ETV Bharat / opinion

అసెంబ్లీ 'పంచ'తంత్రం.. పార్టీల సమరశంఖం - అసోం అసెంబ్లీ ఎన్నికలు

పుదుచ్చేరి, అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ్‌ బంగ శాసనసభల్లోని మొత్తం 824 స్థానాలకు 2.7 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో 18.68 కోట్లమంది ఓటర్లు తమ ప్రతినిధుల్ని ఎన్నుకొనే ఈ మహాక్రతువు- మినీ సార్వత్రిక సమరాన్నే తలపిస్తోంది. మరి ఈ మహా సమరంలో కమలం పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుంది? కాంగ్రెస్​ పరిస్థితి ఏంటి?

Five assembly polls
ఈ 'పంచ'తంత్రం.. అందరికీ పెద్ద పరీక్షే!
author img

By

Published : Feb 27, 2021, 5:31 AM IST

Updated : Feb 27, 2021, 5:46 PM IST

న్నికల్లో పార్టీల జయాపజయాలు జనాధీనమే అయినా, 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌' వంటి నినాదాలతో ప్రచారాన్ని హోరెత్తించి జనాదేశ్‌ (ప్రజాతీర్పు)ను గణనీయంగా ప్రభావితం చేసే కళ- మోదీ, అమిత్‌ షాల సారథ్యంలోని కమల దళానికి కొట్టినపిండి. బూత్‌ స్థాయిదాకా ముందస్తు వ్యూహాలతో స్థానిక రాజకీయాల్ని వేడెక్కించి రాజకీయ ప్రత్యర్థుల కోటల్ని కుమ్మి కూలగొట్టే భాజపా దూకుడు- వచ్చే అయిదు శాససభల ఎన్నికల రంగాన్ని ఉద్విగ్నభరితం చేస్తోంది. వచ్చే నెల సరిగ్గా ఇదే రోజుతో మొదలుపెట్టి ఏప్రిల్‌ 29తో పోలింగ్‌ క్రతువును ముగించి మే నెల రెండున ఫలితాలు వెల్లడించనున్నట్లు నిర్వాచన్‌ సదన్‌ షెడ్యూలు ప్రకటించింది. పుదుచ్చేరి, అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ్‌ బంగ శాసనసభల్లోని మొత్తం 824 స్థానాలకు 2.7 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో 18.68 కోట్లమంది ఓటర్లు తమ ప్రతినిధుల్ని ఎన్నుకొనే ఈ మహాక్రతువు- మినీ సార్వత్రిక సమరాన్నే తలపిస్తోంది.

దక్షిణాదిన మూడు శాసనసభలకూ ఏప్రిల్‌ ఆరో తేదీనే పోలింగ్‌ తెమిలిపోనుండగా, లోగడకంటే ఒక విడత అధికంగా పశ్చిమ్‌ బంగకు ఎనిమిది దశల్లో ఎన్నికల నిర్వహణపై ఘాటు విమర్శలు చెలరేగుతున్నాయి.

తమిళనాట..

జయలలిత, కరుణానిధి వంటి దిగ్దంతులు లేకుండా తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో, అధికార అన్నాడీఎంకే సైదోడుగా బరిలోకి దిగుతున్న కమలం పార్టీ- గత మూడు ఎలెక్షన్లకు భిన్నంగా ఈసారైనా బోణీ కొడుతుందేమో చూడాలి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి సాధించిన అప్రతిహత విజయం ఈసారీ తమిళనాట సూర్యుడే ఉదయిస్తాడన్న అంచనాల్ని పెంచుతున్నా- కమల్‌హాసన్‌, శశికళల పార్టీలు ప్రజాక్షేత్రంలో ఏ మేరకు ప్రభావం చూపగలవన్నదే అంతిమ ఫలితాన్ని నిర్ణయించనుంది. చేతికి ఎముకేలేని వరదానాలకు పెట్టింది పేరైన తమిళనాట- పార్టీల సృజన పౌరుషం ఏ కొత్త రికార్డుల్ని నెలకొల్పుతుందో చూడాలి!

ఈసారీ అంతేనా..

అధికార పక్షానికి వెంటనే మరోసారి అవకాశమిచ్చే ఆనవాయితీ లేని కేరళలో- దశాబ్దాలుగా ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌లే వంతులవారీగా అందలమెక్కుతున్నాయి. యూపీ తరవాత అత్యధికంగా సంఘ్‌ శాఖలున్నది కేరళలోనే అయినా క్రితంసారి 10.6శాతం ఓట్లు, ఒకే ఒక్క సీటుతో భాజపా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవలి స్థానిక సమరంలో ఎల్‌డీఎఫ్‌ ఘన విజయం దరిమిలా తాజాగా అరేబియా సంద్రంలో రాహుల్‌ గాంధీ ఈత విన్యాసం రాష్ట్రంలో యూడీఎఫ్‌ ఎదురీతను స్ఫురింపజేస్తుంటే, 'మెట్రో' శ్రీధరన్‌ చేరికతో భాజపా రెండంకెల సీట్లపై కన్నేస్తోంది.

'హస్త'గతమయ్యేనా..

తరుణ్‌ గొగోయ్‌ సారథ్యంలో హ్యాట్రిక్‌ విజయాలతో పదిహేనేళ్లు అసోమ్‌ను ఏలిన కాంగ్రెస్‌ను 2016లో కంగుతినిపించి దాదాపు 30 శాతం ఓట్లు, 60 సీట్లు సాధించిన భాజపా పునరధికారానికి శక్తియుక్తులన్నీ ఒడ్డుతోంది. జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) చుట్టూ దట్టంగా ముసురుకొన్న పెను వివాదాలు, అవి పెంచుతున్న విద్వేషాల నేపథ్యంలో అసోం ఓటర్ల తీర్పు ఎంతో కీలకం కానుంది.

దీదీకా.. మోదీకా..

1979నుంచి 2011దాకా పశ్చిమ్‌ బంగను ఏకబిగిన ఏలిన వామపక్ష కూటమి సర్కారును సాగనంపి 38.9శాతం ఓట్లు, 184 సీట్లతో తొలిసారి అధికారం చేపట్టిన మమతా దీదీ- 2016లో అంతకుమించి సాధించిన విజయం వామపక్షానికి ప్రతిపక్ష హోదానూ గల్లంతు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 40శాతంపైగా ఓట్లు, 18 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొన్న భాజపా- అసెంబ్లీ ఎన్నికలకు ముందే దీదీ దివాణం ఖాళీ అయ్యేలా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ గట్టి సవాలు రువ్వుతోంది. ఓటుబ్యాంకులు చేజారకుండా కాచుకొనే క్రమంలో దినసరి కూలీల వేతనాల పెంపు సహా అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తున్న మమత- ఒకవంక భాజపాతోను, మరోపక్క లెఫ్ట్‌- కాంగ్రెస్‌ కూటమితోనూ సాగిస్తున్న పోరు జాతీయ రాజకీయ వాతావరణాన్నే వేడెక్కిస్తోంది. ఎన్నికల బరిలోని పార్టీలకంటే- కొవిడ్‌ మహమ్మారి మాటు వేసిన తరుణంలో ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా స్వేచ్ఛగా సక్రమంగా ఎలెక్షన్లు నిర్వహించడం ఈసీ దక్షతకే పెద్ద పరీక్ష కానుంది!

ఇదీ చూడండి: మారిన రాజకీయ ముఖచిత్రం- 'పంచ'తంత్రంలో గెలుపెవరిది?

Last Updated : Feb 27, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.