ETV Bharat / opinion

ప్రపంచవ్యాప్తంగా కాటేస్తోన్న కాలుష్య భూతం! - పెరుగుతోన్న కాలుష్యం

మానవాళికి ఉన్న అతిపెద్ద ముప్పు కాలుష్యం. గాలి, నీరు, ఆహారం.. ఇలా వివిధ రకాల కాలుష్యాల ప్రభావానికి ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారు. విషరసాయనాల కారణంగా అయిదేళ్ల లోపు పిల్లలు, 65 సంవత్సరాలు దాటిన పెద్దలు, గర్భవతులు, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అసలు కాలుష్యంపై నివేదికలు ఏం చెప్తున్నాయి?

increase of pollution worldwide resulting  serious effects
ప్రపంచవ్యాప్తంగా కాటేస్తోన్న కాలుష్య భూతం!
author img

By

Published : Dec 19, 2020, 7:17 AM IST

తరచూ చాలా ప్రాంతాల్లో ఎందరో కాలుష్యం కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. గాలి, నీరు, ఆహారం ఎలా కలుషితమవుతున్నాయనే విషయాలను తెలుసుకోవడం అందరి బాధ్యత, అవసరం. దీనివల్ల, ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెరుగుతుంది. తద్వారా, కొంతమేరకైనా కాలుష్యాన్ని తగ్గించడానికి, దాని బారినుంచి తమను తాము రక్షించు కోవడానికి వీలు కలుగుతుంది.

వ్యాధులను ఆహ్వానిస్తున్న వైనం...

పరిశుభ్రమైన వాతావరణంలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌, మీథేన్‌, హైడ్రోజన్‌, హీలియం మొదలైనవి ఉంటాయి. బొగ్గు, ఇంధన చమురు, గ్యాసోలిన్‌, సహజ వాయువు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, వాహనాలు, గృహాల నుంచి వాతావరణంలోని హరిత వాయువులు కార్బన్‌డైఆక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, మీథేన్‌, క్లోరోఫ్లూరోకార్బన్లు తదితర రసాయనాలు, వివిధ పరిమాణాల్లో ఉండే కణాలు అధికంగా విడుదలవుతాయి. ప్రపంచ ఆరోగ్య గణాంకాల (2020) ప్రకారం- ఏటా 70 లక్షలమంది వాయు కాలుష్యం కారణంగా మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ వాయుస్థితి (2020) లెక్కల ప్రకారం భారత్‌లో 2019లో దీర్ఘకాలిక వాయు కాలుష్య ప్రభావంవల్ల గుండెపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్‌ మొదలైన అనారోగ్య సమస్యలు ఏర్పడి 16 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.

ప్రపంచ వాయుస్థితి (2020) నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక తలసరి కాలుష్యం భారత్‌లో చదరపు మీటరుకు 83.2 మైక్రోగ్రాములు; నేపాల్‌లో అది 83.1 మైక్రోగ్రాములు. నీజర్‌లో 80.1 మైక్రోగ్రాములు. పర్యావరణ రక్షణ సంస్థ (2019) ప్రకారం వాయు కాలుష్యం చదరపు మీటరుకు 15 మైక్రోగ్రాములకు మించి ఉండరాదు. అంటే, ఈ మూడు దేశాల్లో తలసరి కాలుష్యం ప్రామాణిక పరిమితికన్నా అయిదు రెట్లు పైగానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం- ఈ సూక్ష్మకణాలు చదరపు మీటరు గాలిలో 10 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉండరాదు. అలా ఉంటే అవి గుండెపోటు, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ మొదలైన ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి కారణమవుతాయి.

ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ (2019) నివేదిక ప్రకారం వాతావరణంలో కాలుష్యాన్ని అరికట్టకపోతే 2050 నాటికి హరిత వాయువులు పెరిగి ఇప్పుడున్న ప్రపంచ సగటు ఉపరితల వాయు ఉష్ణోగ్రతకు (14 డిగ్రీల సెల్సియస్‌) మరో రెండు డిగ్రీలమేర పెరిగి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి 7.5శాతం నుంచి 2.5శాతానికి పడిపోవడానికి కారణమవుతుంది. మానవాళి మనుగడ సాగించడానికి దోహదపడుతున్న నీరు- వివిధ రకాల వ్యర్థాలు, శిలాజ ఇంధన దహనాలు, రసాయనాలవల్ల కలుషితమవుతోంది.

ఐక్యరాజ్యసమితి ప్రపంచ జల అభివృద్ధి(2020) నివేదిక ప్రకారం పారిశ్రామికీకరణ, పట్టణీకరణల కారణంగా గత వంద సంవత్సరాల నుంచి నీటి వినియోగం ఆరు రెట్లకు పైగా పెరిగింది. దీనివల్ల చాలా దేశాల్లో నీటి ఒత్తిడి, సంక్షోభం ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మందికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు. ఇండియన్‌ వాటర్‌ పోర్టల్‌ సమాచారం(2019) ప్రకారం ఏటా 3.70 కోట్లమంది భారతీయులు నీటి ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడుతున్నారు. 15 లక్షలమంది పిల్లలు అతిసారంతో మృత్యువాత పడుతున్నారు. ఏటా 7.30 కోట్ల పనిదినాలను కోల్పోతున్నాం.

విష రసాయనాల దుష్ప్రభావం

రెండు మూడు దశాబ్దాలుగా రసాయన పురుగుమందుల వినియోగం పెచ్చుమీరింది. కలుషితాహారం ప్రభావం అయిదేళ్ల లోపు పిల్లల మీద, 65 సంవత్సరాలు దాటిన పెద్దల మీద, గర్భవతుల మీద, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారిమీద ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం బ్యాక్టీరియా, వైరస్‌, రసాయనాలతో కలుషితమైన ఆహారాన్ని తినడంవల్ల 200కు పైగా వ్యాధులు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 కోట్ల మంది అనారోగ్యానికి గురికాగా 4.2 లక్షల మంది చనిపోతున్నారు. ఇందులో అయిదేళ్లలోపు పిల్లలు 1.25 లక్షలమంది ఉండటం బాధాకరం. కాలుష్యం మానవాళి మనుగడకే గొడ్డలిపెట్టు లాంటిది. దీని కట్టడికి ప్రధానంగా శుద్ధిచేసిన ఇంధనాలను వాడాలి. ప్లాస్టిక్‌, వాహనాల వినియోగం తగ్గించాలి. చెట్లను పెంచాలి. నీటి కాలుష్య పరీక్షలు చేయడానికి తగినన్ని ప్రయోగశాలలు నిరంతరం పనిచేయాలి. ప్రజలు శుచి, శుభ్రతను పాటించాలి. ప్రజల్లో కాలుష్యం మీద శాస్త్రీయ అవగాహన కలిగించాలి. అప్పుడే, కాలుష్యం బారినుంచి బయటపడటానికి తగిన మార్గాలు ఏర్పడతాయి.

ఇదీ చదవండి : కొవిడ్​ నుంచి మహిళలకు అధిక రక్షణ.. కారణం ఇదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.