ETV Bharat / opinion

ఉద్యోగ అవకాశాలే మందగమనానికి మందు!

author img

By

Published : Jul 1, 2020, 7:35 AM IST

దేశంలో భారీ పరిశ్రమలు తమ వస్తువులకు అమ్మకాలు లేకపోవడం వల్ల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. చిన్న తరహా పరిశ్రమలు- పెరిగిన రుణాలు, స్తంభించిన లావాదేవీలతో.. నగదు కొరతతో సతమతమవుతున్నాయి. నిరుద్యోగిత పెరిగింది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని పెంచాలి. ఇందుకోసం గిరాకీ పెరగాలి. అంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి. దానికి ఉద్యోగావకాశాలు బాగా పెరగాలి.

Financial Crisis
భారీ పరిశ్రమలు

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్‌ రంగంలోని భారీ పరిశ్రమలు తమ వస్తువులకు అమ్మకాలు లేకపోవడంతో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. చిన్న తరహా పరిశ్రమలు- పెరిగిన రుణాలు, స్తంభించిన లావాదేవీలతో నగదు కొరతతో సతమతమవుతున్నాయి. నిరుద్యోగిత పెరిగింది. రైతులు మార్కెట్‌ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని పెంచాలి. ఇందుకోసం గిరాకీ పెరగాలి. అంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి. దానికి ఉద్యోగావకాశాలు బాగా పెరగాలి.

భారీ, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగం సమస్యల వలయంలో చిక్కుకున్న స్థితిలో ఇదంతా సాధ్యమయ్యే పనేనా? కొంతమంది నిపుణులు సూచించినట్లుగా కరెన్సీ నోట్లు ముద్రించి పంపిణీ చేస్తే- వస్తువుల ఉత్పత్తి పెరగకుండానే కొనుగోలు శక్తి పెరిగిన కారణంగా గిరాకీ అధికమై ధరల పెరుగుదలకు, ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది.

ఉద్యోగాలు కల్పించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచితే, వస్తువుల ఉత్పత్తి కూడా సమాంతరంగా పెరగటం వల్ల, గిరాకీ పెరిగినా ధరలు ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉండదు. ప్రైవేటు రంగంలో అదనంగా ఉద్యోగావకాశాల కల్పన కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక అంశాలపై దృష్టి సారించడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్ఛు

నిలిచిపోయిన ప్రాజెక్టులకు నిధులేవీ?

వివిధ దశల్లో ఉండి పలు కారణాలతో నిలిపివేసిన, మందగమనంతో సాగుతున్న ప్రాజెక్టుల సంఖ్య దేశవ్యాప్తంగా 401 దాకా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. జాప్యం వల్ల ఈ ప్రాజెక్టులలో పెరిగిన ఖర్చు 2019 డిసెంబర్‌ నాటికి రూ.4.06 లక్షల కోట్లుగా తేలింది. భూసేకరణ, అటవీశాఖ అనుమతులు, నిర్మాణ పరికరాల కొనుగోలు ఇత్యాది విషయాలలో కాలయాపన వల్ల ప్రాజెక్టులలో కాలయాపనతోపాటు వ్యయం కూడా విపరీతంగా పెరుగుతున్నట్లు నిర్ధరించారు. ఇలాంటి జాప్యం విద్యుత్తు రంగం, నీటి పారుదల, రహదారులు, రైల్వే శాఖలలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

వివిధ రంగాలలో తుది దశలో ఉండి నిలిచి పోయిన ప్రాజెక్టులను గుర్తించి తగినంత నిధుల్ని వెచ్చించి పనులు చేపడితే నిర్మాణ రంగంలోని లక్షల మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ప్రధానంగా ఒప్పంద కార్మికులు, దినకూలీలు, వలస కార్మికులకు తిరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇనుము, సిమెంటు, ఇతర నిర్మాణ రంగ వస్తువులకు గిరాకీ పెరిగి, తదనుగుణంగా ఉత్పత్తి పెరిగి చాలామందికి ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల గృహ నిర్మాణ, మౌలిక, ఇతర యంత్ర పరికరాల తయారీ రంగాలలో కూడా ఉత్పత్తి పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది.

ఆహార కొరత తీర్చాలి..

ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇలాంటి చర్యలతోపాటు, దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సరైన రహదారులు లేకపోవటం, గిడ్డంగులు, శీతల నిల్వ కేంద్రాల కొరత వల్ల ఆహార ధాన్యాలు ఇతర పంట ఉత్పత్తుల నిల్వ, రవాణా ఖర్చులో రైతులపై అదనంగా 10 శాతం భారం పడుతోంది. ఆహార వస్తువుల ఉత్పత్తి, నిల్వ, రవాణాలో వాటిల్లే నష్టం ఏడాదికి సుమారు రూ.9,200 కోట్లుగా అంచనాలు చెబుతున్నాయి. గ్రామీణ మౌలిక వసతులను పటిష్ఠపరచడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు.

ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధరలు రైతులకు, వినియోగదారులకు లాభదాయకంగా లేవన్నది వాస్తవం. అనేక కారణాల వల్ల రైతులు గత్యంతరం లేక తమ పంటల్ని తక్కువ ధరలకు అమ్మటంతో మధ్యవర్తుల దోపిడి కొనసాగుతూ కొనుగోలుదారులు మాత్రం అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా రైతు కొనుగోలుదారులకు ఆహార ధాన్యాలను విక్రయించాలంటే గ్రామీణ మౌలిక వసతులను, ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం ఎంతో అవసరం. ప్రభుత్వం వివిధ పనులు, నిర్మాణ కార్యక్రమాలను చేపడితే గ్రామీణ కూలీలకు ఉపాధితోపాటు రైతులకు శాశ్వత ప్రాతిపదికన లబ్ధి చేకూరుతుంది.

చిన్న పరిశ్రమలకు ఊతమివ్వాలి...

చిన్న తరహా పరిశ్రమల నుంచి చేసిన కొనుగోళ్లకు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.అయిదు లక్షల కోట్లకుపైగా ఉన్నట్లు అంచనా. ఈ బకాయిలను సత్వరమే చెల్లించే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. చిన్న తరహా పరిశ్రమలు తమ కొనుగోలుదారులకు చేసే క్రెడిట్‌ అమ్మకాలపై వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసి వాటి చెల్లింపులో కొనుగోలుదారులు 45 రోజులకన్నా జాప్యం చేస్తే 46వ రోజు నుంచి వడ్డీని కూడా జమ చేసి బకాయితోపాటు కొనుగోలుదారుల నుంచి బ్యాంకులు వసూలు చేసేలా చట్ట సవరణ చేయాలి.

చిన్న తరహా పరిశ్రమలకు తిరిగి రావాల్సిన బకాయిలపై దృష్టి పెట్టకుండా అదనంగా వారికి బ్యాంకు రుణాలు ఇవ్వడం వల్ల వారి ఆర్థిక సమస్య మరింత జటిలమై మరింత అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు, యాజమాన్యాలు, పారిశ్రామిక సంఘాలు సమష్టిగా కార్మికుల వేతనాల సమస్యను పరిష్కరించాలి. కరోనా లాక్‌డౌన్‌ కాలానికి కార్మికుల జీవనోపాధికి భంగం కలుగకుండా కొంత నగదు రూపంలో, కొంత ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వారిని ఆదుకోవడానికి మానవీయ కోణంలో ఆలోచించాలి.

ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల యాజమాన్యాలు సమష్టిగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. యాజమాన్యాలు, పారిశ్రామిక, కార్మిక సంఘాలు ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అదే విధంగా భవిష్యత్తులో కరోనా వంటి విపత్తులు సంభవిస్తే ఇలాంటి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి కార్మికుల జీతభత్యాల బీమా పథకాన్ని తీసుకొచ్చే దిశగా కృషి చేయాలి.

(రచయిత- డాక్టర్‌ బీఎన్‌వీ పార్థసారథి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.