ETV Bharat / opinion

అసమంజస విధానాలతో ఆదిమ జాతుల ఆందోళన - Tribal population in India

జనగణనలో అసమంజస విధానాలతో ఆదిమ జాతులు ఆందోళన చెందుతున్నాయి. అంతరిస్తున్న గిరిజన ఆదిమ జాతుల జనాభా లెక్కింపు కులాలవారీగా జరపరాదు. వీరిని తెగలవారీగా గణించడం ఒక సామాజిక న్యాయం. మతపరంగా చూస్తే ఆదివాసులను ప్రత్యేక 'ఆదివాసి'ధర్మంగా పరిగణించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం పరిశీలించాలి.

CENSUS OF TRIBALS
అసమంజస విధానాలతో ఆదిమ జాతుల ఆందోళన
author img

By

Published : Jul 25, 2020, 8:17 AM IST

ఏజెన్సీ ప్రాంత గిరిజనులు వంద శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందే ప్రభుత్వ ఉత్తర్వును ఇటీవల సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆదివాసీ యువత ఆందోళన బాట పట్టింది. కరోనా కల్లోలంలో బిక్కు బిక్కుమంటున్న ఆదివాసులకు కనీసస్థాయి ఉద్యోగ ఉపాధి లేక పూట గడవడం కష్టంగా ఉంది. వీరి జనాభా తగ్గుముఖం పడుతోంది. ఇలా అంతరిస్తున్న గిరిజన ఆదిమ జాతుల జనాభా లెక్కింపు కులాలవారీగా జరపరాదు. వీరిని తెగలవారీగా గణించడం ఒక సామాజిక న్యాయం. మతపరంగా చూస్తే ఆదివాసులను ప్రత్యేక ‘ఆదివాసి’ధర్మంగా పరిగణించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం పరిశీలించాలి. ప్రస్తుతం వీరిది మెజారిటీ 35 తెగలుగా భిన్న సంస్కృతుల సమ్మేళనం. ప్రత్యేక మతం డిమాండ్‌తో 2018 మే 12, 13 తేదీల్లో హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం వేదికగా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఆదివాసీ మేధావులతో జాతీయ ఆదివాసీ ధర్మ సాంస్కృతిక సమావేశం జరిగింది. ఆదివాసుల సంస్కృతిని ప్రత్యేక ధర్మంగా గుర్తించి త్వరలో చేపట్టబోయే 2021 జాతీయ జనగణనలో 35 తెగలను సూచించే ఒక పట్టిక ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఆదివాసీ మేధావుల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గణన వల్ల గిరిజనుల్లో ఆదిమ తెగల (పీటీజీ) గిరిజనులు అభివృద్ది ఫలాలు అందుకోలేక నష్టపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని 35 తెగలలో జనాభాను నిర్దిష్టంగా ఏ తెగలో ఎంతమంది అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంతరించే తెగలపై స్పష్టత కొరవడుతోంది.

అసమంజస విధానాలు

రాజ్యాంగం 342 అధికరణ 25వ నిబంధన ప్రకారం కొండప్రాంతం లేదా అటవీ ప్రాంతంలో నివసించేవారే గిరిజనులు. సంస్కృతిపరంగా వీరి జీవనశైలి మైదాన ప్రాంత, కులవృత్తులవారి కంటే విభిన్నం. అందుకే వీరి జనాభాను 1961 నుంచి 2001 వరకు జరిగిన జనగణనల్లో గిరిజన తెగలుగా లెక్కించారు. 2011 నుంచి వీరిని ఒకేతీరుగా గణించారు. అది సమంజసం కాదు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు నిమ్నవర్గాలకు రక్షిత ఆదివాసీ ప్రజలకు నేరుగా చేర్చేధ్యేయంతో ఉన్న ప్రభుత్వం చేసే ఈ గణన శాస్త్రీయం కాబోదు. తెలంగాణలోని 19, ఆంధ్రాలోని 16 తెగలను మైదాన, ఏజెన్సీ గిరిజనులుగా ప్రభుత్వం పరిగణించాలి. మైదాన ప్రాంత గిరిజనులను, తండా నివాసాలను 1976-2011 మధ్య గిరిజన జాబితాలో కలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వలసల ద్వారా జనాభా అమాంతం పెరిగింది. అధిక ప్రయోజనాలు వారికే దక్కుతున్నాయి. ఎస్టీలలో కలిసిన మైదాన తెగలైనా లంబాడా, ఎరుకల, యానాదులకు కేటాయించిన రెండు శాతం రిజర్వేషన్‌ కంటే (ఆరు శాతంలో) అధికం పొందుతున్నారు. రాజ్యాంగంలో పూర్వతెగలకే ప్రత్యేకించినప్పటికీ గిరిజనులలోనే ఏర్పడే ఈ అంతరం ఇబ్బందులు సృష్టిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోని 5,948 ఏజెన్సీ గూడేలలోని ఆదివాసులకు ఇది భంగపాటు!

జనాభా గణాంకాలు-2001

ఉమ్మడి రాష్ట్రంలో 33 తెగల జనాభా 50,24,104 (6.59 శాతం). ఇందులో 30 తెగల మొత్తం జనాభా 20,46,653. మూడు మైదాన తెగల నుంచి 20,77,947 మంది నమోదయ్యారు. 2003లో నక్కల/కుర్వీకరన్‌, ఫైకో, ధులియా/ పుతియా తెగలు కలిసి 35 షెడ్యూల్డ్‌ తెగల సమూహం ఏర్పడింది. ఇలాంటి ఇతర కులాల చేరికలతో, మరోవైపు వలసలతో ఏజెన్సీ అట్టుడుకుతోంది. తదుపరి జనగణన తెగలవారీ చేపట్టకపోతే అంతరించిపోయే ఆదిమ తెగల గురించి తెలిసే అవకాశం లేదు. రోనా, రేనా, కట్టునాయకన్‌, కొండరెడ్లు, భిల్లులు, ఆంధ్‌, తోటీల సంతానోత్పత్తి రేటు క్షీణిస్తోంది. శిశుమరణాలు, పోషకాహార లోపం, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు వారి ప్రాణాలను హరిస్తున్నాయి. కొత్తగా కరోనా వైరస్‌ రూపేణా సంక్షోభం దాపురించింది. ఈ దశలో తెగల జనాభా గణాంకాలు అసమగ్రంగా, అశాస్త్రీయంగా ఉంటే గిరిజన ఉపప్రణాళిక నిధులను ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు? ఏజెన్సీవారికి ప్రత్యేకించిన పీసా చట్టం, 1/70 చట్టం, విద్య ఉద్యోగ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు ఎలా అమలుచేయగలుగుతారు? గిరిజనుల ఐటీడీఏ లక్ష్యాలను ఎలా నెరవేరుస్తారు? ఈ పరిణామాలన్నీ ఆదివాసుల హక్కులు, ఉనికిని నిర్వచిస్తున్న రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు స్ఫూర్తిని నీరుగార్చేలా ఉన్నాయి.

అసమగ్ర గణనతో చేటు

2011నాటి జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి గిరిజనుల జనాభా మొత్తం 59,18,073. ఇందులో తెగలవారీ వివరాలు లేవు. కొన్ని తెగలలో అంతరించిపోతున్న ఆదివాసుల బాగోగుల వివరాలు తెలియకుంటే వారి భవిష్యత్తు చీకటిమయమవుతుంది. వారికి రిజర్వేషన్లు దక్కక అణగారిపోతారు. మైదాన గిరిజనులతో, గిరిజనేతరులతో పోటీపడలేని ఏజెన్సీవారికి ఈ పరిస్థితి తలెత్తకుండా పాలకులు చూడాలి. గ్రామ పంచాయతీలవారీగానైనా 50 పడకల ఆస్పత్రులు నెలకొల్పితే గిరిసీమలూ ఆరోగ్య భారతంలో మిళితమవుతాయి. నిరుపేద గిరిజనులకు రెండు గదుల ఇళ్ల పథకం అమలుచేసి, సాగుచేసే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనుల చిరకాల వాంఛ అయిన ఆదివాసీ ప్రాంతాల్లో 'స్వయంప్రతిపత్తి' కల్పిస్తే మూలవాసుల జీవన విధానం మెరుగుపడుతుంది. వారి భావి అస్తిత్వం నికరంగా ఉంటుంది.

- గుమ్మడి లక్ష్మీనారాయణ (రచయిత- సామాజిక విశ్లేషకులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.