ETV Bharat / opinion

ఆరోగ్య రంగానికి కాయకల్ప చికిత్స

దేశంలో దీటైన వైద్యసేవల విస్తృతి కొరవడి జనసామాన్యం జీవన్మరణ పోరాటం చేయాల్సి వస్తోంది. కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలకు అంతరాయం కలిగింది. కరోనాయేతర వ్యాధుల కట్టడి కోసం వైద్య ఆరోగ్య వ్యవస్థల్ని పటిష్ఠీకరించి సిద్ధం చెయ్యాలని ఎంతో ముందుగానే ప్రధాని నిర్దేశించినా- కొవిడ్‌ భారంతో ఆసుపత్రులు, కరోనా భీతితో ప్రజలు ఒక్క తీరుగా నలిగిపోతున్న రోజులివి.

the masses have to fight for their lives
ఆరోగ్యరంగానికి కాయకల్ప చికిత్స
author img

By

Published : Aug 15, 2020, 6:44 AM IST

మానవాళిలో 17శాతానికి పురిటిగడ్డ అయిన భారతావని ప్రపంచవ్యాప్త వ్యాధుల భారంలో 20శాతాన్ని మోస్తోంది. సాంక్రామిక, సాంక్రామికేతర వ్యాధులకు జీవనశైలి జబ్బులూ జతపడిన ఇండియాలో, అందుకు దీటైన వైద్యసేవల విస్తృతి కొరవడి సాధారణ పరిస్థితుల్లోనే జనసామాన్యం జీవన్మరణ పోరాటం చేస్తోంది. శతాబ్దపు ఉత్పాతంగా విరుచుకుపడిన కొవిడ్‌ మహమ్మారి ఆరోగ్య సేవా రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన దేశాలనే అతలాకుతలం చేసేస్తుంటే, ఇక ఇండియా పరిస్థితి చెప్పేదేముంది?

ఇతర జబ్బులపై కొవిడ్ భయాలు

కొవిడ్‌ భయానకంగా కోరసాచిన మూడు నెలల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలకు వాటిల్లిన అంతరాయం కారణంగా రెండు కోట్ల 84 లక్షల శస్త్ర చికిత్సలు వాయిదాపడ్డాయని, ఇండియాలో 5.8 లక్షల సర్జరీలు రద్దు అయ్యాయని అంతర్జాతీయ అధ్యయనం ప్రకటించింది. మార్చి నెలలో ఇండియావ్యాప్తంగా లక్షల మంది పిల్లలు టీకా మందులకు దూరమయ్యారని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ గణాంకాలే చాటుతున్నాయి. డయాలసిస్‌, రక్తమార్పిడి, కీమోథెరపీల వంటివే కాదు, ప్రసవ సేవలనూ పలు ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయంటూ, కొవిడ్‌ పరీక్ష కోసం ప్రతి రోగినీ నిర్బంధించకుండా, ఆసుపత్రులన్నీ సక్రమంగా పనిచేసేలా చూడాలని కేంద్రం ఏప్రిల్‌ చివరి వారంలోనే రాష్ట్రాలను ఆదేశించింది. నిండు గర్భిణులనూ చేర్చుకోకుండా ఆసుపత్రులు తిప్పి పంపేస్తున్న వైనం గుండెల్ని పిండేస్తుంటే, కొవిడ్‌ భయం కొరివిలా వెంటాడగా హాస్పిటల్‌కు వెళ్ళాలంటేనే జనసామాన్యం జంకుతున్న తీరు- కరోనా చీకటి కోణాల్ని కళ్లకు కడుతోంది.

ప్రాణాలు తోడేసే సాధారణ జబ్బులు

డెంగీ, చికెన్‌ గున్యా, మలేరియా, డయేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలు, కలరా, మెదడువాపు, పచ్చకామెర్లు వంటివి సాధారణంగా వానకాలంలో జూలు విదిల్చి అభాగ్యజనం ప్రాణాలు తోడేస్తుంటాయి. కరోనాయేతర వ్యాధుల కట్టడి కోసం వైద్య ఆరోగ్య వ్యవస్థల్ని పటిష్ఠీకరించి సిద్ధం చెయ్యాలని ఎంతో ముందుగానే ప్రధాని నిర్దేశించినా- కొవిడ్‌ భారంతో ఆసుపత్రులు, కరోనా భీతితో ప్రజలు ఒక్క తీరుగా నలిగిపోతున్న రోజులివి. ఈ దురవస్థనుంచి గుణపాఠాలు నేర్చి దిద్దుబాటు చర్యలకు సమకట్టాలి!

భారత్ సిద్ధంగా లేదు

ఆరోగ్యపరమైన విపత్తుల్ని ఎదుర్కోవడంలో ఇండియా సహా అనేక దేశాలు ఏమాత్రం సిద్ధంగా లేవని, ఆసియాలో థాయ్‌లాండ్‌, దక్షిణ కొరియాలే మంచి పనితీరు కనబరుస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య భద్రతా సూచి విశ్లేషించింది. 1990లో 30.5శాతంగా ఉన్న సాంక్రామికేతర వ్యాధుల ఉరవడి 2016నాటికే 55శాతం దాటిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఎబోలా, ఎల్లో ఫీవర్‌, ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ఇండియాలోకి చొరబడే ముప్పు మీద నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ నిరుడు జులైలో హెచ్చరించింది. వాటిని మించిన ఉపద్రవంగా విరుచుకుపడిన కరోనా- రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులతోపాటు ఇతరేతర జబ్బులతో బాధపడుతున్న వారిపైనా కర్కశంగా మృత్యుపాశాలు విసురుతోంది.

నిధుల కొరత లేకుండా చూడాలి

డెంగీ, మలేరియా, గున్యా, డయేరియా, కామెర్ల వంటి వ్యాధుల నివారణకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉందని మొన్న జనవరిలో కేంద్రం అభిప్రాయపడింది. అంటువ్యాధులతోపాటు జీవనశైలి జబ్బుల నివారణకు ఉపకరించేలా- ప్రజారోగ్యంలో డిగ్రీ పూర్తి చేసిన వైద్యులకు నాన్‌ క్లినికల్‌ విభాగంలో బాధ్యతల అప్పగింత ఓ మంచి మార్గమని జాతీయ ఆరోగ్య మిషన్‌ సూచించింది. ఏదైనా వైరస్‌ ప్రబలితే వ్యాధి సమాచారాన్ని స్థానిక సంస్థలనుంచి కేంద్రం వరకు చేరవేసే వేగవంతమైన వ్యవస్థ ఉండాలన్న ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ప్రతిపాదనకు, తక్కువ బరువుతో పుట్టి జీవనశైలి రోగాలతో బాధపడుతున్న యువజనాన్నీ దృష్టిలో ఉంచుకొని వ్యవస్థల దిద్దుబాటు సాగాలన్న విఖ్యాత మైక్రోబయాలజిస్ట్‌ డాక్టర్‌ నిర్మల్‌ కుమార్‌ గంగూలీ సూచనకూ మన్నన దక్కాలి. అట్టడుగు స్థాయిదాకా ప్రజారోగ్య రంగాన్ని పరిపుష్టం చేసే కార్యాచరణ వ్యూహాలకు నిధుల కొరత రాకుండా కాచుకొన్నప్పుడే దేశం తెరిపిన పడగలిగేది!

ఇదీ చదవండి- స్వాతంత్ర్య వేడుకల్లో ఈసారి హైలైట్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.