ETV Bharat / opinion

ఆన్​లైన్ దిశగా ఉన్నత విద్య- ముందుకెళ్లే మార్గమిదే! - భారత్​లో విద్యావిధానం

విద్యా సంవత్సరం ప్రారంభమై రెండునెలలు గడుస్తున్నా, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రెండు మూడు నెలల్లో వైరస్‌ ప్రభావం తగ్గి, విద్యాసంస్థలు పునఃప్రారంభమైనా పరిస్థితులు చక్కబడటానికి ఒకట్రెండు సంవత్సరాలైనా పడుతుంది. ఈలోపు విద్యాసంవత్సరాన్ని విద్యార్థి కోల్పోకుండా ఉండాలంటే ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తగు చర్యలు తీసుకోవాలి. డిజిటల్‌ విద్యావిధానం, ఆన్‌లైన్‌ బోధన, ఈ-లెర్నింగ్‌లపై దృష్టి సారించాలి.

ONLINE CLASSES
ఆన్​లైన్ దిశగా ఉన్నత విద్య
author img

By

Published : Aug 6, 2020, 7:41 AM IST

కరోనా వేళ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఇతర ఉన్నత విద్య కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు జరపలేని దుస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. ముఖ్యంగా చివరి సంవత్సరం విద్యార్థుల భవితపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పుడీ పరీక్షల నిర్వహణ అక్షరాలా కత్తిమీద సామే. పరీక్షలు నిర్వహించాల్సిందేనంటున్న యూజీసీ మాత్రం మార్గదర్శకాలు ఇవ్వలేదు. 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండునెలలు గడుస్తున్నా, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. రెండు మూడు నెలల్లో వైరస్‌ ప్రభావం తగ్గి, విద్యాసంస్థలు పునఃప్రారంభమైనా పరిస్థితులు చక్కబడటానికి ఒకట్రెండు సంవత్సరాలైనా పడుతుంది. ఈలోపు విద్యాసంవత్సరాన్ని విద్యార్థి కోల్పోకుండా ఉండాలంటే ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తగు చర్యలు తీసుకోవాలి. డిజిటల్‌ విద్యావిధానం, ఆన్‌లైన్‌ బోధన, ఈ-లెర్నింగ్‌లపై దృష్టి సారించాలి.

ప్రసుత విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల జ్ఞాన సముపార్జన దిశను మార్చాలి. నూతన జాతీయ విధ్యావిధానం 2019లో సైతం డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. మైదానం ఆటలనుంచి ఆన్‌లైన్‌ గేమ్స్‌ వైపు చూస్తున్నట్లే, విద్యార్థుల ఉత్సుకతకు తగ్గట్లు ఉన్నత విద్యలోనూ ‘ఆన్‌లైన్‌’ మార్పులు అవసరం. వాస్తవవానికి ఆన్‌లైన్‌ విద్య విధానం శ్రేయస్కరం కాదు. విద్యార్థి సామర్థ్యాల మేరకు బోధించే నైపుణ్యాలు అధ్యాపకులకే ఉంటాయి. గురువు లేని విద్య విద్యే కాదు. అది విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడదు. ఉపాధ్యాయుడు, పుస్తకాలు లేకుండా విద్యార్థి రాయలేడు. ఊహాశక్తినీ పెంచుకోలేడు. సామర్థ్యాల గుర్తింపు, అందుకు అనుగుణంగా దిశానిర్దేశమూ కొరవడుతోంది. కేవలం విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థిని ఆదుకోవడానికి మాత్రమే ‘ఆన్‌లైన్‌’ పద్ధతిని ఆచరించడం అవసరం.

60 శాతం గ్రామీణ విద్యార్థులే..

ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో కేవలం 13 సంవత్సరాలకే విద్యార్థి మానసిక పరిపక్వత వృద్ధి చెందుతుంది. ఆ వయసు నాటికే అతడు శారీరక, మానసిక పరిపక్వతతోపాటు ఆధునిక పోకడలపై ఆసక్తి చూపుతున్నాడు. కంప్యూటర్‌, సెల్‌ఫోన్లు వంటివాటిపై మక్కువ చూపుతున్నాడు. అందులో భాగంగానే ఆన్‌లైన్‌ గేమ్స్‌, ఆన్‌లైన్‌ చాటింగ్‌, సామాజిక మాధ్యమాల వాడకం వంటివి మన దేశంలో రోజురోజుకూ వృద్ధి చెందుతున్నాయి. అంతేకాదు, బైజూస్‌ వంటి ఆన్‌లైన్‌ విద్యాసంస్థలు సైతం పెరుగుతున్నాయి.

ఒక విద్యార్థి ఉన్నత విద్య దశకు చేరుకునేనాటికి అతడి వయసు 18 సంవత్సరాలు ఉంటుంది. అప్పటికే అంతర్జాలం, ఆన్‌లైన్‌లను ఉపయోగించడంపై వంటి విషయాలపై అవగాహనా కలిగిఉంటున్నాడు. కాబట్టి, డిజిటల్‌ విద్యావిధానం ద్వారా పాఠ్యాంశాలు బోధించి విద్యాసంవత్సరం వృథా కాకుండా చూడాలి. రెండు తెలుగు రాష్టాల్లో సుమారు 10 లక్షలమంది విద్యార్థులు డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ సహా ఇతర కోర్సుల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. వారిలో సుమారు 60శాతం గ్రామీణ విద్యార్థులే.

మార్పులు అవసరం..

ఇక జియో పుణ్యమా అని ఇప్పుడు దాదాపు అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉంది. కాబట్టి విద్యార్థులకు కావలసిన లాప్‌టాప్‌లు ప్రభుత్వం లేక కళాశాలలు సబ్సిడీ రూపంలో అందించే ఏర్పాటు చేయాలి. సెమిస్టర్‌ పనిదినాలు తగ్గించాలి. అంతేకాకుండా, విద్యార్థుల సిలబస్‌లోనూ మార్పులు చేయాలి. విద్యార్థికి అవసరమైన కీలక పాఠాలనే పొందుపరచి పని దినాలకు తగ్గట్లు సిలబస్‌ తగ్గించాలి. అలాగే పరీక్షా విధానాల్లో మార్పులు అవసరం. కేవలం ఆబ్జెక్టి్‌ పద్ధతిలో ప్రశ్నపత్రాల్ని రూపొందించాలి. ఆలా చేయడం ద్వారా విద్యార్థికి అత్యంత ముఖ్యమైన విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడవచ్ఛు అదేసమయంలో భవిష్యత్తులో ఆన్‌లైన్‌ విద్యా విధానం ప్రవేశపెట్టడానికి దీన్ని ఓ 'పైలట్‌ స్టడీ'గా భావించవచ్చు.

ఇక డిజిటల్‌ బోధనకు అధ్యాపకులను సమాయత్తం చేయాలి. అధ్యాపకులు బోధించే పాఠ్యాంశంపై 'పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌' ఇచ్చేలా సాంకేతిక పరికరాలను తయారు చేయించాలి. కళాశాలలో డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేయాలి. తెలుగు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లు ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 'టిశాట్‌' ద్వారా గురుకుల కళాశాల విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు అందిస్తోంది. అన్ని కళాశాలలు రానున్న రెండు సెమిస్టర్‌లలో ఆన్‌లైన్‌ విద్యను ప్రవేశ పెట్టాలి. అందుకు అనుగుణంగా విద్యార్థులను మానసికంగా, సాంకేతికంగా సిద్ధపరచాలి. ఈ చర్యల ద్వారా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉన్నతవిద్యను ముందుకు నడిపించవచ్చు!

(రచయిత- ప్రొఫెసర్‌ బి.వెంకటేశ్వర్లు)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.