ETV Bharat / opinion

పోషకాహారంతో ఆరోగ్య భద్రత - పౌష్టికాహార లోపం

దేశంలోని చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తులేకపోవడం, తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడటం అనారోగ్య భారతాన్ని ప్రతిబింబిస్తోంది. శిశువు గర్భంలో పడిన తొలి వెయ్యి రోజుల్లో తగిన పౌష్టికాహారం లేకపోవడం వల్ల సరిదిద్దుకోలేని సమస్యలు చిన్నారులను వెంటాడుతున్నాయి. ఈ సమస్య బాలుర కంటే మహిళలు, కిశోర బాలికల్లో అధికంగా ఉందని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఆదిలోనే పిల్లలను కబళించి వేస్తే ఆరోగ్య భారతం సాకారమయ్యేదెలా?

nutrition
పోషకాహారం
author img

By

Published : May 26, 2021, 8:16 AM IST

ఆరోగ్యకరమైన మానవ వనరులు దేశాభివృద్ధికి కీలకం. దేశంలో కలరా, మశూచి, క్షయ, కుష్ఠు లాంటి వ్యాధులు అనేకమందిని పొట్టనపెట్టుకున్నాయి. గతంలో వేలమందిని బలిగొన్న ఇలాంటి వ్యాధులు అదుపులోకి వచ్చినా ఎప్పటికప్పుడు కొత్త వ్యాధులు దాడి చేస్తూనే ఉన్నాయి. క్యాన్సర్‌, శ్వాసకోశ వ్యాధులు, హృద్రోగం, మధుమేహం వంటివి దేశంలో అనారోగ్య పరిస్థితులను సృష్టిస్తూనే ఉన్నాయి. దానికితోడు కరోనా విలయ తాండవంతో పట్టణాలు, గ్రామాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఫలితంగా, ప్రజలు ఉపాధి కోల్పోయి పేదరికం బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఆర్థిక అసమానతలతోపాటు, పోషకాహార లోపానికీ కారణమవుతున్నాయి.

తీవ్రమైన పౌష్టికాహార లోపం

దేశంలోని చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తులేకపోవడం, తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడటం అనారోగ్య భారతాన్ని ప్రతిబింబిస్తోంది. శిశువు గర్భంలో పడిన తొలి వెయ్యి రోజుల్లో తగిన పౌష్టికాహారం లేకపోవడం వల్ల సరిదిద్దుకోలేని సమస్యలు చిన్నారులను వెంటాడుతున్నాయి. ఈ సమస్య బాలుర కంటే మహిళలు, కిశోర బాలికల్లో అధికంగా ఉందని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. ఆహారం, పోషకాలను సరిపడినంత తీసుకోకపోవడం వల్ల వచ్చే పోషకాహారలేమి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అనారోగ్య సమస్యలు ఆదిలోనే పిల్లలను కబళించి వేస్తే ఆరోగ్య భారతం సాకారమయ్యేదెలా? వీటికి తోడు పలు సాంక్రామిక వ్యాధులూ చుట్టుముట్టి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి వైద్య నిపుణులకు, ప్రభుత్వాలకు సవాలుగా మారింది. కరోనా కట్టడికి రోగ నిరోధక శక్తి పెంపుదలే ప్రధాన ఆయుధమని వైద్యరంగ నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంపునకు పౌష్టికాహారం, మేలైన ఆహారపు అలవాట్లు, జీవన విధానంతోపాటు వంటింట్లోని పోపులపెట్టెలో వాడే వస్తువులు, ఆయుర్వేద మందులే తారకమంత్రంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడమే మానవాళి సంక్షేమానికి అత్యంత అవసరం. ప్రభుత్వాలు సైతం వైద్య, ఆరోగ్య రంగాలకు అధిక బడ్జెట్‌ కేటాయింపులు చేసి, ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా సాగితేనే ప్రజల్ని కాపాడే అవకాశం ఉంటుంది.

పోషణ్‌ అభియాన్‌

దేశంలో వైద్య రంగం అభివృద్ధికి 1983లో జాతీయ ఆరోగ్య విధానాన్ని ప్రకటించి, అందరికీ ఆరోగ్య సేవలు అందించేలా ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. పలుమార్లు మార్పులు, చేర్పులతో సవరణలు సైతం చేపట్టింది. అనారోగ్యానికి పోషకాహారలేమి ప్రధాన కారణంగా మారుతున్న తరుణంలో నివారణ కోసం ప్రభుత్వం జాతీయ పోషకాహార ఉద్యమాన్ని చేపట్టింది. సరైన పోషణను అందించేందుకు 'పోషణ్‌ అభియాన్‌' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఆకలిని, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పంచవర్ష ప్రణాళికల్లో తగిన వ్యూహాలను భారత ప్రభుత్వం అమలు చేసింది. వ్యవసాయాభివృద్ధితో ఆహార ఉత్పత్తిని పెంచి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందిస్తున్నారు. కుటుంబ ఆహార భద్రత మెరుగుదల కోసం కొనుగోలు శక్తి పెంచడంతో పాటు, పలు రాయితీలు అందిస్తున్నారు.

మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా అనుబంధ పోషకాహార కార్యక్రమాలు చేపడుతున్నారు. సమగ్ర జాతీయ పోషకాహార ప్రణాళికపైనే జాతీయ పోషకాహార మిషన్‌ ఫలితం ఆధారపడి ఉంది. వ్యాధి నిరోధక టీకాలు, అనుబంధ పోషకాహారం, తల్లి పాల విశిష్టత వంటి కార్యక్రమాలు జాతీయ పోషకాహార ప్రణాళికలో అత్యంత కీలకం. 1993లో జాతీయ పోషకాహార విధానాన్ని ప్రవేశపెట్టి, 1997లో ఆహార, పోషణ మండలిని ఏర్పాటు చేశారు. అందరికీ పోషకాహారం అందించేందుకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ముందుకు సాగాలని పోషణపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక సూచించింది. అయినప్పటికీ దేశంలోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులతో పాటు యువకులు, వృద్ధులకు తగిన పోషకాహారం లభించక ప్రాణనష్టం సంభవిస్తోంది.

ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ, ఆరోగ్యవంతమైన జీవనానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యంతో శ్రమించాలి. దేశంలో జనాభా పెరుగుదల, పేదరిక రేఖ దిగువన ఎక్కువమంది ఉండటం, పోషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. ప్రభుత్వరంగ ప్రాధాన్యాన్ని పెంచడంతోపాటు, ప్రైవేట్‌ రంగంపైనా నియంత్రణ సాధించడం అవసరం. ఆయుర్వేదం, హోమియో వంటి వైద్య విధానాలనూ ప్రోత్సహించాలి. యోగా, ధ్యానం వంటి ప్రక్రియలకు అధిక ప్రాధాన్యమిచ్చి శ్రమించాలి. ఆరోగ్య సమస్యలపై అపోహలు తొలగించి గ్రామీణుల్లో చైతన్యం కల్పించాలి. కీలకమైన సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్య సౌకర్యం, స్వచ్ఛమైన గాలి, పోషకాహారం అందరికీ అందేలా కృషి చేస్తూ, బహుముఖ విధానాలతో ముందుకు సాగితేనే ఆరోగ్య భారతావని సాకారమవుతుంది.

- ఎ.శ్యామ్‌కుమార్

ఇదీ చదవండి: పేదరికంలోకి 24కోట్ల మంది- వెంటాడుతున్న ఆకలిమంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.