ETV Bharat / opinion

మాదకశక్తులతో దేశ భవితవ్యం ఛిన్నాభిన్నం - దేశంలో డ్రగ్స్ మాఫియా

చాపకింద నీరులా విస్తరిస్తున్న మాదకశక్తుల(Drug rocket) ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో వ్యవస్థాగత వైఫల్యం వల్ల పోనుపోను దారుణ దుష్పరిణామాలు పెచ్చరిల్లుతున్నాయి. క్షేత్రస్థాయిలో గ్రాముల లెక్కన చేతులు మారే హెరాయిన్‌ టన్నులకొద్ది పరిమాణంలో దేశంలోకి వచ్చిపడుతూ.. ప్రధానంగా యువతను నిర్వీర్యం చేస్తున్నా- నిఘా యంత్రాంగం ఏమీ చేయకుండా చూస్తుండిపోవడం దురదృష్టకరం.

drugs maffia
దేశంలో డ్రగ్స్ మాఫియా
author img

By

Published : Sep 23, 2021, 6:27 AM IST

మాదకద్రవ్యాల(Drug Rocket) కారణంగా దేశంలో అంధకారం, విధ్వంసం, వినాశం దాపురిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోగడ ఆవేదనాభరితంగా స్పందించారు. బహుముఖ కార్యాచరణకూ పిలుపిచ్చారు. వాస్తవంలో, చాపకింద నీరులా విస్తరిస్తున్న మాదకశక్తుల ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో వ్యవస్థాగత వైఫల్యం వల్ల పోనుపోను దారుణ దుష్పరిణామాలు పెచ్చరిల్లుతున్నాయి. చిలవలు పలవలు వేసుకుపోతున్న మత్తువ్యాపార(Drug Rocket) సామ్రాజ్య భారీ పరిమాణాన్ని ప్రస్ఫుటీకరించే ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. మొన్న గుజరాత్‌ తీరం సమీపంలో ఇరాన్‌ పడవనొకదాన్ని పట్టుకున్నారు. అందులో దొరికిన హెరాయిన్‌ విలువ సుమారు రూ.250కోట్లు. గుజరాత్‌లోనే ముంద్రా నౌకాశ్రయంలో ఎకాయెకి రూ.21 వేల కోట్ల సరకు పట్టుబడటం పెను సంచలనం సృష్టిస్తోంది. అది అఫ్గాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా విజయవాడ చిరునామా కలిగిన కంపెనీకి పంపినట్లు వెల్లడైంది.

టన్నులకొద్దీ పరిమాణంలో..

నిఘా సంస్థలకు అనుమానం రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా సరకును దిల్లీకి చేర్చాలన్న వ్యూహం- విస్తృత నెట్‌వర్క్‌ ఉనికిని చాటుతోంది. మూడునెలల క్రితం అదే కంపెనీకి టాల్కం పౌడర్‌ పేరిట అఫ్గాన్‌ నుంచి వచ్చిన 25 టన్నుల హెరాయిన్‌ దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు తరలిపోయినట్లు ఆలస్యంగా బహిర్గతమైంది. క్షేత్రస్థాయిలో గ్రాముల లెక్కన చేతులు మారే హెరాయిన్‌ టన్నులకొద్దీ పరిమాణంలో దేశంలోకి వచ్చిపడుతూ, ప్రధానంగా యువతను నిర్వీర్యం చేస్తున్నా- నిఘా యంత్రాంగం చేష్టలు దక్కి చూస్తుండిపోవడం దురదృష్టకరం. సంక్షోభ తీవ్రతకు తగ్గట్లు మాదకద్రవ్య నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పోలీస్‌ విభాగాల్లో వృత్తిపరమైన సన్నద్ధత, పరస్పర సమన్వయం కొరవడటం నిశ్చేష్టపరచే పరిణామం. దేశ భవితవ్యమే ఛిన్నాభిన్నమైపోతుంటే నిఘా దళాలు, ప్రజాప్రభుత్వాలు ఇంకా మీనమేషాలు లెక్కించడమేమిటి?

వేళ్లు తన్నుకుంది..

పదేళ్ల కిందట హైటెక్‌ సిటీలో గంజాయి విక్రయిస్తూ పోలీసుల చేజిక్కిన ముగ్గురి వద్ద కిలో సరకు దొరికింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ ఖాతాదారులేనంటూ తమకు వరంగల్‌ నుంచి గంజాయి అందుతున్నట్లు నిందితులు అప్పట్లో నిజం కక్కేశారు. దశాబ్దం వ్యవధిలో భాగ్యనగరంతోపాటు ఎన్నో నగరాలూ పట్టణాల్లో మత్తు పదార్థాల పంపిణీ వ్యవస్థ లోతుగా వేళ్లు తన్నుకుంది. విశాఖ జిల్లాలో గంజాయి మాఫియా ఏటా రూ.7200 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నట్లు అంచనా. యూపీ, పంజాబ్‌, దిల్లీ, ఏపీ, తెలంగాణ- ఇంజక్షన్ల ద్వారా మాదకద్రవ్యాలు సేవించే వ్యసనపరుల సంఖ్య ప్రాతిపదికన తొలి అయిదు స్థానాల్లో నిలుస్తున్నాయి. చాక్లెట్ల రూపేణా పాఠశాలలకూ మాదకద్రవ్యాలు చేరువ కావడం దిగ్భ్రాంత పరుస్తోంది. చలనచిత్ర పరిశ్రమ పైనా మత్తునీడలు పరచుకుంటున్నాయి. కేంద్రం అధికారికంగా గుర్తించిన మేరకు, దేశవ్యాప్తంగా 272 జిల్లాలు డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకున్నాయి.

కళ్లాలు బిగించడంపై దృష్టిసారించాలి..

మత్తు బారిన పడిన వ్యసనపరుల్లో 80శాతం దాకా 35 ఏళ్లలోపు వారేనని గణాంకాలు చాటుతున్నాయి. డీప్‌వెబ్‌, డార్క్‌నెట్‌ వెబ్‌సైట్ల సాయంతో క్రయవిక్రయాలు ఊహాతీత వేగంతో పెచ్చరిల్లుతున్న వేళ- మాదక ముఠాల విజృంభణకు కళ్లాలు బిగించడం ఎలాగన్నదానిపై ప్రభుత్వాలు సకల శక్తియుక్తుల్నీ కేంద్రీకరించాల్సి ఉంది. మాదక ద్రవ్యాలను వినియోగించినా, ఉత్పత్తి నిల్వ వ్యాపారాలకు పాల్పడినా కంబోడియా, వియత్నాం, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ వంటివి మరణదండన విధిస్తున్నాయి. ఆ మధ్య 'ట్రోజన్‌ షీల్డ్‌' పేరిట 16 దేశాల్లో ఎఫ్‌బీఐ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి 800 మందికి పైగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని టన్నులకొద్దీ సరకును స్వాధీన పరచుకుంది. అదే ఇక్కడ పాత్రధారులు కొంతమంది వలలో చిక్కుతున్నా, సూత్రధారులు కొరమీనుల్లా తప్పించుకుంటున్నారు. మరెవరూ డ్రగ్స్‌ దందాకు తెగబడకుండా పటిష్ఠ చట్టాలు, సత్వర విచారణ, కఠిన దండనలకు ప్రభుత్వాలు గట్టి పూనిక వహిస్తేనే- దేశంలో మాదక మహోత్పాతానికి అడ్డుకట్ట వేయగలిగేది!

ఇదీ చూడండి: తల్లీకూతుళ్ల స్మగ్లింగ్ దందా- రూ. 25 కోట్ల హెరాయిన్ తీసుకొస్తూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.