ETV Bharat / opinion

కరోనాపై సామాజికాస్త్రం- రోగ నిరోధానికి మరో మార్గం

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఇప్పుడు అందరి దృష్టి రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడంపై పడింది. ముఖ్యంగా సామాజిక రోగనిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) పెంచుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా పోతుంది. ఫలితంగా వ్యాధి సంక్రమణ గొలుసు కూడా తెగిపోతుంది. అందువల్ల ప్రపంచ పౌరులంతా కలిసి 'హెర్డ్‌ ఇమ్యూనిటీ'ని సాధించి ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉంది.

Herd Immunity Armor on Corona
కరోనాపై సామాజికాస్త్రం
author img

By

Published : Jun 2, 2020, 9:01 AM IST

సామాజిక రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) అనేది అంటువ్యాధుల నుంచి మనకు పరోక్షంగా రక్షణ కల్పించే సాంఘిక ప్రక్రియ. జనాభాలో ఎక్కువ శాతం సహజసిద్ధంగా పరిమిత ఇన్ఫెక్షన్‌ తెచ్చుకోవడం ద్వారా గాని, కృత్రిమంగా టీకా తీసుకోవడం ద్వారాగాని రోగనిరోధక శక్తి పెంపొందించుకుంటారు. దీనివల్ల రోగనిరోధకత లేని వ్యక్తులకు కొంత రక్షణ ఏర్పడుతుంది. వ్యాధి వ్యాప్తికి అవకాశం లేకపోవడంవల్ల 'వ్యాధి సంక్రమణ గొలుసు' తెగిపోతుంది. వ్యాధి వ్యాప్తి ఆగిపోతుంది లేదా నెమ్మదిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో కొందరు ఇలాంటి రోగనిరోధకతను పొందలేకపోవచ్చు. వారికి ఈ 'హెర్డ్‌ ఇమ్యూనిటీ' మరింతగా ఉపకరిస్తుంది. సామాజిక రోగ నిరోధకత ఓ నిర్దిష్ట పరిమితి చేరిన తరవాత, క్రమంగా ఆ అంటువ్యాధిని ప్రజల మధ్య నుంచి తొలగిస్తుంది. ఈ పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా సమర్థంగా అమలు చేయగలిగితే ఆయా అంటువ్యాధులను శాశ్వతంగా తొలగించవచ్ఛు ఉదాహరణకు టీకాల ద్వారా సృష్టించిన 'హెర్డ్‌ ఇమ్యూనిటీ' మశూచి మహమ్మారిని ప్రపంచం నుంచి పారదోలింది. అనేక ఇతర అంటువ్యాధులను తగ్గించగలిగింది. కానీ, ఈ భావన అన్ని అంటువ్యాధులకు వర్తించదు. సూక్ష్మక్రిమి ద్వారా వచ్చే సాంక్రామిక వ్యాధులన్నీ ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధులు కావు. ఉదాహరణకు టెటనస్‌ సూక్ష్మక్రిమి ద్వారా వచ్చేది సాంక్రామిక వ్యాధే కానీ అంటురోగం కాదు. కాబట్టి హెర్డ్‌ ఇమ్యూనిటీ దీనికి వర్తించదు.

విస్తృతికి అడ్డుకట్ట

సామాజిక రోగ నిరోధక శక్తి భావన మొదటిసారి 1930లలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో చిన్న పిల్లల్లో వచ్చే తట్టువ్యాధిలో దీన్ని గుర్తించారు. మూకుమ్మడిగా టీకా ఇచ్చిన తరవాత, తట్టుసోకే అవకాశం ఉన్న పిల్లల్లోనూ వ్యాధి ప్రబలే అవకాశాలు సన్నగిల్లడాన్ని గమనించారు. అప్పటి నుంచే టీకాల ద్వారా సామూహిక రోగనిరోధక శక్తి పెంపుదల విధానం సాధారణమైంది. అనేక అంటువ్యాధుల వ్యాప్తి నివారణలోనూ ఇది విజయవంతమైంది కూడా. టీకా పద్ధతి పట్ల వ్యతిరేకతగల కొన్ని దేశాలు మాత్రం హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధనలో వెనకబడ్డాయి. ఆయా దేశాల ద్వారా అంటువ్యాధులు తిరిగి ప్రబలుతుండటమే దీనికి కారణం. ఇది ఇతర ప్రపంచ దేశాలకు సవాలుగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో ముందే ఉన్న జబ్బుల కారణంగా కొందరికి టీకాలు వేయడం సాధ్యపడదు. మరికొందరికి టీకా వేసినా ఆశించిన స్థాయిలో రోగనిరోధక శక్తి పుంజుకోదు. నవజాత శిశువులకు అన్ని రకాల టీకాలు ఇవ్వలేం. తల్లి ద్వారా తాత్కాలికంగా వచ్చే యాంటీబాడీలు టీకాలను నిష్ఫలంజేస్తాయి. ఎయిడ్స్‌, లుకేమియా వంటి జబ్బులు, అవయవ మార్పిడి, కెమోథెరపీ లేదా రేడియోథెరపీ చేసుకున్నవారిలో కొన్ని టీకాలు ఉపయోగపడకపోవచ్ఛు టీకాలు వేసినా వారిలో దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి రాకపోవచ్ఛు వీరి చుట్టూ వ్యాధినిరోధకత ఉన్నవారు చేరితే 'హెర్డ్‌ ఇమ్యూనిటీ' ద్వారా వీరిని ఇన్ఫెక్షన్ల బారినపడకుండా రక్షించవచ్చు.

వైరస్‌ల పరిణామ ప్రక్రియలో 'హెర్డ్‌ ఇమ్యూనిటీ' ప్రభావమూ కనిపిస్తుంది. వైరస్‌ తన ఆకారంలో పరమాణు స్థాయిలో మార్పు చెంది (యాంటిజెన్‌ డ్రిఫ్ట్‌) కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ క్రమంలో కొత్త జాతిగా ఉద్భవించి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. జన్యుభాగపు పునర్‌ వ్యవస్థీకరణ (యాంటిజెనిక్‌ షిఫ్ట్‌) ద్వారా కొత్త సెరోటైప్‌లనూ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండూ సంభవించినప్పుడు శరీరంలోని 'మెమరీ టి సెల్స్‌' ఆ వైరస్‌ను గుర్తించలేవు. దాంతో ఆయా వైరస్‌లు సోకినవారు రోగనిరోధక శక్తిని క్రమేణా కోల్పోతారు. ఉదాహరణకు ఫ్లూ, నోరోవైరస్‌లు రెండూ తాత్కాలికంగా మాత్రమే 'హెర్డ్‌ ఇమ్యూనిటీ'ని ప్రేరేపించగలవు. కొత్తరకం వైరస్‌ ఉద్భవించిన తరవాత మళ్ళీ వ్యాప్తి మొదలవుతుంది. అందువల్ల అన్ని రకాల సెరోటైపులకు ప్రతిగా రక్షణ అందించగల సార్వత్రిక టీకాల అభివృద్ధి ఎంతో అవసరం. ఇప్పటివరకు రిండర్‌పెస్ట్‌, మశూచి వ్యాధులను మాత్రమే 'హెర్డ్‌ ఇమ్యూనిటీ', టీకాల వల్ల పూర్తిగా నిర్మూలించారు. ఇవే పద్ధతుల్లో ప్రస్తుతం పోలియో నిర్మూలన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్‌పై లభించే సమాచారంతో జనాభాలో కనీసం 70 శాతానికి రోగనిరోధక శక్తి కలిగితే 'హెర్డ్‌ ఇమ్యూనిటీ' సాధ్యమన్నది ఒక అంచనా. కొందరికి కొవిడ్‌ నుంచి కోలుకున్న తరవాత తిరిగి సోకినట్లు అధ్యయనాలు స్పష్టీకరించాయి. అందువల్ల మొదటిసారి కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా తయారైన యాంటీబాడీలు మరోసారి వైరస్‌తో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాయో లేదో ఇంకా తెలియలేదు ఈ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం నొక్కి చెప్పింది. వ్యక్తిగత రోగనిరోధక శక్తి ఇంకా నిరూపితం కాకపోవడంతో 'హెర్డ్‌ ఇమ్యూనిటీ'పై అనేక సందేహాలు అలాగే ఉన్నాయి.

ఇతర వ్యాధుల్లో సత్ఫలితాలు

ఒక వయసువారిలో అధిక స్థాయిలో ఉన్న రోగనిరోధక శక్తి ఇతర వయసులవారిలో హెర్డ్‌ ఇమ్యూనిటీని సృష్టించగలదు. ఉదాహరణకు పెర్టుసిస్‌ నిరోధానికి పెద్దలకు టీకాలు వేయడం ద్వారా, టీకా వేసే అవకాశం లేని పిల్లలు, శిశువులకు ఈ వ్యాధి రాకుండా కొంతమేర నిరోధించవచ్చు. న్యూమోనియా, రోట వైరస్‌ల నిరోధానికి పిల్లలకు టీకాలు వేస్తారు. తద్వారా టీకాలు వేసుకోని పెద్దలకు ఈ రెండు అంటువ్యాధులు రాకుండా చూసుకోవచ్ఛు వృద్ధుల్లో 'ఫ్లూ' ప్రభావం తీవ్రంగా ఉంటుంది. టీకాలు సైతం వారిలో రోగ నిరోధక శక్తిని పెంచలేవు. అప్పుడు పిల్లలు, యువకులకు 'ఫ్లూ' టీకా ఇవ్వడం వల్ల వారిచుట్టూ ఉండే వృద్ధులకూ రక్షణ లభిస్తుంది. వృద్ధులకు స్వయంగా టీకా ఇచ్చేకన్నా పిల్లలకు టీకా ఇవ్వడం వల్ల ఎక్కువ సత్ఫలితాలు రాబట్టవచ్చని తెలిసింది. హెర్డ్‌ ఇమ్యూనిటీ విధానాల అమలు ద్వారా ఈ తరహా అంటువ్యాధులు ప్రబలడాన్ని అడ్డుకోవచ్చు. కొన్ని సుఖవ్యాధులు రాకుండా స్త్రీ పురుషుల్లోనూ 'హెర్డ్‌ ఇమ్యూనిటీ' ప్రభావం కనిపిస్తుంది.

స్వీయనియంత్రణే రక్ష

ప్రారంభంలో ప్రపంచంలో ఎవరికీ కొవిడ్‌ను ఎదుర్కోగల రోగనిరోధక శక్తి లేదు. పరిమిత లాక్‌డౌన్లతో ప్రయోగాలు చేసిన స్వీడన్‌, బ్రిటన్‌లో ఏడు నుంచి 17 శాతం ప్రజలు మాత్రమే యాంటీబాడీలను ఏర్పరచుకున్నారు. తీవ్రంగా ప్రభావితమైన న్యూయార్క్‌ నగర జనాభాలో 20 శాతమే యాంటీబాడీలు కలిగి ఉన్నట్లు తేలింది. కొవిడ్‌కు కేంద్రమైన వుహాన్‌లోనూ సెరోలజీ పరీక్షల్లో 10 శాతమే యాంటీబాడీలు కలిగి ఉన్నారని తెలిసింది. ప్రపంచం ఇంకా 'హెర్డ్‌ ఇమ్యూనిటీ'ని సాధించలేదన్నదే ఈ లెక్కల అర్థం. తక్కువ మరణాలను నమోదు చేసిన ఇజ్రాయెల్‌ అధ్యయనంలో యాంటీబాడీలతో ఉన్న ఇజ్రాయెలీలు ఒకటి నుంచి పది శాతం వరకేనని తేలింది. ప్రస్తుతం మన దేశంలో చాలామందికి యాంటీబాడీ పరీక్షలు నిర్వహించడం ఒక్కటే మార్గం. ఇప్పట్లో టీకా వచ్చే దాఖలాలు లేవు. కనుక ప్రభుత్వం ఇచ్చిన ఆంక్షల సడలింపును ప్రజలు దుర్వినియోగపరచరాదు. స్వీయ నియంత్రణలు ఎంతో అవసరం. సర్కారు మార్గదర్శకాలను విధిగా పాటించడమే ప్రాణ రక్షణకు ప్రజల ముందున్న ఏకైక మార్గం!

ఇదీ చూడండి: 'భౌతిక దూరమే' ఆ గిరిజనుల సంప్రదాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.