ETV Bharat / opinion

గల్వాన్ ఘటనకు ఏడాది.. పరిస్థితి మారిందా?

గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య భీకర పోరు జరిగి ఏడాది కావొస్తోంది. సరిహద్దులో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. అనేక విడతలుగా సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నా.. సమస్య పరిష్కారం కాలేదు. ఈ సంవత్సర కాలంగా జరిగిందేంటి? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి?

India-China ties still at crossroads even after a year of Galwan valley clash
గల్వాన్ ఘటనకు ఏడాది.. పరిస్థితి మారిందా?
author img

By

Published : Jun 13, 2021, 5:51 AM IST

2020 జూన్ 15... ప్రశాంతంగా ఉండే హిమగిరుల్లో రక్తపాతం జరిగిన రోజు. విస్తరణ కాంక్షతో మదమెక్కిన డ్రాగన్ బరితెగింపునకు దిగిన రోజు. పాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనికులతో భారత జవాన్లు వీరోచితంగా పోరాడిన రోజు. భారత సైన్యంలో 20 మంది కొదమ సింహాలు అసువులు బాసిన రోజు.

భారత్-చైనా సైన్యాల మధ్య అత్యంత భీకరమైన పోరాటం జరిగి దాదాపు ఏడాది కావొస్తోంది. సరిగ్గా సంవత్సరం క్రితం తూర్పు లద్దాఖ్​లోని పాంగాంగ్ సో సరస్సు ఇరుదేశాల సైన్యం మధ్య రక్తపాతం చోటు చేసుకుంది. అతిపెద్ద ఈ సైనిక ఘర్షణతో ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి అనేక విడతలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ.. పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో జూన్ 15న ఏం జరిగింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? ప్రస్తుతం పరిస్థితులెలా ఉన్నాయని ఒక్కసారి పరిశీలిస్తే..

గల్వాన్ ఘటనకు కారణం?

గల్వాన్ ఘటనకు ముందే భారత్ చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన మొదలైంది. వాస్తవాధీన రేఖ విషయంలో మే 5న ఈ వివాదం మొదలైంది. క్రమంగా పాంగాంగ్ సరస్సు వద్ద చైనా తన పట్టును పెంచుకుంటూ వచ్చింది. సైన్యాన్ని అధికంగా మోహరించింది. పాంగాంగ్ సరస్సు చుట్టూ 100 గుడారాలను నిర్మించింది.

ఇదీ చదవండి: భారత సైనికుల దెబ్బకు పరిగెత్తిన చైనా జవాన్లు!

ఈ నేపథ్యంలో చైనా నిర్మించిన గుడారాలను తీసేందుకు కర్నల్ బీఎస్ సంతోష్ బాబు నేతృత్వంలోని బిహార్ రెజిమెంట్ గల్వాన్ లోయలోని చైనా స్థావరం వైపు వెళ్లింది. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య భౌతిక ఘర్షణ జరిగింది. ఇనుప రాడ్లు, మేకులు దించిన చువ్వలతో చైనా సైనికులు కర్నల్ సంతోష్ బాబు బృందంపై దాడి చేశారు. అయితే, వీరిని సంతోష్ బాబు బృందం దీటుగా ఎదుర్కొంది. ఈ ఘటనలో సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు సుమారు 45 మంది చనిపోయినట్లు అంచనా. అయితే ఆ దేశం మాత్రం మృతుల సంఖ్యపై బుకాయిస్తూ వస్తోంది.

ఇదీ చదవండి: ఈ ఇనుప చువ్వలతోనే చైనా సైనికుల దాడి?

సైనిక చర్చలు

గల్వాన్ ఘటన జరిగిన తర్వాత భారత సైన్యం.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మధ్య 11 విడతల చర్చలు జరిగాయి. 2020 జూన్ 6న కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య తొలి సమావేశం జరిగింది. పాంగాంగ్ సో సరస్సుతో పాటు, గోగ్రా, హాట్​స్ప్రింగ్, దెమ్​చోక్ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చర్చలు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన సమావేశాలన్నీ మిశ్రమ ఫలితాలే అందించాయి. పాంగాంగ్ సెక్టార్​లో సైనికులను వెనక్కి తీసుకోవాలని ఇరువర్గాలు నిర్ణయించుకోవడం కొంత సానుకూల విషయం అయితే, మిగిలిన ప్రాంతాల్లో ఇలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే పాంగాంగ్​ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ సైతం పేపర్​పైనే ఉందని, చైనా ఈ ఒప్పందాన్ని అమలు చేయడం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: గల్వాన్​ లోయలో ఆ రోజు అసలేం జరిగింది?

1959 నాటి వాదన

ఈ వివాదం నేపథ్యంలో వాస్తవాధీన రేఖపై 1959 నాటి వాదనను అందుకుంది చైనా. 1959లో భారత ప్రధాని జవహర్​లాల్ నెహ్రూకు చైనా ప్రధాని చౌ ఎన్​లై రాసిన లేఖలో తొలిసారి ఈ రేఖ గురించి ప్రస్తావనకు వచ్చింది. 1914 సిమ్లా ఒప్పందంలోని మెక్​మోహన్​ రేఖను తనకు అనుకూలంగా మార్చి ప్రకటించిందే ఈ 1959 రేఖ. మెక్​మోహన్ రేఖ భారత్, టిబెట్​ను వేరు చేస్తుంది. అయితే సిమ్లా ఒప్పందం జరిగిన 1914 జులై 3 నాటి నుంచి 1959 జనవరి వరకు మెక్​మోహన్​ రేఖకు చైనా అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం. నెహ్రూకు రాసిన ఆ లేఖలో.. "తూర్పు భాగంలో మెక్​మోహన్​ రేఖ.. పశ్చిమాన ఇరు దేశాల అధీనంలో ఉన్న ప్రాంతం నుంచి సైనికులు 20 కిలోమీటర్లు వెనక్కు వెళ్లాలి" అని ఎన్​లై ప్రతిపాదించారు.

కైలాశ్ పర్వతం చేజిక్కించుకోవడం

గల్వాన్​లో భీకర ఘర్షణ చోటు చేసుకోవడం వల్ల కీలకమైన ప్రాంతాలు చేజిక్కించుకోవడంపై చైనా సైన్యం ప్రణాళికలు రచించింది. కైలాశ్ పర్వత శ్రేణిలోని ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చైనా స్టడీ గ్రూప్ నిర్ణయించుకుంది. ఆగస్టు 29న తుది నిర్ణయం తీసుకొని ప్రణాళికను అమలు చేయాలని యత్నించింది.

అయితే అప్రమత్తమైన భారత సైన్యం.. ఆగస్టు 29 అర్ధరాత్రి కైలాశ్ రేంజ్​లోని కీలక ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకుంది. ఘర్షణ జరిగిన తర్వాత తొలిసారి చైనాను వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టింది. ఈ పరిణామంతో భారత్ పైచేయి సాధించింది. ఈ దెబ్బతో చైనా దిగొచ్చింది. బలగాల ఉపసంహరణకు అంగీకారం తెలిపింది. పాంగాంగ్ సరస్సు తీరంలోని బలగాలను వెనక్కి పిలిచింది.

ఇవీ చదవండి:

ఇంకా ప్రతిష్టంభనే..

అయితే పరిస్థితులు ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నాయి. భారత్, చైనా సంబంధాలు కీలక మలుపు వద్ద ఉన్నాయని, ఇవి ఎటువైపు వెళ్తాయనే చైనాపై ఆధారపడి ఉంటుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. సరిహద్దులో శాంతి భద్రతలకు డ్రాగన్ కట్టుబడి ఉండటం, ఒప్పందాలను సక్రమంగా అమలు చేయడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. వాస్తవాధీన రేఖ వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని అన్నారు.

మరోవైపు, ఇరుదేశాల సంబంధాల క్షీణతకు కారణం భారతదేశమేనని చైనా ఆరోపిస్తోంది. సరిహద్దు సమస్యను, ద్వైపాక్షిక సంబంధాలను ఒకే విధంగా చూడొద్దని చెబుతోంది.

ప్రస్తుతం సరిహద్దులోని తన శిక్షణా శిబిరాల్లో సైనిక డ్రిల్స్ నిర్వహిస్తోంది చైనా. బలగాల ఉపసంహరణపై సానుకూల స్పందన ఉన్నా.. ఇది పూర్తిగా సాకారం కావాలంటే చాలా సమయం పడుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: 'గల్వాన్​' మృతులపై తొలిసారి చైనా ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.