ETV Bharat / opinion

గిరిజన విద్యకు నూతన వెలుగులు

సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన సమూహాల్లో భాగమైన గిరిజనుల్లో స్థూల నమోదు శాతం ప్రాథమికంగా పూర్తిస్థాయిలో ఉన్నా, సెకండరీ స్థాయికి వచ్చేసరికి 73.5శాతం, ఉన్నత స్థాయిలో కేవలం 15.4శాతమే కావడం గమనార్హం. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థి దశలోనే వివాహాలు జరగడంతో విద్యార్థినులు ఉన్నత చదువులకు నోచుకోవడంలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఇటీవలే ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యావిధానం అమలు ద్వారా ఎదురయ్యే అనేక సమస్యలు సవాళ్లను దీటుగా ఎదుర్కొని అందరికీ విద్యను సాకారం చేయడం అవసరం.

education in Tribal places is still a challenging role for the government
గిరిజన విద్యకు నూతన వెలుగులు
author img

By

Published : Aug 29, 2020, 6:40 AM IST

సమాజ అభివృద్ధి అనేది ఆ దేశ పారిశ్రామిక, ప్రజాస్వామ్య, విద్యా విప్లవం మీద ఆధారపడి ఉంటుందని సామాజిక శాస్త్రవేత్తలైన పారసన్స్‌, ప్లాట్‌ అభిప్రాయపడ్డారు. కస్తూరి రంగన్‌ నేతృత్వంలో రూపొందిన నూతన జాతీయ విద్యావిధానం(2020) సైతం ఈ విషయాన్ని గుర్తిస్తూ- 2035 నాటికి పూర్తిస్థాయిలో స్థూల నమోదు శాతం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించింది. భారత విద్యారంగంలో 2016-17 లెక్కల ప్రకారం స్థూల నమోదు ప్రాథమిక స్థాయిలో 99.21శాతం, మాధ్యమిక స్థాయిలో 80.01శాతమే. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన సమూహాల్లో భాగమైన గిరిజనుల్లో ఈ స్థూల నమోదు శాతం ప్రాథమికంగా పూర్తిస్థాయిలో ఉన్నా, సెకండరీ స్థాయికి వచ్చేసరికి 73.5శాతం, ఉన్నత స్థాయిలో కేవలం 15.4శాతమే కావడం గమనార్హం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత నిర్బంధ విద్య, మధ్యాహ్న భోజన పథకం, సర్వ శిక్ష అభియాన్‌ వంటి పథకాలు అమలు చేస్తున్నా- చదువు మానేసేవారి సంఖ్య తగ్గడంలేదు. దేశంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో అధికార భాషకు సంబంధించిన పాఠ్యాంశాల బోధన ఉండటంతో ప్రాథమిక స్థాయిలో గిరిజన విద్యార్థులు- ఇతర విద్యార్థులతో పోటీ పడలేక విద్యకు దూరమవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థి దశలోనే వివాహాలు జరగడంతో విద్యార్థినులు ఉన్నత చదువులకు నోచుకోవడంలేదు. ఈ అవరోధాలను అధిగమించడం కోసం నూతన జాతీయ విద్యా విధానం సమర్థ, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కొంతమంది విద్యా కౌన్సెలర్లను, సామాజిక కార్యకర్తలను, అంకిత భావం కలిగిన వ్యక్తులను నియమించుకోవాలని పేర్కొంది. వీరు కేవలం బడి మానేసే పిల్లలకే కాక చదువులో వెనకబడిన వారికి సైతం కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా- వారిలో మనో బలాన్ని నింపి హాజరు శాతం పెంచగల వీలుంది. జాతీయ దూరవిద్య సంస్థ(ఎన్‌ఐఓఎస్‌)ను బలోపేతం చేసి విస్తరించడంతో పాటు స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ను స్థానిక భాషల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యంతో సాధారణ విద్యాసంస్థలకు ప్రత్యామ్నాయమైన గురుకులాలు, పాఠశాలలు, మదార్సాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. వీటి ద్వారా హాజరు శాతాన్ని మెరుగు పరచవచ్ఛు అయితే నాణ్యమైన విద్య అందించడం మన ముందున్న పెద్ద సవాలు. ఈ కరోనా కష్టకాలంలో సాంకేతికతతో అంతగా పరిచయం లేని గిరిజనుల్లో ఈ చర్యలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయనేదీ వేచి చూడాలి. గిరిజనేతర ఆధ్యాపకులకు వారి భాష, సంస్కృతి, సంప్రదాయాలపై పట్టు లేకపోవడంవల్ల విద్యార్థులకు అధ్యాపకులకు మధ్య అగాధం ఏర్పడుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమ శాఖ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల ద్వారా 3-9 తరగతుల పిల్లలకు విద్యా నాణ్యతను పెంచేలా చేపట్టిన పునాది పథకాన్ని ఒక దిక్సూచిలా వీటికి అనుసంధానం చేయాలి. ఈ సంస్థల కృషి సఫలీకృతం కావాలంటే- వర్చువల్‌ విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో పాటు, వీటి గురించిన అవగాహన, పరిజ్ఞానం విద్యార్థులకు అధ్యాపకులకు శిక్షణ రూపంలో అందించాలి.

భారత రాజ్యాంగంలోని అధికరణ 350ఎ, దేబర్‌ కమిషన్‌ (1960), కొఠారీ కమిషన్‌ (1966) ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని సిఫార్సు చేశాయి. 1986లో వచ్చిన జాతీయ విద్యా విధానంలో ఇది ప్రతిబింబించింది. దాని కొనసాగింపుగా 2020 విద్యావిధానం మాతృ భాషను అయిదో తరగతి వరకు తప్పనిసరి చేయడమే కాకుండా- వీలైతే ఎనిమిది లేక అంతకుమించిన తరగతులకు పొడిగించాలనీ సూచించింది. దానికి అవసరమైన పాఠ్యప్రణాళికను జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ద్వారా తయారుచేయాలని ఆదేశించింది. భారత్‌లో 700కు పైగా ఉన్న గిరిజన సమూహాలు మాట్లాడే మాండలికాలకు నిర్దిష్ట భాషాస్వరూపం లేనందువల్ల ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేదీ సందేహాస్పదమే. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన- అంతరిస్తున్న భాషల పరిశోధనతో పాటు మిగతా గిరిజన మాండలికాలకు లిపిని తయారు చేయడం ద్వారా కొంతవరకు ఈ సమస్యను అధిగమించవచ్ఛు నూతన జాతీయ విద్యావిధానం అమలు ద్వారా ఎదురయ్యే అనేక సమస్యలు సవాళ్లను దీటుగా ఎదుర్కొని అందరికీ విద్యను సాకారం చేయడం అవసరం. నెహ్రూ అభిలషించిన పంచశీల గిరిజనాభివృద్ధి భావనను నిజం చేయగల మార్గమదే!

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌

(సోషల్‌ ఆంత్రోపాలజీ విభాగంలో సహాయ ఆచార్యులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.