ETV Bharat / opinion

ఇజ్రాయెల్​-యూఏఈ డీల్​తో ఎవరికి లాభం? - యూఏఈ ఇజ్రాయెల్​ ఒప్పందం

తమ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరినట్టు ఇజ్రాయెల్​-యూఏఈ ప్రకటించాయి. ఈ ఒప్పందానికి అమెరికా సాక్ష్యంగా నిలిచింది. అసలేంటి ఈ ఒప్పందం? దీంతో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? వంటి ప్రశ్నలకు మాజీ రాయబారి(ఐఎఫ్​ఎస్​) జేకే త్రిపాఠి వివరణాత్మక సమాధానాలు...

Israel UAE accord: The deal of the century
ఇజ్రాయెల్​-యూఏఈ ఒప్పందం నిజంగా చారిత్రకమేనా?
author img

By

Published : Aug 18, 2020, 6:53 PM IST

ఇజ్రాయెల్​- యూఏఈ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఈ నెల 13న ప్రకటించారు. అనంతరం.. ఇది 'ఈ శతాబ్దపు ఒప్పందం' అని ఇజ్రాయెల్​- యూఏఈ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. పాలస్తీనా వెస్ట్‌ బ్యాంక్‌లోని వివాదాస్పద ప్రాంతాల ఆక్రమణను ఇజ్రాయెల్‌ నిలిపివేస్తుంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడతాయి. కరోనాపై పోరుకు వ్యాక్సిన్​ అభివృద్ధి చేయడంలో ఇరు దేశాలు పరస్పరం సహాయం చేసుకుంటాయి. ముస్లిం యాత్రికులను జెరుసలేంకు అనుమతిస్తారు. పశ్చిమాసియా అజెండాగా అమెరికా-యూఏఈ వ్యూహాలు రచిస్తాయి.

రానున్న మూడు వారాల్లో.. పర్యటకం, భద్రత, ఏవియేషన్​, విద్యుత్ ​శక్తి, ఆరోగ్యం, పర్యావరణం, సాంకేతికత రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.

వ్యూహాత్మకంగా...

మరోవైపు పాలస్తీనా-ఇజ్రాయెల్​ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు జెరుసలేంలో తమ రాయబార కార్యాలయాన్ని నెలకొల్పమని యూఏఈ తేల్చి చెప్పింది. అయితే వెస్ట్​ బ్యాంక్​పై తన ప్రణాళికలను కేవలం వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేశారు ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు. ఈ పరిణామాలను పరిశీలిస్తుంటే.. దేశీయంగా వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనేందకు ఇజ్రాయెల్​-యూఏఈ ఈ విధంగా ప్రకటనలు చేసినట్టు కనపడుతోంది.

తమ శత్రువు ఇరాన్​ అంశంలో రెండు దశాబ్దాలుగా ఇజ్రాయెల్​కు నిఘా పరంగా యూఏఈ సహకరించడం, గతేడాది నెతన్యాహు ఒమన్​ పర్యటన, విరాళాలు ఇచ్చే దేశాల్లో పాలస్తీనా విషయంపై అసంతృప్తి, ఒక దేశంగా ఇజ్రాయెల్​కు ఉన్న హక్కును సౌదీ యువరాజు సల్మాన్​ గుర్తించడం, సౌదీలోకి ఇజ్రాయెల్​ వ్యాపారులను అనుమతించడం, ఇజ్రాయెల్​ బహిష్కరణపై ముస్లిం దేశాల్లో భిన్నాభిప్రాయాలు... వంటి కారణల వల్ల ఆ దేశంతో సంబంధాలను పెట్టుకునే విషయంలో గల్ఫ్​ దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య కుదిరిన ఒప్పందంపై ఇతర దేశాలు కూడా తమ విదేశాంగ విధానాలకు కట్టుబడి స్పందించాయి. ఈ ఒప్పందంపై సౌదీ ఇంకా స్పందించనే లేదు. ఇతర గల్ఫ్​ దేశాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా స్పందించినట్టు లేదు. అయితే యూఏఈ, అమెరికాతో ఉన్న బలమైన సంబంధాల వల్ల ఈ ఒప్పందాన్ని సౌదీ ఖండించలేకపోవచ్చు. ఖతార్​, బహ్రెయిన్​ ఒప్పందాన్ని స్వాగతించాయి. కానీ నెతన్యాహు తమను మోసం చేశారని మండిపడ్డాయి.

పాలస్తీనాకు మద్దతిచ్చే కువైట్​ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇజ్రాయెల్​తో దౌత్య సంబంధాలున్న ఈజిప్ట్​, జోర్డాన్​ దేశాలు ఒప్పందానికి మద్దతుగా నిలిచాయి. దీని బట్టి ముస్లిం దేశాలు చీలిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

ఈ ఒప్పందాన్ని పాలస్తీనా ఖండించింది. ఇరాన్​ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఒప్పందంపై తీవ్ర విమర్శలు చేస్తూ.. యూఏఈతో తమ సంబంధాలపై పునరాలోచించుకుంటామని హెచ్చరించింది టర్కీ. ఈ ఒప్పందం అగ్నికి ఆజ్యం పో​యడం లాంటిదని ఇండోనేషియా అభిప్రాయపడింది. భారత్​, చైనా స్వాగతించగా.. ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్టు పాకిస్థాన్​ వెల్లడించింది.

దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలు కూడా ఈ చారిత్రక ఒప్పందంపై సానుకూల ప్రకటనలు చేశాయి.

ఎవరికి ఏం దక్కుతుంది?

తమ ప్రోద్బలంతోనే ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య ఒప్పందం కుదిరిందని అమెరికా ఇప్పటికే ప్రపంచానికి తెలిపింది. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన అఫ్గానిస్థాన్​-తాలిబన్ల ఒప్పందంతో పాటు ఈ తాజా ఒప్పందాన్ని అస్త్రాలుగా ఉపయోగించుకుని ట్రంప్​ అధ్యక్ష ఎన్నికలకు వెళ్లవచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఇజ్రాయెల్​ దేశస్థులు మద్దతు ట్రంప్​నకు కచ్చితంగా ఉంటుంది.

పశ్చిమాసియాలో శక్తిగా ఎదగాలనుకుంటున్న యూఏఈ ఆకాంక్షకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. సౌదీ ప్రోద్బలం లేకుండా సొంతంగా విదేశాంగ విధానాలను రచించుకోవచ్చు. దీనికి తొలుత సౌదీ, ఒమన్​ అంగీకరించకపోయినా.. మెల్లిగా దారిలోకి రావాల్సిందే.

చమురు వనరులు వేగంగా క్షీణిస్తున్న తరుణంలో ఆర్థికంగా పురోగతి సాధించాలంటే.. తన వద్ద ఉన్న విస్తృత భూభాగాన్ని ఎలాగైనా సౌదీ వాడుకోవాల్సిందే. ఒమన్​లో పెద్దగా చమురు వనరులు లేనప్పటికీ.. భౌగోళికంగా రెండో అతిపెద్ద దేశం కాబట్టి.. తన భూభాగాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఎడారులను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చగలిగే నేపుణ్యంతో ఈ దేశాలకు ఇజ్రాయెల్​ సహాయం చేయవచ్చు.

వీటితో పాటు శక్తిమంతమైన నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్​ సొంతం. ఇరాన్​ దాడుల నుంచి తాము రక్షిస్తామంటూ గల్ఫ్​ దేశాలకు ఇజ్రాయెల్​ హామీ ఇవ్వచ్చు.

ఈ పూర్తి వ్యవహారంలో నష్టపోయేది పాలస్తీనానే. ఒప్పందం కొనసాగితే.. తమ భూభాగాన్ని ఇజ్రాయెల్​ ఆక్రమించుకోకుండా పాలస్తీనా తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

పొరుగు దేశాలైన ఇరాక్​, గల్ఫ్​ దేశాలు, అఫ్గానిస్థాన్​ నుంచి ఇరాన్​కు ప్రతికూలతలు ఎదురవుతాయి. పాకిస్థాన్​ లాంటి మిత్రదేశం ఉన్నప్పటికీ.. ఇరాన్​కు పెద్ద లాభం ఉండదు.

పాకిస్థాన్​పై పిడుగు...

మతపరంగా, ఆర్థికపరంగా సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. అయితే అణుశక్తి ఉన్న ఏకైక దేశం పాకిస్థాన్​. దీనిని ఉపయోగించుకుని రాజకీయంగా నాయకత్వాన్ని పొందాలని కలలు కంటోంది పాక్​. ముస్లిం దేశాల్లో చీలిక ఏర్పడ్డ ఈ పరిస్థితుల్లో.. ఒప్పందానికి మద్దతు తెలిపితే.. మిత్రపక్షాలైన టర్కీ, మలేషియా, ఇరాన్​ నుంచి విభేదాలు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువ. ఇదే జరిగితే ముస్లిం దేశాలను ఏలాలనుకున్న పాక్​ కల నెరవేరడం అసాధ్యం.

అదే సమయంలో ఒప్పందాన్ని పాకిస్థాన్​ వ్యతిరేకిస్తే.. యూఏఈ, సౌదీలతో ఇప్పటికే బలహీనపడ్డ బంధం.. పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాక్​కు ఆర్థిక సహాయం, చమురు సరఫరాను నిలిపివేసింది సౌదీ.

వీటన్నిటితో పాటు.. సౌదీ, యూఏఈలోనే అత్యధిక మంది పాకిస్థానీలు నివాసముంటున్నారు. పాక్​లో ఇప్పటికే క్షీణించిన విదేశీ మారక నిల్వలు వీరి వల్లే ఓ మోస్తరు స్థితిలో ఉంది. ఇదే జరిగితే పాక్​ దివాలా తీస్తుంది. ఒప్పందానికి మద్దతు ఇవ్వడం వల్ల మిత్రపక్షమైన చైనా కూడా పాక్​కు ఈసారి ఏ విధంగానూ సహాయం చేయలేకపోవచ్చు.

గల్ఫ్​ దేశాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతోంది చైనా. ఈ క్రమంలో తమ ఆర్థిక విధానాలపై అప్రమత్తంగా ఉంటుంది.

ఇక భారత్​ విషయానికొస్తే.. మనం సంతోషంగా ఉండాలి. ఇజ్రాయెల్​తో సమానంగా వారిని కూడా చూస్తున్నట్టు అరబ్​ దేశాలను ఇక ఒప్పించాల్సిన పని లేదు. ఇజ్రాయెల్​తో ఇప్పటికే అద్భుతమైన బంధం ఉంది. సౌదీ, యూఏఈతోనూ సాన్నిహిత్యం పెరుగుతోంది. ఈ పరిణామాలు భారత్​కు కలిసొస్తాయి. అదే సమయంలో పాలస్తీనాకు నైతికంగా, రాజకీయంగా ఇస్తున్న మద్దతును కొనసాగించవచ్చు.

--- జేకే త్రిపాఠి, మాజీ రాయబారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.