ETV Bharat / opinion

పోషకాహార పథకంపై కరోనా దెబ్బ- ఏళ్ల శ్రమ వృథా!

కరోనా ఉద్ధృతితో ఏకకాలంలో అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. జనజీవనంపై లాక్​డౌన్ ఎనలేని ప్రభావాన్ని చూపించింది. ప్రస్తుతం అన్​లాక్ దశ మొదలైనప్పటికీ.. కొన్ని విషయాల్లో కరోనా దీర్ఘకాల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులో పోషకాహార లోపం కూడా ఒకటి. గత కొన్నేళ్లుగా పోషకాహార లోపాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నాలు లాక్​డౌన్​ కారణంగా ఆగిపోయాయని... వాటిని పునఃప్రారంభించి ఈ పోరులో వేగం పెంచాలని పిలుపునిస్తున్నారు.

How COVID-19 has made India's foundational  nutrition programme weaker
పౌషకాహార పథకంపై కరోనా దెబ్బ- కొన్నేళ్ల శ్రమ వృథా!
author img

By

Published : Jul 7, 2020, 4:25 PM IST

భారత్ అన్​లాక్ 2.0 స్టేజీలోకి ప్రవేశించింది. కానీ పోషకాహారం విషయంలో కొవిడ్-19 చూపించిన ప్రభావం రానున్న కొన్ని సంవత్సరాల్లోనే మనం అనుభవించే అవకాశం ఉంది. గర్భిణులు, రెండేళ్ల లోపు చిన్నారులపై లాక్​డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ సమయంలో సరైన పోషణ లేకపోతే రక్తహీనత, బలహీనత, అనారోగ్యం వంటి సమస్యలు జీవితాంతం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. లాక్​డౌన్ కాలంలో (మార్చి 24 నుంచి మే 31 వరకు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇవన్నీ పూర్తిస్థాయిలో పునఃప్రారంభం కాలేదు.

అంగన్​వాడీ పథకం

విద్య, వైద్యం, పోషకాహారం వంటి శిశు అభివృద్ధి వికాసం కోసం భారత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్​మెంట్ సర్వీస్ ​(ఐసీడీఎస్)ను రూపొందించింది. అంగన్​వాడీ కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అంగన్​వాడీ కార్యకర్తలు (ఏడబ్ల్యూడబ్ల్యూ), సహాయకులు(ఏడబ్ల్యూహెచ్) ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి- గర్భిణులు, బాలింతలకు అందని పోషకాహారం

2019 జూన్ నాటికి భారత్​లో 13.78 లక్షల అంగన్​వాడీ కేంద్రాలు ఉన్నాయి. 13.21 లక్షల అంగన్​వాడీ కార్యకర్తలు, 11.82 లక్షల సహాయకులు ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్నారు. గత 45 ఏళ్ల నుంచి నడుస్తున్న ఈ కేంద్రాలు పోషకాహారం అందించేందుకు భారత్​ చేస్తున్న ప్రయత్నాల్లో వెన్నెముకగా నిలుస్తున్నాయి.

''సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్​కు చెందిన అకౌంటబిలిటీ ఇనిషియేటివ్​లో భాగంగా ఈ పథకం పురోగతిని దశాబ్దకాలం పాటు పరిశీలించాం. కొవిడ్-19 సంక్షోభానికి ముందే చాలా అంశాల్లో ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ సమస్యలను కరోనా మహమ్మారి మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.''

కవరేజీ లేదు..

అందరికీ పూర్తి స్థాయిలో పథకం అందుబాటులో లేకపోవడం ఇందులోని మొదటి సమస్య. ఐసీడీఎస్ అనేది సార్వత్రిక పథకం. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసున్న వారందరూ ఈ పథకానికి అర్హులు. 2019 జూన్ నాటికి 8.36 కోట్ల మంది అంగన్​వాడీ కేంద్రాల నుంచి అనుబంధ పోషణ రూపంలో వండిన ఆహారం(హెచ్​సీఎం) లేదా టేక్​ హోమ్ రేషన్(టీహెచ్​ఆర్-పప్పు వంటి ఆహార పదార్థాలు)​ను తీసుకున్నారు.

ఇదీ చదవండి- పోషకాహార లోపాన్ని అధిగమించడానికి 'ఎఫెక్ట్​'!

ఈ సంఖ్యలు చూస్తే చాలా భారీగా కనిపిస్తున్నాయి. కానీ అనుబంధ పోషకాహారం అందుకోవాల్సిన చిన్నారుల సంఖ్యతో పోల్చి చూస్తే చాలా అంతరం కనిపిస్తుంది. 2019 సంవత్సరంలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అర్హులైన చిన్నారుల్లో సగం కంటే తక్కువ మందికి మాత్రమే ఈ పథకం ద్వారా అనుబంధ పోషణ లభించింది.

తీసుకున్నవారే తింటున్నారా?

ఈ పథకంలో భాగంగా సరకులు తీసుకున్నవారికి నేరుగా పోషణ లభిస్తుందా అనేది మరో సమస్య. ఉదాహరణకు టేక్​ హోమ్ రేషన్ తీసుకున్నవారు ఆ సరకులను తమ కుటుంబం అంతటితో పంచుకునే అవకాశం ఉంది. గర్భిణులు, పాలిచ్చే తల్లుల విషయంలో ఇది చాలా సర్వసాధారణంగా మారింది. ఫలితంగా పథకం ఉద్దేశించిన ప్రకారం వారికి సరైన పోషణ లభించడం లేదు.

మరిన్ని కుటుంబాలకు అవసరం

వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్​డౌన్ కారణంగా అంగన్​వాడీ కేంద్రాలను తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. చాలా మంది వలసకార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కాబట్టి ఈ సమయంలో మరిన్ని కుటుంబాలకు పోషకాహారం అవసరమవుతుంది. పిల్లలకు ప్రారంభస్థాయి విద్య అవసరం. మహమ్మారి కారణంగా అంగన్​వాడీ కేంద్రాలు భౌతికదూరం వంటి నిబంధనలకు అలవాటు కావాలి. దీనికి కాస్త సమయం పడుతుంది.

ఇదీ చదవండి- దేశంలో ఈసురోమంటున్న బాల్యం

చాలా మందికి జీవనోపాధి దెబ్బతిన్న నేపథ్యంలో రోజువారీ అవసరాలకే నగదు కొరత తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పోషకాహారం అందించడం మరింత కష్టతరం.

సరైన జీతాలేవి?

అంగన్​వాడీ కేంద్రాలన్నీ.. కార్యకర్తలు, సిబ్బందిపై ఆధారపడి ఉన్నాయి. ప్రసూతి సంరక్షణ, చిన్నారులకు ప్రారంభ విద్య వంటి కార్యకలాపాలు నిర్వహించడం వీరి బాధ్యత. ఐసీడీఎస్ మార్గదర్శకాల ప్రకారం సిబ్బందిని వలంటీర్లు, కాంట్రాక్ట్ లేబర్లుగా వర్గీకరించడం వల్ల వీరికి స్థిరమైన జీతాలు అందడం లేదు.

గౌరవవేతనం అందుకుంటున్నప్పటికీ.. అది చాలా రాష్ట్రాల్లోని నైపుణ్య ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కనీస వేతనం కన్నా తక్కువ. 2018 అక్టోబర్​లో కార్యకర్తల గౌరవవేతనాన్ని రూ. 3 వేల నుంచి రూ. 4,500కి, సహాయకులకు రూ. 1,500 నుంచి రూ. 2,250కి పెంచారు.

ఇదీ చదవండి- కొవిడ్‌పై దుర్బల పోరు.. పోషకాహార లోపమే శాపం

గౌరవవేతనాలు పెంచినా ఇది చాలా తక్కువ. ఈ మొత్తాలను కూడా సకాలంలో చెల్లించని సందర్భాలు అనేకం. ఫలితంగా బిహార్, ఝార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో అంగన్​వాడీ కార్యకర్తలు సమ్మెలు చేయడం ప్రారంభించారు.

సేవలు అనుపమానం

కొవిడ్-19 సమయంలో ఈ కరోనా యోధులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటికి తిరిగి వైరస్​పై అవగాహన కల్పిస్తున్నారు. సర్వేలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కొవిడ్-19 నియంత్రణ ప్రణాళికలోనూ అంగన్​వాడీ కార్యకర్తలకు ప్రధాన బాధ్యతలు అప్పగించారు.

ఈ కార్యకర్తలు తమ రోజువారీ విధులు నిర్వహిస్తూనే కరోనా సంబంధిత పనులను చేయాల్సి వస్తోంది. కొవిడ్-19 నియంత్రణకు అవసరమైన వనరులు కూడా వీరి వద్ద లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పోషకాహార పథకంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోతున్నారు.

రాష్ట్రాల ఆదాయాలకు తీవ్రంగా గండిపడిన నేపథ్యంలో అత్యవసర వ్యయాలను భర్తీ చేసుకోవడానికి అంగన్​వాడీలకు సహాయాన్ని నిలిపివేసి వైద్య సేవలపైన దృష్టిసారించే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించాలి

పరిష్కారం ఏంటి?

భారత్​లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో 68 శాతం మంది పోషకాహార లోపంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో జన్మించే చిన్నారులపై దీర్ఘకాల ప్రభావం పడుతుంది. పోషకాహార లోపంతో సతమతమయ్యే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి- 'పోషకాహారం అందిస్తే 37 లక్షల మందిని కాపాడవచ్చు'

కొన్ని రాష్ట్రాల్లో పోషకాహారం అందించడానికి చర్యలు తీసుకోవడం శుభపరిణామం. అయితే మరికొన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది.

మొదటిది

  • గతంలో నమోదు చేసుకున్న లబ్ధిదారులను మించి కవరేజీని పెంచాల్సి ఉంటుంది.
  • అంగన్​వాడీ కార్యకర్తల ద్వారా తరచుగా సర్వేలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాలి.
  • కొవిడ్-19 అవగాహన కోసం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను దీనికి ఉపయోగించుకోవచ్చు.

రెండోది

  • వైరస్ సోకే ముప్పు లేకుంగా గర్భిణులు, చిన్నారులకు అనుబంధ పోషణ అందించాలి.
  • ఒడిశా వంటి రాష్ట్రాల్లో మాదిరిగా డోర్ డెలివరీ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
  • లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేసే అవకాశాన్ని పరిశీలించాలి. లబ్ధిదారులందరికీ ఖాతాలు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. సరైన సమయానికి నగదు డిపాజిట్ చేయాలి. బిహార్ ప్రభుత్వం ఇలాంటి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది.

మూడోది

  • లాక్​డౌన్​లో ఆహార లభ్యత ఎక్కువగా లేనందున.. మహిళలకు ఈ విషయంలో అవగాహన కల్పించాలి.
  • టేక్​హోమ్ రేషన్ అందించినప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వాలి.
  • రేడియో, టీవీ మాధ్యమాల ద్వారా కూడా అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయవచ్చు.

చివరగా...

పోషకాహారం వంటి కీలక సేవలకు కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు ఉపయోగించకుండా చూడటం చాలా ముఖ్యం. అంగన్​వాడీ కార్యకర్తల గౌరవవేతనాలు సహా పోషకాహారానికి సంబంధించిన నిధులన్నీ సరైన సమయానికి విడుదల చేయాలి.

వేగం పుంజుకోవాల్సిందే

కేంద్ర ప్రభుత్వ 'పోషణ్' అభియాన్ పథకం ద్వారా పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించే విషయంలో గత కొన్నేళ్లుగా గణనీయమైన పురోగతి సాధించాం. మహమ్మారి విజృంభణ, లాక్​డౌన్ పరిణామాల వల్ల ఈ చర్యలు చాలా వరకు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ వీటిని ప్రారంభించాలి. పౌషకాహార లోపానికి వ్యతిరేకంగా భారత్​ కొనసాగిస్తున్న పోరాటంలో మరోసారి వేగం పెంచడం చాలా ముఖ్యం.

రచయితలు

  • అవని కపూర్, అకౌంటెబిలిటీ ఇనిషియేటివ్ డైరెక్టర్
  • రిత్విక్ శుక్లా, అకౌంటెబిలిటీ ఇనిషియేటివ్ రీసెర్చ్ అసోసియేట్
  • అవంతికా శ్రీవాస్తవ, అకౌంటెబిలిటీ ఇనిషియేటివ్ సీనియర్ కమ్యునికేషన్ ఆఫీసర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.