ETV Bharat / opinion

ఇంకెంత కాలం... డిజిటల్‌ అగాధం? - డిజిటల్​ విద్య

కొవిడ్​ ధాటికి దేశంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. వాటిలో విద్యారంగం ప్రధానమైనది. ఆన్​లైన్​ విద్యతో.. ప్రభుత్వం ఆ కష్టాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నా.. సౌకర్యాల లేమితో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆప్టికల్​ ఫైబర్​ ద్వరా ‘భారత్‌ నెట్‌’ను విస్తరించాలి. ప్రాథమిక హక్కుగా నెట్‌ అనుసంధానత సాకారం కావాలన్నా, ఆన్‌లైన్‌ బోధన సరైన గాడిన పడాలన్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అర్థవంతమైన సమన్వయం, వాస్తవిక రీతిలో బడ్జెట్‌ను కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

HOW LONG FACE THESE DIGITAL DIFFICULTIES IN ONLINE EDUCATION SYSTEM
ఇంకెంత కాలం... డిజిటల్‌ అగాధం?
author img

By

Published : Oct 30, 2020, 10:41 AM IST

కరోనా వైరస్‌ ధాటికి దేశంలో కమిలిపోని, కదలబారని రంగమన్నదే లేదు. ముఖ్యంగా విద్యారంగాన వాటిల్లుతున్న కష్టనష్టాలకు, సత్వర దిద్దుబాటు చర్యల అత్యావశ్యకతకు కొన్నాళ్లుగా వెలుగుచూస్తున్న వివిధ అధ్యయన ఫలితాలే రుజువు. ఆన్‌లైన్‌ విద్యాబోధనతో ముడివడిన సాధకబాధకాలే వాటన్నింటా ప్రధానాంశం. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేనిదే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే వీలుండదు. దేశవ్యాప్తంగా 27శాతం పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న దురవస్థ అదేనని ఆ మధ్య జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) నిగ్గు తేల్చింది. అంతర్జాల అనుసంధానత(నెట్‌ కనెక్టివిటీ) పరంగా పట్టణాలు కొంత మెరుగని; గ్రామాలు, గిరిజన ఏజెన్సీలు, మారుమూల ప్రాంతాలు, వెనకబడిన వర్గాలకే సమస్యలు తీవ్రతరమన్న కథనాలూ వెలువడ్డాయి. 26 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలనుంచి సేకరించిన సమాచారం ప్రాతిపదికన తాజాగా రూపొందించిన వార్షిక విద్యాస్థాయి నివేదిక(అసర్‌) మరింత వివరణాత్మక దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది.

పాఠ్యపుస్తకాలు అందుబాట్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 35శాతంకన్నా తక్కువని, తక్కినచోట్లతో పోలిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్‌ తరగతులకు నోచుకుంటున్నవారి శాతం వెలాతెలా పోతున్నదని ‘అసర్‌‘ చాటుతోంది. ట్యాబ్‌లు, లాప్‌టాప్‌లు, వైఫై కనెక్షన్ల నిమిత్తం ఈ ఏడాది ఒక్క తెలంగాణలోనే తల్లిదండ్రులపై రూ.5500 కోట్ల మేర అదనపు భారం పడిందన్న అంచనాలు నాలుగు నెలల క్రితం వినవచ్చాయి. 2018 సంవత్సరంతో పోలిస్తే దేశమంతటా స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో గణనీయంగా పెరుగుదల ఉన్నట్లు ధ్రువీకరిస్తూనే పాఠ్యాంశాలకు, బోధన సరళికి సంబంధించిన సన్నద్ధత కొరవడటాన్ని ‘అసర్‌’ అధ్యయనం ప్రస్ఫుటీకరిస్తోంది. నెట్‌వర్క్‌ సమస్యల్ని చురుగ్గా పరిష్కరించనంతవరకు, దేశంలో ఆన్‌లైన్‌ విద్యాబోధన సజావుగా ఊపందుకోదు!

సర్కార్​ సామర్థ్యానికి పరీక్ష..

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా పేరెన్నికగన్న ఇండియాలో దశాబ్దాలుగా ఉన్న సామాజిక అసమానతలతోపాటే డిజిటల్‌ అగాధమూ విస్తరిస్తోంది. కొవిడ్‌ మహాసంక్షోభ వేళ డిజిటల్‌ అంతరాలను పూడ్చి అందరికీ విద్యాగంధం తప్పక అందించాల్సిన బాధ్యతా నిర్వహణ సర్కార్ల సామర్థ్యానికి పరీక్షగా మారింది. ఏ రంగాన నెట్‌ వినియోగం ఎంత మేర ఇనుమడించిందని ప్రత్యేకంగా ఎంచేదేముంది- అంతర్జాల సేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కేనని జమ్మూకశ్మీర్‌ కేసులో నిరుడు సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టీకరించింది. దేశంలోని 25కోట్లమంది విద్యార్థుల్లో అత్యధికులకు సంబంధించి ఆ ‘హక్కు’ నేడు కొల్లబోతుండటం దురదృష్టకరం. కొవిడ్‌ దృష్ట్యా అస్తవ్యస్తమైన పరిస్థితుల్ని చక్కదిద్దే కృషిలో భాగంగా, బోధన సిబ్బందికి ఆన్‌లైన్‌ విద్యలో శిక్షణ అవసరాల్ని ‘అసర్‌’ ప్రస్తావించింది. ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతోనే అంతా కుదుటపడుతుందా... పెద్దయెత్తున పేరుకున్న ఖాళీల మాటేమిటి? దేశవ్యాప్తంగా వివిధ స్థాయుల్లోని 10.84 లక్షల ప్రభుత్వ విద్యాసంస్థల్లో 10.60 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావాల్సి ఉందని పార్లమెంట్లో సంబంధిత శాఖామాత్యులే వెల్లడించారు.

53 వేల కొలువులున్నా.!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం 53వేల ఉపాధ్యాయ కొలువులు ఖాళీగా పడి ఉన్నాయని అంచనా. వాటిని ప్రాథమ్య ప్రాతిపదికన మెరికల్లాంటి అభ్యర్థులతో భర్తీ చేయడం సమస్యను పరిష్కరించడంలో తొలి అంచె. ‘భారత్‌ నెట్‌’ ద్వారా గ్రామ పంచాయతీలన్నింటా ఆప్టికల్‌ ఫైబర్‌ స్వప్నం ఈడేర్చడం, బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో మందభాగ్యాన్ని చెల్లాచెదురు చేసే విస్తృత కార్యాచరణను ఉరకలెత్తించడం మరింత ముఖ్య లక్ష్యాలు. ప్రాథమిక హక్కుగా నెట్‌ అనుసంధానత సాకారం కావాలన్నా, ఆన్‌లైన్‌ బోధన సరైన గాడిన పడాలన్నా- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అర్థవంతమైన సమన్వయం, వాస్తవిక రీతిలో బడ్జెట్‌ కేటాయింపులు... ప్రాణావసరాలు!

ఇదీ చదవండి: గుండె పోటుకు 'పట్టీ'తో చికిత్స!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.