ETV Bharat / opinion

పేదరికం పడగనీడలో.. గిడసబారుతున్న భారతం

author img

By

Published : Sep 22, 2021, 6:42 AM IST

పోషకాహార లోపం(malnutrition) భారత్‌కు పెను సవాలు విసురుతోంది. 19కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) 2020 నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా మూడో వంతు పిల్లలకు పౌష్టికాహారం(malnutrition in india statistics 2021) అందడంలేదని గతంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు రేషన్‌ సరకులను క్రమం తప్పకుండా అందించాలి. అప్పుడే, పోషకాహారలోపాలను అధిగమించడానికి వీలవుతుంది.

malnutrition
గిడసబారుతున్న భారతం

పౌరులు ఆరోగ్యవంతంగా ఎదిగితేనే ఏ దేశమైనా ఆర్థికంగా సుసంపన్నమవుతుంది. పోషకాహార లోపం భారత్‌కు(Childhood Malnutrition in India) పెను సవాలు విసురుతోంది. ప్రపంచంలో అన్ని రకాల సమస్యలకు పేదరికమే కారణమని, 2030 నాటికల్లా దానికి చరమగీతం పాడాలని పేర్కొంటూ ఐక్యరాజ్య సమితి 2016లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలోనే కరోనా(Corona virus) విజృంభించింది. ఫలితంగా పేదలు, సామాన్యుల పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. కొలువులు కోల్పోయి, ఆదాయాలు తెగ్గోసుకుపోయి ఎంతో మంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోయారు. పౌష్టికాహారానికి దూరమయ్యారు(malnutrition). చిన్నారులపై ఈ ప్రభావం అత్యధికంగా ఉంది. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకొని పౌష్టికాహార ప్రాధాన్యాన్ని తెలియజెప్పేందుకు సెప్టెంబరు నెలను పోషకాహార మాసంగా పాటించాలని ప్రధాన నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు.

పేదరికం పడగనీడలో...

భారత్‌లో 19కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) 2020 నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా మూడో వంతు పిల్లలకు(malnutrition in children) పౌష్టికాహారం అందడంలేదని గతంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. బలవర్ధకమైన ఆహారం అందక 38శాతం చిన్నారులు గిడసబారిపోతున్నారు. అయిదేళ్లలోపు బాలల్లో 34.7శాతం వయసుకు తగ్గ ఎత్తు పెరగడం లేదు. ఎత్తుకు తగిన బరువు లేనివారు 17.3శాతం. పోషకాహారం కరవై దేశంలో ఏటా ఏడు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కడుపునిండా ఆహారం కరవై ఏటా లక్ష మంది బాలలు తనువు చాలిస్తున్నారు. దేశంలో 2020 నవంబరు నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు బాలలు 9,27,606 మంది తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 11,210; తెలంగాణలో 9,045గా నమోదైంది. దేశంలోని 11-14 సంవత్సరాలలోపు బాలికల్లో 43శాతం రక్తహీనతతో బాధపడుతున్నట్లు నాలుగో దఫా జాతీయ కుటుôబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా అయిదు సంవత్సరాలలోపు బాలికల్లో 36శాతం పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 15-49 ఏళ్ల వయసు మహిళల్లో(malnutrition in women's in india) 51.4శాతం రక్తహీనతతో కునారిల్లుతున్నారు. తల్లుల్లో పోషకాహార లోపం వల్లే పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. గతేడాది దేశంలో పేదరికం 7.9శాతం మేర తగ్గుతుందని తొలుత అంచనా వేశారు. కరోనా కారణంగా పరిస్థితి తారుమారైంది. మహమ్మారి రెండో దశ ప్రారంభమైన తరవాత భారత్‌లో దాదాపు 23 కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోయినట్లు అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం వెల్లడించింది. శ్రమజీవుల ఆదాయం గతంలో కంటే సగటున 17శాతం తగ్గిపోయిందని వెల్లడించింది. ఉపాధి, ఉద్యోగావకాశాలు కుంగి, పేదరికం పెరుగుతున్న కారణంగా లక్షల మంది పోషకాహారానికి నోచుకోలేక పోతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, దేశంలోని సుమారు 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా దాదాపు 11.41 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారు. వాటి ద్వారా బాలలు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు పాలు, కోడిగుడ్లు, ఇతర పోషక విలువలున్న ఆహారాన్ని పక్కాగా అందించాలి.

ప్రభుత్వాల చొరవే కీలకం

పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది నాటికి పిల్లల్లో ఎదుగుదల లోపాలను ఆరు శాతం, బాలికలు కిశోర బాలికలు బాలింతల్లో రక్తహీనతను తొమ్మిది శాతం తగ్గించాలని కేంద్రం లక్షించింది. ఇంటింటికీ వెళ్ళి అవసరమైన వారికి పోషకాహారాన్ని అందిస్తేనే ఈ లక్ష్యం నెరవేరుతుంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, మహిళలను గుర్తించాలని, వారి ఆరోగ్యాన్ని పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌ సాయంతో పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు రాజకీయపరమైన పంతాలకు పోకుండా పోషకాహార లోపం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సామాజిక వంటశాలలను ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా 11.35 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద 9.17కోట్ల మంది విద్యార్థులకు పోషకాహారం అందేది. కరోనా కారణంగా బడులు మూతపడటంతో వారంతా పౌష్టికాహారానికి దూరమయ్యారు. ప్రస్తుతం విద్యాసంస్థలు తెరచుకున్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి. బడికి దూరమైన పిల్లలను మళ్ళీ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు రాగిజావ, పల్లీ పట్టీలు అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని పటిష్ఠంగా అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోరుముద్ద పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు రేషన్‌ సరకులను క్రమం తప్పకుండా అందించాలి. అప్పుడే, పోషకాహారలోపాలను అధిగమించడానికి వీలవుతుంది.

- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.