ETV Bharat / opinion

రూటు మార్చిన ఇరాన్​.. భారత్​ను కాదని చైనాతో దోస్తి - చాబహర్​ పోర్టు

ఇరాన్​ రూటు మార్చింది. భారత్​ను కాదని చైనా గూటికి చేరింది. ఇరాన్‌-చైనా దేశాల మధ్య 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న 40 వేలకోట్ల డాలర్ల ఒప్పందం ఒకటి వేగంగా పట్టాలపైకి ఎక్కుతోంది. అదే సమయంలో చాబహార్‌-జహదేన్‌ రైలు ప్రాజెక్టు చేపట్టాలన్న భారత్‌ ప్రణాళిక ఆరంభం కాకుండానే బోల్తాపడిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇరాన్​ ఇంతటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకుంది? అసలు ఈ పరిస్థితులకు కారణమేంటి? ఇందులో అమెరికా పాత్ర ఎంత?

Editorial on downfall of India- Iran relations amid America pressure
రూటు మార్చిన ఇరాన్​.. భారత్​ను కాదని చైనాతో దోస్తి
author img

By

Published : Jul 21, 2020, 7:51 AM IST

ఆలస్యం అమృతం విషం- ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న సామెత. వాస్తవ ప్రపంచంలో దీన్ని అర్థం చేసుకోవాలంటే భారత్‌-ఇరాన్‌ సంబంధాలను చూడాలి. ఇరాన్‌-చైనా దేశాల మధ్య 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న 40 వేలకోట్ల డాలర్ల ఒప్పందం ఒకటి వేగంగా పట్టాలకు ఎక్కుతోందని ‘న్యూయార్క్‌టైమ్స్‌’ కథనం ప్రచురించింది. అదే సమయంలో చాబహార్‌-జహదేన్‌ రైలు ప్రాజెక్టు చేపట్టాలన్న భారత్‌ ప్రణాళిక ఆరంభం కాకుండానే బోల్తాపడిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇరాన్‌ మాత్రం 'ప్రాజెక్టులో కొంతభాగాన్ని సొంతంగా చేపడతాం. ఆ తరవాత భారత్‌ వచ్చి చేరొచ్చు' అంటోంది. మరోపక్క చైనాకు దగ్గరైన నేపాల్‌ కారణంగా తలెత్తిన సమస్యలను భారత్‌ ఇప్పటికే రుచిచూస్తోంది. జరుగుతున్న పరిణామాలు మనకు భవిష్యత్తులో రాబోయే చిక్కులను సూచిస్తున్నాయి.

అమెరికా వ్యూహం

అమెరికాలో చమురు ఉత్పత్తి పెరిగాక గల్ఫ్‌ దేశాలతో వ్యూహాత్మక అవసరాలు తగ్గిపోయాయి. ఆసియాపై దృష్టిపెట్టింది. ఇక్కడ అమెరికాకు పోటీఇచ్చే బలమైన శక్తి చైనా మాత్రమే. ఈ క్రమంలో డ్రాగన్‌తో పోరుకు భారత్‌ను పావుగా వాడుకోవాలని భావిస్తోంది. అవసరాల కోసం తమపై ఆధారపడేలా పావులు కదుపుతోంది. శత్రువులను ఆర్థికంగా చిదిమేయడానికి చేసిన 'కాట్సా' చట్టపరిధిలోకి ఇరాన్‌ను చేర్చింది. ఇరాన్ ‌నుంచి చమురు కొనుగోలు చేస్తే కఠిన ఆర్థిక ఆంక్షలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మన దేశం చమురు కోసం అమెరికా, దాని మిత్రదేశాలపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. తాజాగా అమెరికాలో వ్యూహాత్మక చమురు నిల్వలను ఏర్పాటు చేసుకోవడానికి భారత్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. ఎంతలేదన్నా అమెరికా నుంచి చమురు రావడంలో రవాణ ఖర్చు, కాలం అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. మరోపక్క 'కాట్సా' ఆంక్షలను డ్రాగన్‌ లెక్కచేయకుండా ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. అమెరికా ఆంక్షల దెబ్బకు ఆర్థికంగా కుదేలైన ఇరాన్‌ గత్యంతరం లేక ఇప్పుడు చైనా వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2016నాటి పర్యటనలో ప్రతిపాదించిన 40 వేలకోట్ల డాలర్ల ఒప్పందాన్ని ఇరాన్‌ చకచకా ముందుకు తీసుకెళ్తోంది. పీ5 ప్లస్‌ ఒన్‌తో అణుఒప్పందం తరవాత ఇరాన్‌ ఆర్థికంగా కొంత సౌకర్యంగా ఉండటంతో అప్పట్లో ఈ ఒప్పందాన్ని పక్కనపెట్టింది. ఇప్పుడు హసన్‌ రౌహానీ సర్కారు దాన్ని బయటకు తీసి పచ్చజెండా ఊపింది. దీని ప్రకారం 25 ఏళ్లలో చమురు క్షేత్రాల అభివృద్ధి, విమానాశ్రయాలు, రహదారులు, రైలు మార్గాల వంటి వంద పథకాలను చైనా చేపట్టే అవకాశం ఉంది. మూడు స్వేచ్ఛా వాణిజ్య మండలాలు(ఫ్రీట్రేడ్‌ జోన్లు) కూడా అభివృద్ధి చేస్తుంది. బదులుగా ఇరాన్‌ భారీ రాయితీపై చైనాకు చమురు విక్రయిస్తుంది. దీన్ని తుర్క్‌మెనిస్థాన్‌ మీదుగా సిల్క్‌రోడ్‌ ఆర్థిక నడవా మార్గంలో చైనాకు చేర్చే అవకాశం ఉంది. అప్పుడు హర్మూజ్‌, మలక్కా జలసంధులపై ఆధారపడాల్సిన అవసరం డ్రాగన్‌కు తగ్గిపోయి ఇంధన భద్రత లభిస్తుంది. ఈ లావాదేవీలు చైనా కరెన్సీలో జరిగే అవకాశాలు ఉండటంతో డాలర్‌ ప్రభావం ఉండకపోవచ్ఛు.

ఇరాన్‌, చైనా సంయుక్త సైనిక విన్యాసాలు, ఆయుధ అభివృద్ధి, కీలక సమాచారం పంచుకోవడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఇరాన్‌కు అంతర్జాతీయ వేదికలపై బలమైన మద్దతు అవసరం. ఐరాసలో అమెరికా ప్రవేశపెట్టే 'ఇరాన్‌ వ్యతిరేక తీర్మానాల'ను 'వీటో' చేయాలంటే చైనాతో బలమైన బంధం తప్పనిసరి. అందుకే చైనా విధించే కఠిన నిబంధనలకు కూడా ఇరాన్‌ కొంత మనసు చంపుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అణుపరిజ్ఞానం లోపాయికారీగా ఇరాన్‌కు అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికాకు చెక్‌ పెట్టేందుకు చైనా ఈ వ్యూహం అనుసరించవచ్ఛు ఈ పరిణామాలు చాబహార్‌పోర్టులో భారత్‌కు ఇబ్బందులను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. భారత్‌ ఆంతరంగిక విషయమైన కశ్మీర్‌పై గత ఆగస్టులో ఇరాన్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. దిల్లీలో అల్లర్లపై ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి జావెద్‌జరీఫ్‌ప్రకటన చేశారు. ఇది భారత్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇవన్నీ ఇరు దేశాల సంబంధాలు బలహీనపడుతున్న అంశాన్ని తెలియజేస్తున్నాయి. హర్మూజ్‌ జలసంధిపై చైనా పట్టు బిగిస్తే భారత్‌కు సమస్యలు తప్పవు. ఇరాన్‌ విషయంలో భారత్‌ కూడా చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు సరకులు రవాణా చేసే ఉత్తర-దక్షిణ నడవాకు కీలకమైన చాబహార్‌ విషయంలో చాలా జాప్యం జరిగింది. 2003లో ప్రతిపాదించిన ఈ నౌకాశ్రయ నిర్మాణం ఇప్పటికీ అత్తెసరుగానే పూర్తి అయింది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రతిపాదనలు ముందుకు పోలేదు. 2016లో మోదీ పర్యటన సందర్భంగా ఇరాన్‌-అఫ్గానిస్థాన్‌ మధ్య చాబహార్‌ ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ ట్రాన్సిట్‌ కారిడార్‌ నిర్మాణానికి ఒప్పందం జరిగింది. దీనిలో చాబహార్‌-జహదేన్‌-జరాంజ్‌ వరకు రైలు మార్గం, అక్కడి నుంచి అఫ్గానిస్థాన్‌లోని డేలారామ్‌ వరకు రోడ్డు మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. ఈ క్రమంలో భారత్‌ మొదట ప్రాజెక్టులోని రోడ్డు మార్గాన్ని పూర్తి చేసింది. ఇక రైలు మార్గంలో భారత్‌ 50 కోట్ల డాలర్ల విలువైన పనులుచేపట్టాల్సి ఉంది. సరకులు ఎక్కించే వ్యవస్థలు, సిగ్నలింగ్‌, స్టీల్‌ రైల్‌ ట్రాక్‌ల ఏర్పాటు వంటివి వీటిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టును భారత్‌కు చెందిన ఇర్కాన్‌, రైటస్‌ సంస్థలు చేపట్టాల్సి ఉంది. దీనికోసం ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. ఈ ప్రాజెక్టు లాభనష్టాలపై ఇర్కాన్‌ చేపట్టిన అధ్యయనం గతేడాది డిసెంబర్‌లో పూర్తి అయింది. కానీ, భారత్‌కు చెందిన ఇర్కాన్‌, ఇరాన్‌కు చెందిన సీడీటీఐసీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి నిరుడే కాలం చెల్లింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టులో భూమి చదును పనులు మాత్రమే ఇరాన్‌ చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి 40కోట్ల డాలర్లతో చాబహార్‌-జహదేన్‌ మధ్య 628 కిలోమీటర్ల పనులను తామే చేపడుతున్నామని ఇరాన్‌ ప్రకటించింది.

ఎంత చేరువో అంత దూరం

అమెరికాతో దోస్తీ మత్తులో ముఖ్యంగా వ్యూహాత్మక మిత్రులను భారత్‌ దూరం చేసుకోకూడదు. అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ 'ద రూమ్‌ వేర్‌ఇట్‌ హేపెన్డ్' పుస్తకంలో భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌కు చైనా నుంచి ఏమాత్రం ప్రయోజనం కనిపించినా, భారత్‌ పక్షాన ఉండరని వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. ట్రంప్‌ ఆలోచనా తీరుకు ఇది అద్దం పడుతుందనే విషయాన్ని భారత్‌ గ్రహించాలి. విదేశాల్లోని వ్యూహాత్మక ప్రాజెక్టులను పూర్తి చేయడంలో భారత్‌ చాలా జాప్యం చేస్తుందనే అపవాదును మూటగట్టుకొంది. శ్రీలంకలో హంబన్‌తోట రేవు వద్ద కొనుగోలు చేయాలనుకున్న 'మట్టాల ఎయిర్‌పోర్టు', కొలంబో పోర్టులో వాటా ఇప్పుడు భారత్‌ చేజారిపోనున్నాయి. అక్కడి ప్రభుత్వం మారడంతో ఈ నిర్ణయాలను పునస్సమీక్షించనుంది. ఇక ఈశాన్య రాష్ట్ర అవసరాల కోసం మియన్మార్‌ చేపట్టిన కళాదాన్‌ప్రాజెక్టు కూడా ఏళ్లతరబడి జాప్యంతో నత్తనడక నడుస్తోంది. మాల్దీవులు, నేపాల్‌, శ్రీలంక ప్రభుత్వాలపై చైనా ప్రభావం పెరిగితే తలెత్తిన భారత వ్యతిరేకత ధోరణి వంటి పరిస్థితులే భవిష్యత్తులో ఇరాన్‌లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు!

- పెద్దింటి ఫణికిరణ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.