ETV Bharat / opinion

'భారత్​-బంగ్లాదేశ్' బాంధవ్యం ఉభయతారకం - యాక్ట్ ఈస్ట్ పాలసీ

ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద సరిహద్దుగల దేశంగానే కాదు- ఇండియాతో బంగ్లాదేశ్​కు గల చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధం అపురూపమైనది. ఈ నేపథ్యంలో 'యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ'ని చేపట్టిన ప్రధాని మోదీ- బంగ్లాదేశ్‌తో సంబంధాల్ని కొత్త పుంతలు తొక్కించే దిశలో మైలురాయి కాగల ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు.

India-Bangladesh ties have hit the right stride
'భారత్​-బంగ్లాదేశ్' ఉభయతారక బాంధవ్యం
author img

By

Published : Mar 29, 2021, 7:45 AM IST

'మా ప్రజల కోసం భారత సైనికులు ప్రాణాలు అర్పించారు.. ఈ రక్త త్యాగాలను మావాళ్లెప్పటికీ గుర్తుంచుకొంటారు'- బంగ్లాదేశ్‌ ఆవిర్భావం సందర్భంగా షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ వ్యక్తీకరించిన కృతజ్ఞతా భావమది. బంగబంధు శతజయంతితో జతపడి బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలూ జరుగుతున్న వేళ- బంగ్లా జాతిపితకు మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని అందిస్తూ ప్రధాని మోదీ జరిపిన రెండు రోజుల ఢాకా పర్యటన చరిత్రాత్మకమైనది.

కొత్త చరిత్ర!

ఒక జాతి కట్టుబాటును మతంకన్నా భాషే ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్న సత్యాన్ని కళ్లకు కట్టిన బంగ్లా విముక్తి పోరాటం- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికే ప్రేరణ అయ్యింది. పాక్‌ ఉక్కు పిడికిలి నుంచి విడివడిన తొలినాళ్లలో అమెరికా విదేశాంగమంత్రి హెన్రీ కిసింజర్‌లాంటి వాళ్లు 'అడుగు ఊడిన బుట్ట'గా బంగ్లాదేశ్‌ను తృణీకరించినా, ఇస్లామాబాద్‌ను ఏనాడో తలదన్ని అభివృద్ధి సూచీలన్నింటా అద్భుతంగా రాణిస్తున్న ఢాకాకు నిజంగా స్వర్ణోత్సవమే ఇది! ఇందిర, ముజిబుర్‌ రహ్మాన్‌ చేవ్రాలు చేసిన ఇండో-బంగ్లా బాంధవ్య ప్రకటన బంగబంధు దుర్మరణానంతరం (1975) తీవ్రంగా ఒడుదొడుకుల పాలైంది.

నదీజలాలు, శరణార్థుల సమస్యలు, పొలిమేర పేచీలు, సరిహద్దుల్లో విచ్ఛిన్నకర కార్యకలాపాలు, బంగ్లా గడ్డపై భారత్‌ వ్యతిరేక శక్తుల గుడారాలు, ఢాకా కడగండ్లకు ఇండియాయే కారణమన్న దుష్ప్రచార రాజకీయాలు- ఇరు దేశాలు ఎంత చేరువో అంత దూరమన్న వాతావరణాన్ని సృష్టించాయి. సైనిక పాలన విరగడై ప్రజాస్వామ్యం బలంగా పాదుకొన్న దరిమిలా అపోహల తెలిమంచు క్రమంగా కరిగి- 2015లో భూ సరిహద్దు వివాదం శాశ్వతంగా పరిష్కారమైంది. పదేళ్లనాటి తీస్తా నదీ జలాల ఒప్పందమూ ఉభయతారకంగా పట్టాలకెక్కితే- ప్రగతి పథంలో ఉమ్మడి భాగస్వామ్యం ఉపఖండంలో కొత్త చరిత్ర లిఖిస్తుంది!

ఎంతో కీలకం..

ఎనభయ్యో దశకంనుంచి వృద్ధి రేట్లకు కొత్త రెక్కలు తొడుగుతున్న బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయాల్లోనూ ఇండియాతో పోటీపడే స్థితికి చేరింది. నాలుగు దశాబ్దాలక్రితం జీడీపీలో 33.2శాతంగా ఉన్న వ్యవసాయ రంగం వాటాను 14.2శాతానికి కుదించి, తయారీ రంగం సహా పరిశ్రమల వాటాను 17శాతం నుంచి 33.6 శాతానికి పెంచడంలో బంగ్లా సాధించిన విజయం అబ్బురపరుస్తుంది. కాబట్టే ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రగతి విధాన కమిటీ బంగ్లాదేశ్‌ను అభివృద్ధిలో అట్టడుగున ఉన్న దేశాల జాబితానుంచి తొలగించి వర్ధమాన దేశంగా గుర్తించాలని నెలరోజుల నాడు సూచించింది. అదే జరిగితే సుంకాలు, ఎగుమతి కోటాల బాదరబందీ లేకుండా సంపన్న దేశాలతో వర్తకం జరిపే వెసులుబాటును బంగ్లాదేశ్‌ కోల్పోతుంది.

ఎకాయెకి 97శాతం ఉత్పాదనల్ని ఎలాంటి సుంకాలు లేకుండా బంగ్లాదేశ్‌ తమ దేశానికి ఎగుమతి చేయగల వీలు కల్పించిన చైనా- అలా అదనంగా 140కోట్ల డాలర్ల మొత్తాన్ని ఢాకా ఆర్జించగలదని భరోసా ఇచ్చింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ ద్వారా ఇండియా చుట్టుపక్కల దేశాలన్నింటినీ తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకొనేలా ఉచ్చుబిగిస్తున్న బీజింగ్‌ బంగ్లాదేశ్‌పైనా కన్నేసింది. 'లుక్‌ ఈస్ట్‌ పాలసీ'కి మరిన్ని మెరుగులద్ది 'యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ'ని చేపట్టిన ప్రధాని మోదీ- బంగ్లాదేశ్‌తో సంబంధాల్ని కొత్త పుంతలు తొక్కించే దిశలో మైలురాయి కాగల ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. విదేశాలకు టీకాలందించడంలో బంగ్లాకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన ఇండియా- ఢాకాతో చెలిమి కొత్త చివుళ్లు తొడిగిన కొద్దీ మయన్మార్‌, థాయ్‌లాండ్‌, కాంబోడియా, లావోస్‌, వియత్నాంలతో ఆర్థిక బాంధవ్యానికి రాచబాటలు పడతాయన్న వాస్తవాన్ని విస్మరించలేదు. ప్రపంచంలోనే శీఘ్రగతిన అభివృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా రాణిస్తున్న బంగ్లాదేశ్‌తో అనుబంధాన్ని మరింతగా ముడివేయడం- భారత భాగ్యోదయానికీ ఎంతో కీలకం!

ఇదీ చదవండి:'భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.