై కొవిడ్‌ ప్రభావం అత్యంత తీవ్రస్థాయిలో ఉంది. ఈ మహమ్మారి కారణంగా గత మూడు నెలలుగా అన్ని వాణిజ్య మార్గాలూ స్తంభించాయి. 1980 తదనంతర ప్రపంచంలో ద్రవ్య విపణులు, మదుపు మార్కెట్లు, పారిశ్రామిక ఉత్పత్తులు అధికాధికంగా సాంకేతికతను సంతరించుకున్నాయి, ఎల్లలు అధిగమించి విస్తరించాయి, సమర్థతే గీటురాయిగా కనీస ఉత్పత్తి వ్యయాలతో విరాజిల్లాయి. సరిహద్దులు లేని ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఎక్కడ అంతరాయం ఏర్పడినా, దాని ప్రకంపనలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి. అలాంటిది, భూమి అంతటా వ్యాపించిన కొవిడ్‌ ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు ఊపిరాడకుండా చేసింది. 90శాతం ప్రపంచ వాణిజ్యం నౌకలు లేదా సరకు రవాణా విమానాల ద్వారా జరుగుతోంది. 2018 అంతర్జాతీయ వర్తకంలో చమురుసహా అన్ని సరకుల గరిష్ఠ వాణిజ్య విలువ 19.5లక్షల కోట్ల డాలర్లు. ఇందులో అభివృద్ధి చెందిన దేశాల వాటా 9.3 లక్షల కోట్ల డాలర్లు. అంతర్జాతీయంగా సరకుల రవాణాలో 20 అడుగుల కంటెయినర్ల ద్వారా జరిగేది లక్ష కోట్ల డాలర్లు. కొవిడ్‌ వల్ల ఇది ఎంత లేదన్నా 14 నుంచి 30 శాతం పడిపోయింది. ఫిబ్రవరి- ఏప్రిల్‌ 2020 కనిష్ఠ స్థాయి నుంచి ప్రస్తుతం కొంత కోలుకున్నా, కంటెయినర్‌ నౌకాశ్రయాల్లో రాకపోకలు గతేడాది మధ్య ఆగస్టులో కంటే ఏడుశాతం తగ్గిపోయాయి. ఆర్థిక, వాణిజ్యాల స్వస్థతను ప్రతిబింబించే మరో ముఖ్య సూచీ అంతర్జాతీయ పర్యాటకం. సేవల రంగంలో చాలామటుకు వాణిజ్యం పర్యాటకం మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులు కిందటేడాదితో పోలిస్తే 40 శాతం తక్కువగానే ఉన్నాయి. ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య ఇది 80శాతం వరకు క్షీణించింది. అసలే తిరోగమనంలో ఉన్న వాణిజ్యం పాలిట కొవిడ్‌ పిడుగుపాటులా మారింది. 2018తో పోల్చితే 2019లో 2.5శాతం క్షీణించిన ప్రపంచ వాణిజ్యం 2020లో మహమ్మారి దెబ్బకు 7-13శాతం పతనం కాబోతోంది. వర్తకం తగ్గినందువల్ల వాణిజ్య వ్యయాలు మరింతగా పెరుగుతాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా ప్రకారం, ఈ భారం 15-31 శాతం వరకు ఉంటుంది. వాణిజ్య వ్యయంతో పాటు వస్తువుల విక్రయ వ్యయం పెరుగుతుంది. దీంతో వ్యాపారాల గిట్టుబాటు ప్రశ్నార్థకం అవుతుంది. కొవిడ్‌ ఆంక్షల వల్ల ఓడరేవుల్లో కార్యకలాపాలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రముఖ నౌకాశ్రయాల్లో రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఓడరేవుల్లో అసాధారణ జాప్యం జరుగుతున్న కారణంగా నౌకా రవాణా కంపెనీలు నౌకల వేగాన్ని తగ్గించడంతో పాటు, చుట్టుదారులను ఎంచుకుంటూ ఛార్జీలు పెంచేశాయి. నౌకల ప్రయాణాల రద్దు కూడా జరుగుతుండటంతో, డెలివరీ షెడ్యూళ్లు గాడి తప్పాయి. దీంతో సరఫరా సంస్థలు దిగుమతిదారులకు భారీగా అపరాధ సుంకాలు చెల్లించాల్సి వస్తోంది.

-డాక్టర్​ ఎస్​.అనంత్(ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు)

ఇదీ చూడండి: చైనాను కలవరపెట్టిన భారత సీక్రెట్ ఆపరేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.