ETV Bharat / opinion

కొవిడ్‌ కారాగారంలో ఖైదీలు- టీకాలేవీ? - అసోం జైళ్లలో కొవిడ్

కారాగారాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. లెక్కకు మించిన ఖైదీలు కిక్కిరిసిన భారతీయ జైళ్లలో.. కొవిడ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూవస్తోంది. మహారాష్ట్రలో మార్చి మొదటి నాటికే 46 కారాగారాలకు చెందిన 2,616 మంది ఖైదీలు, 576 మంది సిబ్బంది కొవిడ్‌ కోరల్లో చిక్కుకున్నారు. అసోంలోని 22 జైళ్లలో 2,513 పాజిటివ్‌ కేసులను గుర్తించారు. దిల్లీ, మహారాష్ట్ర, యూపీల్లో కొందరు ఖైదీలు ఇప్పటికే ఈ వైరస్‌కు బలయ్యారు!

jail
చెరసాల, జైలు
author img

By

Published : Apr 28, 2021, 8:40 AM IST

కారాగారాల్లో కొవిడ్‌ కోరలు చాస్తోంది. లెక్కకుమిక్కిలి ఖైదీలతో కిక్కిరిసిపోయిన భారతీయ చెరసాలలు కరోనా వైరస్‌కు సులభ లక్ష్యాలవుతున్నాయి. గడచిన కొద్దిరోజుల్లో రాజమహేంద్రవరం (ఏపీ), ఎర్నాకుళం (కేరళ), కల్యాణ్‌, భయ్‌ఖల్లా (మహారాష్ట్ర), అహ్మదాబాద్‌, సంత్‌రాంపూర్‌ (గుజరాత్‌), పటియాలా (పంజాబ్‌), మథుర (ఉత్తర్‌ ప్రదేశ్‌) కారాగారాల్లో పదుల కొద్దీ కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. దేశ రాజధానిలోని తీహార్‌, రోహిణి, మండోలి చెరసాలల్లో వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ దాదాపు అయిదు వందల మంది ఖైదీలు, జైలు సిబ్బంది కరోనా బారినపడ్డారు. మహారాష్ట్రలో మార్చి మొదటి నాటికే 46 కారాగారాలకు చెందిన 2,616 మంది ఖైదీలు, 576 మంది సిబ్బంది కొవిడ్‌ కోరల్లో చిక్కుకున్నారు. అసోంలోని 22 జైళ్లలో 2,513 పాజిటివ్‌ కేసులను గుర్తించారు. దిల్లీ, మహారాష్ట్ర, యూపీల్లో కొందరు ఖైదీలు ఇప్పటికే ఈ వైరస్‌కు బలయ్యారు!

కొరవడిన సమన్వయం

కారాగారాల్లో కొవిడ్‌ విస్తరణను నిలువరించడంపై నిరుడు మార్చిలోనే అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. సామర్థ్యానికి మించి ఖైదీలతో నిండిపోయిన జైళ్ల నుంచి కొంత మందిని పెరోల్‌పై విడుదల చేయాలని చెప్పింది. అయినప్పటికీ ఈ ఏడాది సమస్య ఉత్పన్నం కావడం, నానాటికీ తీవ్రరూపం దాల్చుతుండటం గుబులురేపుతోంది. మన దేశంలోని మొత్తం కారాగారాలు 4.03 లక్షల ఖైదీలకు మాత్రమే సరిపోతాయి. కానీ, వీటిలో 4.78 లక్షల మందిని నిర్బంధించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం లోక్‌సభలో ప్రకటించింది.

ఖైదీల్లో ఎంతమందికి కరోనా సోకిందన్న ప్రశ్నకు 'రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్‌సీఈఆర్‌బీకి ఈ సమాచారాన్ని అందించలేదు' అంటూ సమాధానమిచ్చింది! అత్యవసర పరిస్థితుల్లో రంగాల వారీగా జాతీయస్థాయి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని కలిసికట్టుగా ముందడుగేస్తేనే ఫలితాలు ఉంటాయి. కానీ, కేంద్రం మాత్రం కారాగారాల నిర్వహణ రాష్ట్రాల పరిధిలోని అంశం అంటూ సూచనలకే పరిమితమైంది! జైళ్లలో భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని, ఖైదీలు క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకునేలా, మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు నిరుడు మార్చిలో సూచించింది. ఆ తరవాత మే నెలలో 'భారతీయ కారాగారాల్లో కొవిడ్‌ నిర్వహణ- మార్గదర్శకాల'ను పంపింది. ములాఖాత్‌లు తగ్గించడం, అరెస్టు చేసిన వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించడం, వైరస్‌ బారిన పడిన ఖైదీలను విడిగా ఉంచడం తదితరాలనే ఈ పత్రంలో పేర్కొంది తప్ప సమస్య పరిష్కారానికి నిర్దిష్ట మార్గదర్శకాలను ఇవ్వలేదు.

కారాగారాల్లో భౌతిక దూరాన్ని పాటించాలంటే వాటి అధికారిక సామర్థ్యంలో సగం మంది ఖైదీలే ఉండాలి. ఉండాల్సిన వారి కంటే ఎక్కువ మంది ఉన్న జైళ్ల నుంచి కొంతమందిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెరోల్‌పై విడుదల చేయడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. దాదాపు 60 వేల మందిని ఇలా విడుదల చేసినట్లు అంచనా. కారాగారాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా ఖైదీలను విడుదల చేయడానికి కిందిస్థాయి కోర్టులు ఒప్పుకోవట్లేదని ఈ నెలలోనే మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. 'కేసు పత్రాలు అందుబాటులో లేని కారణంగా ఎక్కువ సంఖ్యలో బెయిల్‌ పిటిషన్లను నిరుడు ట్రయల్‌ కోర్టులు తిరస్కరించినట్లు తెలిసింది. కొవిడ్‌ కారణంగా కోర్టులు సైతం తక్కువ మంది సిబ్బందితో పనిచేస్తున్నందువల్ల కాగితాలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇదో సంక్లిష్ట స్థితి. అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు న్యాయస్థానాలూ అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలి' అని ముంబైలోని సెంటర్‌ ఫర్‌ క్రిమినాలజీ అండ్‌ జస్టిస్‌ ఆచార్యులు విజయ్‌ రాఘవన్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిందన్న భావనతో గడచిన కొద్దినెలల్లో తాత్కాలిక బెయిళ్లను రద్దు చేయడంతో కారాగారాల్లో ఖైదీల సంఖ్య పెరిగింది. వీరికి ఈ ఏడాది కాలంలో కొత్తగా జైళ్లకు వచ్చినవారు కలవడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.

తక్షణ చర్యలు అవసరం

ఖైదీలు, జైలు సిబ్బంది విరివిగా వ్యాధి బారిన పడుతున్న దృష్ట్యా- ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కలిసికట్టుగా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు, యాభై ఏళ్లకు పైబడిన వారితో పాటు శారీరకంగా బలహీనులు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేయాలి. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి అన్ని కారాగారాల్లోని ఖైదీలకూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి. జైలు ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచాలి. కొవిడ్‌ బారిన పడిన వారికి వైద్యసేవలు అందించాలి. ఖైదీలందరికీ టీకాలు వేయాలి. వచ్చే నెల మధ్యకల్లా రాష్ట్రంలోని ఖైదీలందరికీ టీకాలు వేయించడానికి కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తమిళనాడు, దిల్లీల్లో సైతం ఖైదీలకు చురుగ్గా టీకాలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ తరహాలో చర్యలు తీసుకుంటేనే- కొవిడ్‌ విజృంభణను అరికట్టగలం.

- ఎన్‌.ఎస్‌.

ఇదీ చదవండి:'శ్మశానంలో ఖాళీ లేదు.. 20 గంటల తర్వాత రండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.