ETV Bharat / opinion

తల్లిదండ్రుల పర్యవేక్షణ కరవు- మత్తులో మునుగుతున్న యువత! - మత్తుకు బానిసలవుతున్న యువత

దేశంలో యువత మత్తుకు బానిసలవుతున్నారు. షికార్లు, రేవ్​ పార్టీలంటూ బహిరంగానే ఎక్కడిపడితే అక్కడ డ్రగ్స్​ వాడేస్తున్నారు. తమ వెనుక కుటుంబ సభ్యులు ఉన్నారన్న ధైర్యమో..? చట్టాలు వారికి చుట్టమనుకుంటున్నారో తెలియదుగానీ.. తప్పే అని తెలిసినా ఎక్కడా తగ్గట్లేదు. మరోవైపు మాదకద్రవ్యాల మాఫియా పేట్రేగిపోతోంది. అధికారులు ఎంత కట్టుదిట్టంగా పహారా కాసినా ఏదో ఒకమూల నుంచి ఏదోఒక రూపంలో దేశంలోకి డ్రగ్స్​ ప్రవేశిస్తునే ఉన్నాయి!

Drug users
మత్తులో మునుగుతున్న యువత
author img

By

Published : Oct 8, 2021, 7:31 AM IST

'ఏమిటీ లోకం.. ఎందుకీ క్రౌర్యం.. అకటా! ఒక తండ్రి మనసును అర్థం చేసుకోలేరా.. ఒకరి సంతోషాన్ని చూసి ఓర్వలేరా?'

'అన్నా! ఈ అరుపులేమిటి.. గోలేమిటి.. ఎవరిమీద ఈ చిందులు?'

'నీకిది గోలలా అనిపిస్తోందా.. నా ఆక్రోశంలో కన్నవారి ప్రేమ గోచరించడం లేదా.. సుపుత్రుడి కళ్లలో ఆనందాన్ని చూసి తరించిపోయే తండ్రి హృదయం కనిపించడంలేదా.. అవునులే నువ్వు కూడా ఈ లోకంలో భాగమే కదా?'

'ఆ నీలాపనిందలాపి ఏం జరిగిందో చెప్పొచ్చుగా అన్నా'

'ముందు ఒక్క విషయం చెప్పు.. మీ పిల్లలు ఏది అడిగినా తెచ్చి ఇవ్వాలని తపన పడతావా లేదా?'

'నా శక్తికి మించినది కాకపోతే తప్పకుండా..'

'నీకు కూడా శ్రమ లేకుండా వాళ్లకు కావాల్సింది వాళ్లే సాధించుకుంటే పుత్రోత్సాహం పెల్లుబుకుతుందా లేదా?'
'ఆహా.. సందేహమేముందీ?'

'అద్గదీ.. అసలు విషయం చెబుతాను విను.. చిన్నప్పుడు నేను మిస్సయినవన్నీ మా బుడ్డాడు రుచిచూసి ఆనందించాలని కోరుకున్నాను తమ్ముడూ.. తప్పంటావా?'

'అన్నన్నా.. ఎంతమాట! ఏ తండ్రైనా అదేగా కోరుకుంటాడు'

'అచ్చం నేననుకున్నట్లే వాడు ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిపోతుంటే.. అదేదో నేరమన్నట్లు గగ్గోలు పెడతారేమిటి అందరూ! పైగా వాడి ఇష్టానికి వాడు పెరగాలనే నా అభిలాషను ఎలాంటి భేషజాలూ లేకుండా బయటపెడితే.. నోరువెళ్లబెట్టి, ముక్కుమీద వేలేసుకుంటారేమిటి?'

'ఇక్కడో లాజిక్కు మిస్సయ్యావేమో అన్నా! చిన్నప్పుడు నువ్వు కోరుకొని కూడా పొందలేని ఖరీదైన జీవితాన్ని మీవాడికి అందించాలని అనుకోవచ్చు.. తప్పులేదు. ఆకలంటే ఏమిటో అబ్బాయిగారికి తెలీకుండా పెంచాలని కోరుకోవచ్చు.. అదీ భేషైందే! కుర్రాడు గొప్పవాడై నీ పేరు నిలబెట్టాలని ఆశించవచ్చు.. ఏమాత్రం అత్యాశ కాదు. అంతేకానీ- డ్రగ్స్‌, స్నేహితులు అంటూ చినబాబు అదేపనిగా రేయింబవళ్లు తిరుగుతూ, చిందులు వేస్తుంటే తండ్రిగా తానతందాన అనడమే జనానికి కాస్త ఇబ్బందికరంగా తోచినట్లుంది. పైగా చినబాబు బాగా చిన్నప్పుడే ఆడపిల్లల వెంట తెగ తిరిగేవాడని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ మురిసిపోయావు కదా! అది చూసి అబ్బాయి- నీ కోరిక తీర్చడమే తన ఏకైక ధ్యేయమనుకొని ఉంటాడు. పాపం ఆ ప్రయత్నంలో ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయినా అలాంటి కోరికలేమిటన్నా విచిత్రం కాకపోతే?'

'కోరిక ఏదైతేనేం.. పిల్లల ముచ్చట తీర్చడమే కదా పెద్దలుగా మన బాధ్యత! నా చిన్నతనంలో ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే క్షణాల్లో ‘సరకు’ అందే విధానాలు లేకపోయె! అందుకే ఎన్నో ఆశలు తీరలేదు. ఇప్పుడు మావాడు ఆ బులబాటం తీర్చుకుంటుంటే వాడిలో నన్ను నేను చూసుకుంటూ మురిసిపోవాలనుకున్నా.. ఓ తండ్రిగా నేను కన్న కలలనూ హర్షించలేదా ఈ పాడు సమాజం! అయినా నా ఆలోచనల్లో తప్పేమిటి.. భూమ్మీద సుఖపడితే తప్పులేదని దశాబ్దాల క్రితమే ఒకాయన సెలవిచ్చాడుగా..'

'సినిమాల్లో సిచ్యుయేషన్‌కు కావలసినట్లు పాటలు రాస్తూ ఉంటారు. హీరోగారు మొదట్లో షోకిల్లాలా తిరిగినా చివరికొచ్చేసరికి మారిపోయి మంచివాడు కావడం మామూలే కదా? నిజ జీవితంలో అలా జరుగుతుందా! సరదాకాస్తా వ్యసనం కావచ్చు కదన్నా?'

'ఏమిటి తమ్ముడూ మంచీ-చెడూ, సినిమా-జీవితమూనూ.. అయినా నాకు తెలీకడుగుతానూ- సినిమాలెక్కడినుంచి వస్తాయ్‌.. జీవితాల నుంచే కదా? సినిమాల్లో ప్రదర్శిస్తే చప్పట్లు.. నిజంగా చేసి చూపిస్తే తిట్లూనా.. నా అభిమానులు కూడా నా సదాశయాన్ని అర్థం చేసుకోకుంటే ఎలా? అయినా మనవాడు చేసింది మాత్రం పెద్ద తప్పా ఏమిటి.. స్నేహితులతో సరదాగా నౌకావిహారం చేశాడు. ఉత్తిగా విహారమే అయితే థ్రిల్‌ ఏముంటుందీ.. అందుకే కాస్త మత్తుగా గమ్మత్తుగా కాలక్షేపం చేశాడు. అంతమాత్రానే కొంపలంటుకుపోయినట్లు ఈ రాద్ధాంతమేమిటి! ఆ మాటకొస్తే మొన్న కొందరు డాబామీదే గంజాయి తోట పెంచుతూ పట్టుబడ్డారట.. ఈ మధ్య మూసివేసిన ఫార్మా కంపెనీల్లో కాకుండా.. ఇళ్లలోనే మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నారట! మావాడు అలాంటి పనులేవీ చెయ్యలేదే! ఈ అధికారులున్నారే.. ఘోరమైన నేరాలు చేసినవాళ్ల మీదకంటే ప్రముఖుల పిల్లల మీదే వాళ్ల దృష్టంతా. ఏదో నేస్తాలతో సరదాగా గడిపే పసివాళ్లమీద పడతారే?'

'పాపం పోలీసులు, అధికారులు మాత్రం ఏం చేస్తార్లే అన్నా.. చిన్న నేరగాళ్లను పట్టుకొని తీగ లాగో, ఎవరో ఉప్పందిస్తేనో దాడులు చేస్తారు. అయినా నువ్వు చెప్పిన సంఘటనలన్నీ పోలీసులు డ్యూటీ చేస్తేనే కదా వెలుగు చూశాయి?'
'నిజమేననుకో.. అయినా మా వెధవాయిననాలి.. దేనికైనా గుట్టూ మట్టూ ఉండాలంటారు. దోస్తులతో కలిసి సరదాలు తీర్చుకునేటప్పడు ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలని ఉపదేశించాల్సిందే'
'హతవిధీ.. ఇక నా దేశాన్ని ఆ దేవుడే రక్షించాలి!'

రచయిత- వెన్నెల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.