ETV Bharat / opinion

బడికి ప్రమాణాల దడి- సంస్కరణలేవీ? - విద్యార్థులు

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 24:1గా ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. కరోనాకు ముందు పూర్తి పని దినాలతో కొనసాగినప్పుడే పాఠశాలల్లో విద్యాప్రమాణాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కొరవడ్డాయని పలు నివేదికల్లో వెల్లడైంది. 'ప్రథమ్‌' సంస్థ రూపొందించిన 'అసర్‌' నివేదిక ప్రకారం- అయిదో తరగతి విద్యార్థులు మూడు అంకెల కూడికలు, తీసివేతలు చేయలేకపోతున్నారు.

education
విద్యార్థులు
author img

By

Published : Apr 6, 2021, 8:26 AM IST

ఒక దేశం సుస్థిరంగా సుసంపన్నంగా అవతరించాలంటే నాణ్యమైన మానవ వనరులు, విలువలతో కూడిన విద్యార్థులు అవసరం. విద్యపై పెట్టుబడి- దీర్ఘకాలంలో వ్యూహాత్మక వృద్ధిని సాధించే ఆయుధం. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా ఈ రంగంలో మార్పులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో మౌలిక సౌకర్యాల కల్పన, ప్రాథమిక విద్యపై ప్రభావం వంటి అంశాల్ని చర్చించాల్సిన అవసరం ఉంది.

సరైన పర్యవేక్షణ కరవు

భారత్‌లో విద్యపై జీడీపీలో 3.8 శాతంగా చేస్తున్న ఖర్చు- స్కాండినేవియన్‌ దేశాలతో పోలిస్తే చాలా తక్కువని పలు నివేదికలు చెబుతున్నాయి. క్షేత్ర స్థాయిలో మౌలిక సౌకర్యాలైన మూత్రశాలలు, ఆట స్థలాలు, క్రీడా పరికరాలు, పారిశుద్ధ్యం, ప్రథమ చికిత్స సామగ్రి, శుభ్రమైన తాగునీరు, వంట గదులు, మధ్యాహ్న భోజనంలో నాణ్యత, విద్యుత్తు సరఫరా, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు వంటివి అందుబాటులో లేకపోవడం విద్యా నాణ్యతకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. మౌలిక సౌకర్యాల కల్పన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా- సరైన పర్యవేక్షణ, నిర్వహణ కొరవడటంవల్ల ఆశించిన ఫలితాలు దక్కడం లేదు.

'విద్యాప్రమాణాలు అంతంతమాత్రమే'

'యునెస్కో' నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2030 సంవత్సరం నాటికి సుమారు 6.90 కోట్ల ఉపాధ్యాయుల అవసరం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నాణ్యమైన విద్యాబోధకుల కొరత ప్రపంచంలోని ఎన్నో దేశాల్ని వేధిస్తున్న సమస్య. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 24:1గా ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. కరోనాకు ముందు పూర్తి పని దినాలతో కొనసాగినప్పుడే పాఠశాలల్లో విద్యాప్రమాణాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కొరవడ్డాయని పలు నివేదికల్లో వెల్లడైంది. 'ప్రథమ్‌' సంస్థ రూపొందించిన 'అసర్‌' నివేదిక ప్రకారం- అయిదో తరగతి విద్యార్థులు మూడు అంకెల కూడికలు, తీసివేతలు చేయలేకపోతున్నారు. ఆరో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు సైతం చిన్న పేరాలోని అంశాలను అర్థం చేసుకొని వివరించలేకపోతున్నారు. ఎనిమిదో తరగతి స్థాయి లెక్కలు చేయగలిగేవారు 2016లో 51.4శాతం ఉంటే, 2018లో 43శాతానికి పడిపోయినట్లు వెల్లడైంది. ఇదంతా విద్యా ప్రమాణాల క్షీణతకు నిదర్శనంగా నిలుస్తోంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా విద్యావ్యవస్థను కరోనా మహమ్మారి మరింత సంక్షోభంలోకి నెట్టింది. ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు కనీస అవసరాలైన అంతర్జాలం, స్మార్ట్‌ ఫోన్‌ తదితర ఉపకరణాలు లేకపోవడమూ సమస్యగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది పెద్ద సమస్యగా పరిణమించింది.

ప్రాథమిక అవసరాలు మెరుగుపరచాలి

విద్యపై ప్రస్తుతం చేస్తున్న ఖర్చును జీడీపీలో మూడు నుంచి ఆరు శాతానికి పెంచడంతోపాటు- ప్రాథమిక అవసరాలను మెరుగుపరచడంపై ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాలి. పరిశ్రమలకు విద్యాభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించి, నైపుణ్యంగల విద్యార్థులను తీర్చిదిద్దే విధానాన్ని రూపొందించాలి. ఉపాధ్యాయులు సైతం అంకిత భావంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకొని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరివర్తనలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక స్థాయిలోనే కంప్యూటర్‌ అక్షరాస్యతకు పునాది పడేలా చర్యలు చేపట్టాలి.
ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ పౌరులకు నాణ్యమైన విద్యను అందించాలి. విద్యార్థి స్థాయి నుంచే నైపుణ్యాలను పెంపొందించే పాఠ్యప్రణాళికను రూపొందించాలి. సంప్రదాయ చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాలకు ఆధునిక అవసరాలకు తగిన సాంకేతికతను జోడించాలి. దేశ సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్పులు చేపట్టాలి. ప్రాథమిక దశ నుంచే విద్యార్థుల శ్రద్ధాసక్తులను గమనించి ఆ వైపు ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలి.

మాతృభాషలో బోధన

విద్యార్థుల సృజనాత్మకతను గుర్తించాలి. ఆయా రంగాల్లో నూతన ఆవిష్కరణలు సాధించేలా ప్రభుత్వం వారిని ప్రోత్సహించాలి. విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి నవీన ఆవిష్కరణలవైపు వారిని నడిపించాలి. మాతృభాషలో బోధన కొనసాగిస్తూ అవకాశాలు కలిగిన అన్యభాషలనూ నేర్చుకొని ఉద్యోగ కల్పన పెంపుపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలి. పాఠ్యప్రణాళికను ఉన్నతీకరించడంలో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తూ సంస్కరణలు చేపట్టాలి. విద్యార్థులు, అధ్యాపకులకు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు అందించడం ద్వారా ఆన్‌లైన్‌ విద్యకు అండగా నిలవాలి. డిజిటల్‌ అంతరాలు నెలకొనకుండా చూడాలి. ఆన్‌లైన్‌ విద్యా వేదికలపై అవగాహన కల్పించాలి. దేశ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ, శాస్త్ర సాంకేతికతను ప్రోత్సహించి, నైతిక విద్యకు ప్రాధాన్యం కొనసాగిస్తూ.. నూతన విద్యావిధానాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే- భారత్‌ తేరుకుంటుంది!

- డాక్టర్‌ ఎం.బుచ్చయ్య (రచయిత- వాణిజ్య శాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులు)

ఇదీ చదవండి: నేడు భాజపా ఆవిర్భావ దినోత్సవం- మోదీ ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.