ETV Bharat / opinion

పల్లె ప్రాంతాల్లో కరోనా కట్టడి ముఖ్యం! - villagers quarantine technics

కరోనా రెండో దశ విస్తరిస్తున్న సమయంలోనూ నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలు, కొవిడ్‌ వార్డులు కొనసాగుతూ సేవలు అందిస్తున్నాయి. అయితే, పల్లెల్లో ఇలాంటి సదుపాయాలు లేకపోవడం గ్రామీణులను ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాధిగ్రస్తులను గ్రామాల నుంచి, ఇళ్లలోంచి బలవంతంగా పంపించివేసే పరిస్థితులు లేకున్నా, వారు ఇళ్లలో ఉంటే తమకూ సోకుతుందేమోనన్న వారిని భయం వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు.. గ్రామీణ ప్రాంతాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

quarantine centers, isolation centers
ఐసొలేషన్‌ కేంద్రాలు
author img

By

Published : May 20, 2021, 8:14 AM IST

మొదటి దశలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. ప్రస్తుత రెండో దశలో చాలా గ్రామాలకు పాకినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో మొదటి దశలో ఒక్క కేసూ నమోదవ్వకపోగా, రెండో దశలో 10 నుంచి 50 దాకా పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయ్యాయి. రెండో దశ వేగంగా విస్తరిస్తుండటం ఒక కారణమైతే, గ్రామీణ ప్రాంతాల్లో సత్వరం మెరుగైన వైద్య సేవలు అందకపోవడం మరో కారణం. వైరస్‌ బారినపడిన బాధితులు ఐసొలేషన్‌లో ఉండేందుకు తగిన వసతులు లేకపోవడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. 'హోం క్వారంటైన్‌'లో ఉండేందుకు ఇళ్లలో తగిన గదులు లేకపోవడంతో కరోనా బాధితులు వ్యవసాయ పొలాలు, ఊరి బయట గుడిసెల్లో, చెట్లపైన తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడే క్వారంటైన్‌లో ఉంటున్నారు.

సదుపాయాలు లేనందున..

కరోనా మొదటి దశ తొలినాళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. బాధితులు ఇళ్లలో ఉండకుండా ఈ కేంద్రాలకు వెళ్లాలని, తద్వారా ఇతర కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగును మహమ్మారి బారిన పడకుండా కాపాడవచ్చని సూచించాయి. ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు సైతం ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. కరోనా రెండో దశ విస్తరిస్తున్న సమయంలోనూ నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలు, కొవిడ్‌ వార్డులు కొనసాగుతూ సేవలు అందిస్తున్నాయి. అయితే, పల్లెల్లో ఇలాంటి సదుపాయాలు లేకపోవడం గ్రామీణులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా బాధితులు పట్టణ ప్రాంతాల్లోని ఐసొలేషన్‌ కేంద్రాలు, కొవిడ్‌ వార్డులకు వెళ్లలేక ఇళ్లలో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా వైరస్‌ బాధితుల కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారికీ సోకే ప్రమాదం నెలకొంటోంది.

భయం మాత్రం తొలగలేదు..

మొదటి దశలో కరోనా సోకిన వారిని కనీసం గ్రామాల్లోకీ రానీయలేదు. కుటుంబ సభ్యులు సైతం ఇళ్లలోకి రానీయకుండా అడ్డుకున్న ఉదంతాలున్నాయి. ప్రస్తుత రెండో దశలో వ్యాధివ్యాప్తిపై గ్రామీణులకు కొంత అవగాహన కలిగి, ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినా, తమకు ఎక్కడ సోకుతుందోనన్న భయం మాత్రం తొలగలేదు. వ్యాధిగ్రస్తులను గ్రామాల నుంచి, ఇళ్లలోంచి బలవంతంగా పంపించివేసే పరిస్థితులు లేకున్నా, వారు ఇళ్లలో ఉంటే తమకూ సోకుతుందేమోనన్న భయం వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రస్తుత రెండో దశలోనైనా గ్రామీణ ప్రాంతాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రామాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పాఠశాలల భవనాలను ఐసొలేషన్‌ కేంద్రాలుగా వినియోగిస్తే బాధితులకు ఊరటగా ఉంటుంది. గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బడులను ఐసొలేషన్‌ కేంద్రాలుగా మారిస్తే, బాధితులకు ఉపశమనం దక్కడంతోపాటు, కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా- సామాజిక భవనాలు, రైతు వేదికలు వంటి నిర్మాణాలనూ ఐసొలేషన్‌ కేంద్రాలుగా మారిస్తే కరోనా బారిన పడిన రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే గ్రామాల్లో కరోనా సంబంధిత విధుల్లో పాల్గొంటున్న పీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతోపాటు గ్రామ కార్యదర్శులు తదితర సిబ్బందికి ఐసొలేషన్‌ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించి, బాధితులకు ఆరోగ్య సలహాలు, సూచనలు, చికిత్సలు అందించవచ్చు.

హరియాణా భేష్​..

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి హరియాణా ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. కొంతకాలంగా ఆ రాష్ట్రంలోని పల్లె ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రతి జిల్లాలో కనీసం 50 గ్రామాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లోని పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అందుబాటులో ఉన్న ఇతర భవనాల్లో అధికారులు పడకలు, వైద్య సదుపాయాలు కల్పించారు. పది వేల జనాభా ఉన్న గ్రామాలకు రూ.10 వేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు రూ.50 వేల వరకు నిధులను కేటాయించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్ని రాష్ట్రాల్లోని స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు సొంత డబ్బులతో గ్రామాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ కరోనా రోగులకు ఉచిత భోజనం, మందులు, వసతి సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఇదేక్రమంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రామాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి నిధులను కేటాయిస్తే, కరోనా వ్యాప్తికి వేగంగా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది.

- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

ఇదీ చూడండి: పల్లెలపై కొవిడ్‌ పడగ.. వేలల్లో సిబ్బంది కొరత

ఇదీ చూడండి: 'కరోనా దేవి'కి 48 రోజులపాటు ప్రత్యేక పూజలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.