ETV Bharat / opinion

India Alliance in Madhya Pradesh : ఇండియా కూటమి ఉన్నట్టా లేనట్టా? దిల్లీలో దోస్తీ.. అసెంబ్లీ ఎన్నికల్లో కుస్తీ! - ఇండియా కూటమి సమాజ్​వాదీ కాంగ్రెస్

India Alliance in Madhya Pradesh : 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఇండియా కూటమి పేరుతో జట్టు కట్టిన కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తమలో తాము కత్తులు దూసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్​లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోరు ఉండగా.. 90కి పైగా స్థానాల్లో సమాజ్​వాదీ, ఆప్ వంటి పార్టీలు పోటీ చేస్తుండటం హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది.

India Alliance in Madhya Pradesh
India Alliance in Madhya Pradesh
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 4:15 PM IST

India Alliance in Madhya Pradesh : 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విపక్షాలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం ఎవరి దారి వారిదే అన్న రీతిలో సాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ద్విముఖ పోరు నెలకొన్న మధ్యప్రదేశ్‌లో ఎస్​పీ, ఆమ్ఆద్మీ, జేడీయూ నుంచి 90కిపైగా స్థానాల్లో అభ్యర్థులు బరిలో ఉండటం.. కాంగ్రెస్‌ గెలుపు ఆశలపై నీళ్లు చల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

India Alliance in Assembly Elections : రసవత్తరంగా సాగుతున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోరులో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారైనా గెలిచి అధికారాన్ని తిరిగి అందుకోవాలన్న కాంగ్రెస్‌ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా సాధారణ మెజార్టీకి 116 స్థానాలు అవసరం. ఆ రాష్ట్రంలో ఇండియా కూటమిలోని మిత్రపక్షాల నుంచి 92 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. సమాజ్‌వాదీ(ఎస్​పీ), ఆమ్‌ఆద్మీ, జేడీయూ పార్టీలు మొత్తంగా 92 చోట్ల పోటీ చేస్తుండగా.. వీటిలో కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన, ఓడిన సీట్లు అనేకం ఉన్నాయి.

Samajwadi Vs Congress in Madhya Pradesh : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ఒక చోట నెగ్గిన సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. మిత్రపక్షం జీజీపీతో కలిసి 1.3 శాతం ఓట్లు సాధించింది. ఈసారి కాంగ్రెస్‌ తమకు కనీసం 6 స్థానాలు కేటాయిస్తుందని ఎస్​పీ ఆశించింది. అందుకు కాంగ్రెస్‌ నిరాకరించడం వల్ల సమాజ్‌వాదీ పార్టీ ఒంటరి పోరుకు దిగింది. 46 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించింది. సమాజ్‌వాదీ ప్రస్తుతం బరిలో ఉన్న స్థానాల్లో 19 సీట్లు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుచుకున్నవే. ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌తో తాము ఇలానే వ్యవహరిస్తామని ఇప్పటికే సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తేల్చి చెప్పారు.

ఆప్ సైతం..
మరోవైపు, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా ఖాతా తెరవాలని ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా కృతనిశ్చయంతో ఉంది. దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఆప్‌ 208 నియోజకవర్గాల్లో పోటీ చేయగా అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయారు. మొత్తంగా ఆ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 0.66 శాతం ఓట్లు వచ్చాయి. అయితే వింధ్య ప్రాంతంలోని సింగ్రౌలీ మేయర్‌ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ ఆప్‌ అధ్యక్షురాలు రాణి అగ్రవాల్‌ విజయం సాధించారు. తద్వారా బీజేపీ ఆధిపత్యానికి గట్టి సవాల్‌ విసిరారు. ఆ విజయం ఆమ్‌ఆద్మీ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున దిల్లీ, పంజాబ్‌ సీఎంలు మధ్యప్రదేశ్‌లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో పోటీ చేయని జేడీయూ కూడా మధ్యప్రదేశ్‌లో ఈసారి 10 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది.

కాంగ్రెస్​కే నష్టం!
మిత్రపక్షాలు బరిలో ఉన్న 92 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 15 చోట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కగా.. ఆరు చోట్ల స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమిపాలైంది. ఛతర్‌పుర్‌ జిల్లాలోని రాజ్‌నగర్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 732 ఓట్ల తేడాతో నెగ్గగా ఇప్పుడు అక్కడ సమాజ్‌వాదీ, ఆప్‌, జేడీయూ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. జబల్‌పుర్‌ నార్త్‌, సింగరౌళి వంటి చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే కాంగ్రెస్‌కు ఎదురవుతోంది. మిత్రపక్షాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ నుంచే కాంగ్రెస్‌కు ఎక్కువగా ముప్పు ఉంది. ఆయా చోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మంచిది కాదని ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇండియా కూటమి బలంగా లేకపోవడం దురదృష్టకరం. కూటమిలో అంతర్గత సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న 4-5 రాష్ట్రాల్లో ఇలా ఉండాల్సింది కాదు. సమాజ్​వాదీ, కాంగ్రెస్ యూపీలోనూ అన్ని సీట్లలో పోటీ చేస్తామని చెబుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఇలాంటి పోరు కూటమికి మంచిది కాదు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక.. మేమంతా మళ్లీ కూర్చుని కలిసి పనిచేస్తాం."
-ఒమర్ అబ్దుల్లా, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, ఎన్​సీ ఉపాధ్యక్షుడు

  • #WATCH | Kupwara: On INDIA Alliance, National Conference Vice President and former J&K CM Omar Abdullah says, "It is unfortunate that the condition of INDIA Alliance is not strong right now. There are some internal fights which should not be there, especially in the 4 to 5 states… pic.twitter.com/9Y5S4EnZ94

    — ANI (@ANI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ'
అయితే, ఈ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవలే స్పందించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరికివారే పోటీ చేస్తున్నా... సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీ ఫార్ములాను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.

MP Election Vindhya Region : ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్​.. బీజేపీ-కాంగ్రెస్​ 'ఢీ'.. వింధ్యలో విజయం ఎవరిదో?

MP Election Ayodhya Ram Mandir : బీజేపీ X కాంగ్రెస్​.. అయోధ్య రాముడి చుట్టూ మధ్యప్రదేశ్​ ఎన్నికల ప్రచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.