ETV Bharat / opinion

భారత్​ పకడ్బందీ వ్యూహం.. 'వజ్రాలహారం'తో డ్రాగన్‌కు కళ్లెం - indian strategy to counter china

పురాణాల్లోని యుద్ధాల్లో ఒకరు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే, వైరి పక్షం వరుణాస్త్రం ప్రయోగించేది. సరిగ్గా ఇదే రీతిలో నక్కజిత్తుల చైనాకు దీటుగా భారత్‌ వ్యూహాలు పన్నుతోంది. ఇన్నాళ్లూ తనకు ఎదురులేదని విర్రవీగుతున్న బీజింగ్‌కు ఇది మింగుడుపడటం లేదు.

india can able to give counter for china by coordinating with other countries
‘వజ్రాలహారం' వ్యూహంతో డ్రాగన్‌కు కళ్లెం వేయనున్న భారత్​
author img

By

Published : Nov 3, 2020, 6:33 AM IST

ఇండియా చుట్టూ ముత్యాలసరం పేరుతో సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తున్న చైనాకు భారత్‌ వజ్రాలహారం వ్యూహంతో దిమ్మతిరుగుతోంది. ఆర్థికబలం, సైనికశక్తి, అశేష మానవవనరులు కలిగిన బీజింగ్‌- భారత్‌ చుట్టూ ఉన్న అనేక దేశాలకు ఉదారంగా రుణాలు ఇస్తున్నట్టే ఇచ్చి, అనంతరం రికవరీ పేరుతో ఆ దేశాల్లోని కీలక ప్రాంతాలను వశం చేసుకోవడం తెలిసిందే. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్‌టొట నౌకాశ్రయాన్ని ఇదే రీతిలో స్వాధీనం చేసుకుంది. పాక్‌లోని గ్వదర్‌ నౌకాశ్రయం కూడా చైనా అధీనంలో ఉంది. హంబన్‌టొట, మరావో(మాల్దీవులు)లలో ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్లు చైనా పేర్కొంది.

కాలు దువ్వితే గర్వభంగమే!

ఆసియాలో తనకు అన్ని విధాలుగా సవాలు విసరుతున్న ఇండియాకు ముందస్తుగానే బంధనాలు వేసేందుకు డ్రాగన్‌ కుటిల వ్యూహాలు పన్నుతోంది అనేందుకు ముత్యాలసరం అనేది ఒక ఉదాహరణ. నిజానికి హిందూ మహాసముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదు. అంతర్జాతీయ సముద్ర వాణిజ్య చట్టాలననుసరించి ఈ సముద్రంలో వాణిజ్యానికి మాత్రమే సౌలభ్యముంది. చైనా ఇంధన అవసరాలు మధ్యప్రాచ్యంతో ముడివడివున్నాయి. దీంతో పాటు ఆఫ్రికాతో పెరుగుతున్న వాణిజ్యాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేకించి ముందు జాగ్రత్తగా మన దేశం చుట్టూ పద్మవ్యూహం పన్నుతోంది. ఇండియాపై బీజింగ్‌ దుందుడుకుగా వ్యవహరిస్తే కొత్త వ్యూహంతో ఆ దేశాన్ని చక్రబంధంలో ఇరికించేందుకు భారత్‌ సిద్దంగా ఉంది. ఇప్పటికే గల్వాన్‌, లద్దాఖ్‌ ప్రాంతాల్లో దుస్సాహసానికి దిగిన చైనా తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్న వైనం తెలిసిందే. భారత్‌లో చైనా యాప్‌ల నిషేధంతో ఆ దేశానికి చెందిన పలు ఐటీ కంపెనీల విలువ భారీగా తగ్గిపోయింది. విస్తరణవాదం పేరుతో హిందూ మహాసముద్రంలోనూ కాలుదువ్వితే మరింత గర్వభంగం తప్పదని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా స్థావరాలకు సమీపంలోనే భారత్‌ కూడా వివిధ దేశాలకు చెందిన నౌకాశ్రయాల్లో ఇంధనం నింపుకొనేందుకు, యుద్ధ నౌకలకు మరమ్మతులు చేసుకొనేందుకు, లంగరు వేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. 2018లో సింగపూర్‌కు చెందిన ఛాంగి నౌకాదళ స్థావరాన్ని భారత యుద్ధనౌకలు వినియోగించుకునేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల దక్షిణ చైనా సముద్రంపై నిఘాతో పాటు మలక్కా జలసంధిపై ఒక కన్నేసి ఉంచవచ్చు. మన దేశానికి చెందిన నికోబార్‌ దీవుల సమీపంలో ఉండే మలక్కా జలసంధి హిందూ-పసిఫిక్‌ మహాసముద్రాలను కలుపుతుంది. దీని ద్వారానే ఆగ్నేయాసియా, చైనా, జపాన్‌లకు మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరా జరుగుతోంది. ఈ జలసంధిలో ఎలాంటి అలజడి ఏర్పడినా చైనాకు ఇబ్బందులు తప్పవు. ఇండొనేసియాలోని సబాంగ్‌ ఓడరేవును మన నౌకాదళం వినియోగించుకునేందుకు వీలుగా ఒప్పందం కుదిరింది. చైనాతో తీవ్ర ఘర్షణలు ఉత్పన్నమైతే మలక్కా జలసంధిలోని రెండు కీలకమైన నౌకాశ్రయాలు సబాంగ్‌, ఛాంగిలతో మనం పైచేయి సాధించే అవకాశముంది. ఇక చిట్టగాంగ్‌కు సమాధానంగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని స్థావరాలతో పాటు విశాఖ నౌకదళ కేంద్రం ఉంది.

చక్ర బంధనంతో ఉక్కిరి బిక్కిరి

పాక్‌లోని గ్వదర్‌ నౌకాశ్రయానికి కొద్దిదూరంలో ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవును భారత్‌ అభివృద్ధి చేస్తోంది. ఇక్కడి నుంచి అఫ్గాన్‌ వరకు భారత్‌ రైలు మార్గాన్ని నిర్మించేందుకు అంగీకారం కుదిరింది. అత్యవసర సమయాల్లో గ్వదర్‌ నుంచి పాక్‌, చైనాలు దాడికి దిగితే ఇక్కడి నుంచి అడ్డుకోవచ్చు. ఆఫ్రికా కొమ్ముగా పిలిచే జిబౌటిలో చైనా ఏకంగా ఒక సైనిక స్థావరాన్ని నెలకొల్పింది. బాబ్‌ఎల్‌మందెబ్‌ జలసంధి నుంచే ఎర్రసముద్రానికి నౌకల సంచారం ఉంటుంది. ఎర్రసముద్రం నుంచి మధ్యధరా సముద్రం మధ్య ఉన్న సూయజ్‌ కాలువ మార్గం కీలకం కావడంతో బీజింగ్‌ అక్కడ స్థావరాన్ని నెలకొల్పింది. ఇందుకు సమాధానంగా ఒమన్‌లోని అల్‌దఖమ్‌ నౌకాశ్రయాన్ని వినియోగించుకునేందుకు ఒమన్‌ ప్రభుత్వంతో భారత్‌కు ఒప్పందం కుదిరింది. కీలకమైన మధ్య ఆసియాలోని అయిదు దేశాలతోనూ భారత్‌ వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయి. వీటిలో కజికిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజికిస్థాన్‌లకు చైనాతో సరిహద్దులున్నాయి. ఇండియాను చైనా చక్రబంధంలో ఇరికిస్తున్న తీరుకు భిన్నంగా మరింత వ్యూహాత్మకంగా‘వజ్రాలహారం’ వ్యూహం ఉండటంతో డ్రాగన్‌కు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. డ్రాగన్‌ బుసలకు దీటుగా భారత్‌ రూపొందిస్తున్న వజ్రాలహారానికి వ్యూహాత్మకంగా మరింతగా పదును పెట్టాల్సి ఉంది. క్వాడ్‌ దేశాల భేటీకి కొద్దిరోజుల ముందే మంగోలియా-జపాన్‌లు స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌కు సహకరించుకునేలా ఒప్పందం జరగడం శుభపరిణామం. దక్షిణ చైనా సముద్రంలోని డ్రాగన్‌ ఆర్థిక, ఆయుధ బలాన్ని ఎదుర్కోవాలంటే బలమైన భాగస్వామ్యాలు తప్పనిసరి. అందుకే భావసారూప్యత ఉన్న దేశాలతో కలిసి ‘వజ్ర’సంకల్పాన్ని తీసుకొని, డ్రాగన్‌కు కళ్లెం వేయాలి.

ఇదీ చూడండి: భాగస్వామ్యాలతో భారత్​ దూకుడు- చక్రబంధంలో చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.