ETV Bharat / opinion

'స్వదేశీ' కార్యాచరణ ఏదీ?

author img

By

Published : Dec 29, 2020, 6:20 AM IST

ప్రధాని మోదీ కొన్ని నెలలుగా కంటున్న బంగారు కలే ఆత్మ నిర్భర్​ భారత్​. మాంద్యాన్ని వెన్నంటి కరోనా వైరస్‌ భీకర దాడిలో కకావికలమైన ఆర్థికానికి కొత్త ఊపిరులూదేలా దేశీయ వస్తూత్పాదనల వినియోగానికి తమవంతుగా ప్రజలు సన్నద్ధమే. అయితే నాణ్యమైన స్వదేశీ ఉత్పత్తుల్ని విరివిగా సరసమైన ధరలకు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వపరంగా చేయాల్సిందే ఎంతో ఉంది. ఏళ్లతరబడి పారిశ్రామికంగా నెలకొన్న మందభాగ్యాన్ని చెదరగొట్టేలా పెద్దయెత్తున వ్యవస్థాగత మరమ్మతులు, భావి సవాళ్లను అవకాశాలుగా మలచే దార్శనిక వ్యూహాలు... ఇవే భారతీయ వస్తూత్పాదనలకు ఇంటా బయటా గిరాకీని పెంపొందించగలుగుతాయి!

editorial-on-indias-position-in-atma-nirbhar-bharat-campaign
స్వదేశీ’ కార్యాచరణ ఏదీ?

కొవిడ్‌ మహా సంక్షోభాన్ని మహదవకాశంగా మలచుకొని తయారీ రంగంలో దిగ్గజశక్తిగా నిలదొక్కుకుని స్వయం సమృద్ధ భారత్‌ను అవతరింపజేయాలన్నది ప్రధాని మోదీ కొన్ని నెలలుగా కంటున్న బంగారు కల. అందుకు తగ్గట్లే, ఈ సంవత్సరం ఆఖరి 'మన్‌ కీ బాత్‌'లోనూ- ఆయన నోట మార్మోగిన నినాదం 'ఆత్మ నిర్భరత'. కొత్త ఏడాది సంకల్పాల్లో భాగంగా యావత్‌ జన బాహుళ్యం భారతీయుల శ్రమశక్తితో తయారైన వస్తూత్పాదనలనే వినియోగించాలన్న దీక్ష పూనాలని ప్రధానమంత్రి పిలుపిచ్చారు. అదే సమయంలో అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయీప్రమాణాలకు సరితూగే మేలిమి ఉత్పత్తుల తయారీకి పారిశ్రామిక సంస్థలు, విభాగాలు నిబద్ధం కావాల్సి ఉందనీ ఉద్బోధించారు. ఆ మేరకు సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లు, అంకుర పరిశ్రమలు తమవంతు పాత్రపోషణకు సంసిద్ధం కావాలనీ మోదీ నిర్దేశించారు! మాంద్యాన్ని వెన్నంటి కరోనా వైరస్‌ భీకర దాడిలో కకావికలమైన ఆర్థికానికి కొత్త ఊపిరులూదేలా దేశీయ వస్తూత్పాదనల వినియోగానికి తమవంతుగా ప్రజలు సన్నద్ధమే. నాణ్యమైన స్వదేశీ ఉత్పత్తుల్ని విరివిగా సరసమైన ధరలకు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వపరంగా చేయాల్సిందే ఎంతో ఉంది. ముందస్తు చెల్లింపులతోనే ముడిసరకు సరఫరా జరుగుతున్నదని, రవాణా ఛార్జీలు ఇంతలంతలై నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతున్నదని వాపోతున్న చిన్న సంస్థలు సరైన ఉద్దీపన కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నాయి. వాటిని ప్రభుత్వం సత్వరం ఆదుకుంటేనే- తయారీ రంగానికి, దేశార్థికానికి నవోత్తేజ పరికల్పనలో ముందడుగు పడినట్లు.

నిత్యావసరాల జాబితాలోకి రాని టెలివిజన్లు, ఖరీదైన ఫర్నిచర్‌ తదితరాల దిగుమతులపై ఆంక్షలు విధించే ప్రతిపాదన ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే వెలుగు చూసింది. స్వదేశీ స్ఫూర్తికి గొడుగుపడుతూ కేంద్రీయ పోలీస్‌ కల్యాణ్‌ భాండారాల (కేపీకేబీ)నుంచి వెయ్యి రకాలకుపైగా విదేశీ ఉత్పాదనల తొలగింపు దాదాపు ఏడు నెలలుగా అమలవుతోంది. దేశవ్యాప్తంగా అదే ఒరవడిని విస్తరింపజేయాలన్నది కేంద్ర సర్కారు అభిలాషగా ప్రస్ఫుటమవుతోంది. ఒక్క ఏడాది వ్యవధిలో దేశంలోని ఇంటింటి వ్యయం మొత్తం రూ.42 లక్షల కోట్లకు పైమాటేనన్న విశ్లేషణలు గతంలోనే వెలువడ్డాయి. మాంద్యం, కొవిడ్‌ నేపథ్యంలో వృద్ధిరేటు కుంగినా- 2025నాటికి ఒక్క ఎలెక్ట్రానిక్‌ ఉత్పత్తుల పరిశ్రమే రెండింతలై లక్షన్నర కోట్ల రూపాయలకు ఎగబాకుతుందన్న అంచనాలు ఇటీవలే వెలువడ్డాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారమే 2019లో వివిధ ఎగుమతుల్ని మించిపోయిన దిగుమతుల కారణంగా నమోదైన వాణిజ్య లోటు సుమారు రూ.12 లక్షల కోట్లు. దేశీయోత్పత్తులకు గిరాకీ పెంచే దీర్ఘకాలిక కార్యాచరణ పట్టాలకు ఎక్కితే- పరాధీనతా తగ్గుతుంది, భారతీయ పారిశ్రామిక క్రాంతిపుంజాలూ వెల్లివిరుస్తాయి. 'భారత్‌లో తయారీ'కి గట్టి ఊతమిస్తూ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలలో విడిభాగాల ఉత్పత్తి, తదుపరి అంచె విభాగాలతో వాటి అనుసంధానం, కీలక దశల్లో సహాయ వ్యవస్థల పరిపుష్టీకరణలపై కేంద్రం తక్షణం దృష్టి సారించాలి! నెత్తురు మండే శక్తులు నిండే అపార యువజనం భారత్‌కున్న సహజ బలిమి. చైనా జపాన్లతో పోలిస్తే భారతీయుల సగటు వయసు బాగా తక్కువగా 28 ఏళ్లేనని, పనిచేసే వయసులోని శ్రామికశక్తి జనాభాలో 64 శాతమన్న గణాంకాలు ధ్రువీకరిస్తున్న యథార్థమది. 'ఎంతగా చదివితే అంతగా నిరుద్యోగిత' అన్న చందాన గుల్లబారిన అవ్యవస్థను ప్రక్షాళించి నిపుణ శ్రామికుల శాతాన్ని గణనీయంగా పెంపొందించడం అత్యవసరం. ఏళ్లతరబడి పారిశ్రామికంగా నెలకొన్న మందభాగ్యాన్ని చెదరగొట్టేలా పెద్దయెత్తున వ్యవస్థాగత మరమ్మతులు, భావి సవాళ్లను అవకాశాలుగా మలచే దార్శనిక వ్యూహాలు... ఇవే భారతీయ వస్తూత్పాదనలకు ఇంటా బయటా గిరాకీని పెంపొందించగలుగుతాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.