ETV Bharat / opinion

కబళిస్తున్న ధూమపానం.. మానవాళికి పగాకు - ధూమపానం

దేశంలో పొగాకు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం ప్రపంచంలో 110 కోట్లమంది ధూమపాన ప్రియులుండగా, భారత్‌లో వారిసంఖ్య 10.6 కోట్లేనంటే నమ్మశక్యం కాదు. 2030 సంవత్సరం నాటికి పొగాకు సంబంధిత మరణాలు అత్యధికంగా ఇండియాలోనే నమోదవుతాయన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.

tobacco patients
ధూమపానం
author img

By

Published : Jun 1, 2021, 9:14 AM IST

విశ్వవ్యాప్తంగా 17కోట్లకు పైబడిన కేసులు, సుమారు 35 లక్షల మరణాలకు కారణభూతమైన నిశ్శబ్ద హంతకి కరోనా- యావత్‌ మానవాళినీ హడలెత్తిస్తోంది. పొగ తాగే అలవాటున్న వారిలో కొవిడ్‌ ముప్పు తీవ్రత 50 శాతం వరకు అధికంగా ఉంటుందంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ- పొగాకు వ్యసనాన్ని వదిలిపెట్టడమే శరణ్యమని తాజాగా పిలుపిచ్చింది.

ఆ మేరకు భారత్‌ సహా 29 దేశాల్లో ప్రత్యేక కార్యాచరణనూ అది ప్రతిపాదించింది. సిగరెట్‌, చుట్ట, బీడీల రూపేణా ధూమపానానిది; ఖైనా, గుట్కా, పాన్‌ మసాలా తదితరాల వినియోగానిది- భల్లూకం పట్టు. ప్రత్యక్షంగా పొగాకు వాడకంవల్ల, పరోక్షంగా పొగ పీల్చడం మూలాన ఏటా 82 లక్షల మంది దాకా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నట్లు లోగడే లెక్కకట్టిన డబ్ల్యూహెచ్‌ఓ 'క్విట్‌ టొబాకో' నినాదం ప్రపంచ దేశాలన్నింటా మార్మోగాలని నేడు అభిలషిస్తోంది.

110 కోట్లమంది..

అధికారిక గణాంకాల ప్రకారం ప్రపంచంలో 110 కోట్లమంది ధూమపాన ప్రియులుండగా, భారత్‌లో వారిసంఖ్య 10.6కోట్లేనంటే నమ్మశక్యం కాదు. పరోక్షంగా పొగపీలుస్తూ హానికర దుష్పరిణామాల బారినపడి బలైపోతున్నవారెందరో సరైన లెక్కలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ధూమరహిత పొగాకు ఉత్పత్తుల వాడకందారులు దాదాపు 37కోట్లలో 20కోట్ల మంది వరకు ఇండియాలోనే పోగుపడ్డారంటున్నారు. నికొటిన్‌తోపాటు ఏడువేల రకాల విషతుల్యాలకు నెలవైన పొగాకు వినియోగం మూలాన క్యాన్సర్లు, గుండెజబ్బులు, శ్వాసకోశవ్యాధులు పెచ్చరిల్లుతున్న దేశం మనది. రోజుకు ఒక్క సిగరెట్‌ కాల్చే వ్యక్తుల్లోనూ గుండెజబ్బులు, పక్షవాతం ముప్పు తీవ్రతరమవుతున్నట్లు లండన్‌ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం గతంలోనే నిగ్గుతేల్చింది. ఇప్పుడా జాబితాకు కొవిడ్‌ రిస్క్‌ జతపడిన దృష్ట్యా- ధూమపాన వ్యసనాన్ని దూరం చేసేందుకు దేశదేశాల్లో ప్రత్యేక 'టూల్‌కిట్‌' పంపిణీని పట్టాలకు ఎక్కించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రణాళిక రచిస్తోంది. సమస్య మూలాల్నీ స్పృశిస్తేనే, పొగాకుపై పోరు లక్ష్యాన్ని ఛేదిస్తుంది!

అత్యధికంగా ఇండియాలోనే..

పొగాకు పరిశ్రమపై లోతైన అధ్యయనాలు, అంతిమంగా మానవ సమాజానికి కష్టనష్టాలు అనివార్యమని దశాబ్దాల క్రితమే హెచ్చరించాయి. దీటైన చర్యలే కొరవడ్డాయి. 2030 సంవత్సరం నాటికి పొగాకు సంబంధిత మరణాలు అత్యధికంగా ఇండియాలోనే నమోదవుతాయన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. దేశంలో గుట్కా వ్యసనానికి బానిసలైనవారిలో ఎకాయెకి 90శాతం దాకా క్యాన్సర్‌ కోరలకు చిక్కి విలవిల్లాడుతుండగా- పొగాకు సంబంధిత ఆరోగ్య సమస్యలు సగటున ఏటా కోటిన్నర మందిని దుర్భర దారిద్య్రంలోకి నెట్టుకుపోతున్నాయి. బహిరంగ ప్రాంతాల్లో ధూమపాన నిషేధం, విద్యాసంస్థల చేరువలో వాటి ప్రకటనలపై ఆంక్షలు, పొగాకు ఉత్పత్తులపై పన్నుపోటు- ఇవే సరైన విరుగుడు మార్గాలుగా తలపోస్తూ ప్రభుత్వాలు ఏళ్లతరబడి నెట్టుకొచ్చేస్తున్నాయి.

ధూమపానమే ప్రధాన కారణం..

ఒక్కో సిగరెట్టుమీదా మూడున్నర రూపాయల పన్ను వడ్డన 30లక్షల మందిని ధూమపానానికి దూరం చేస్తుందంటూ జనాన్ని అమాత్యులు మభ్యపెడుతున్నారు. నోటి క్యాన్సర్లలో 80శాతానికి, క్షయవ్యాధి విజృంభణలో 40శాతానికి ధూమపానమే ప్రధాన కారణమవుతున్నప్పుడు పై పూత చికిత్సలకే ప్రభుత్వం పరిమితం కావడం అసంబద్ధం. ధూమపాన వ్యసనం, ఇతరత్రా పొగాకు ఉత్పత్తుల వినియోగం ఉచ్చునుంచి బాధితుల్ని వెలికి తీసుకురావడమెంత ముఖ్యమో, పొగాకు రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్ళించడమూ అంతే కీలకం.

ఉత్పత్తి కర్మాగారాల మూసివేత, దిగుమతులపై నిషేధంతోపాటు పొగాకు సంబంధిత జీవనాధారం కలిగిన వారందరూ వేరే దారి పట్టేలా ఉదార ప్రోత్సాహకాల్నీ చురుగ్గా అమలుపరచాలి. అణ్వాయుధాల ఉత్పాతం కన్నా అత్యంత ప్రమాదకారులుగా భ్రష్టుపడుతున్న పొగ ఉత్పత్తులకు ఉరి బిగిసినప్పుడే- ప్రజారోగ్యం కుదుటపడుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.