ETV Bharat / opinion

భావస్వేచ్ఛకు డిజిటల్‌ సంకెళ్లు - భారత్​లో డిజిటల్​ యంత్రాంగంపై మార్గదర్శకాలు

డిజిటల్‌ మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికల్నీ కఠిన నిబంధనల చట్రంలో బంధించి నియంత్రించేలా ఐటీ చట్టం నియమాలను ఫిబ్రవరి 25న కేంద్రం 'నోటిఫై' చేసింది. ఐటీ చట్టంలోని 69ఏ-కు కఠిన నిబంధనల కోరలు తొడిగి, సుతిమెత్తనైన పర్యవేక్షక యంత్రాంగం పేరిట డిజిటల్‌ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛను హరించేసింది.

digital media, freedom of expression
భావస్వేచ్ఛ, డిజిటల్​ మీడియా
author img

By

Published : May 31, 2021, 8:26 AM IST

భారత రాజ్యాంగానికి చేసిన మొట్టమొదటి సవరణే- భావ ప్రకటన స్వేచ్ఛకు సహేతుక పరిమితుల నిర్దేశానికి సంబంధించినది. తెలుసుకొనేందుకు ప్రజలకు గల హక్కును అహేతుకంగా తొక్కిపట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించిన ప్రతిసారీ న్యాయవివాదాలు రాజుకొంటూనే ఉన్నాయి. డిజిటల్‌ మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికల్నీ కఠిన నిబంధనల చట్రంలో బంధించి నియంత్రించేలా ఐటీ చట్టం నియమాలను ఫిబ్రవరి 25న కేంద్రం 'నోటిఫై' చేసింది. ఐటీ చట్టంలోని 69ఏకి కఠిన నిబంధనల కోరలు తొడిగి, సుతిమెత్తనైన పర్యవేక్షక యంత్రాంగం పేరిట డిజిటల్‌ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛను హరించేసింది. కొత్త నిబంధనలకు మరో పక్షం రోజుల్లోగా కట్టుబాటు చాటాలంటున్న కేంద్ర సర్కారు- ఎడిటర్స్‌ గిల్డ్‌, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ)ల సహేతుక అభ్యంతరాల్ని పెడచెవిన పెడుతోంది. సామాజిక మాధ్యమాల్లో విశృంఖలత్వాన్ని అదుపు చేసే నెపంతో మీడియా స్వేచ్ఛకు గల రాజ్యాంగ రక్షణల్ని కేంద్రం తోసిపుచ్చజాలదని ఎడిటర్స్‌ గిల్డ్‌ లోగడే ఆక్షేపించింది. డిజిటల్‌ వార్తావేదికలకూ విస్తరించిన సంప్రదాయ టీవీ వార్తా ప్రసార మాధ్యమం ఇప్పటికే తగు కట్టుబాట్లకు లోబడి ఉన్నందువల్ల దాన్ని కొత్త ఐటీ నిబంధనల నుంచి మినహాయించాలని ఎన్‌బీఏ తాజాగా విజ్ఞప్తి చేసింది.

కంటెంట్​ కోడ్​ పేరట లక్ష్మణరేఖ..

అత్యవసర సమయాల్లో సమాచారాన్ని నిలువరించడం వంటి కఠిన నిబంధనలు మీడియా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గొడ్డలి పెట్టుగా మారతాయనీ ఆందోళన వ్యక్తీకరిస్తోంది. వార్తా ఛానళ్లలో ప్రసారాలకు 'కంటెంట్‌ కోడ్‌' పేరిట లక్ష్మణరేఖ గీయడానికి పుష్కర కాలం క్రితం యూపీఏ సర్కారు ప్రయత్నించి భంగపడింది. భావితరం మీడియాగా ఎదిగొచ్చిన ప్రసార మాధ్యమాల నియంత్రణ యత్నం పూర్తిగా అనుచితం, అప్రజాస్వామికం.

భద్రత వ్యక్తి గోప్యతకు విఘాతం..

ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ సమాచార విప్లవానికి సారథ్యం వహిస్తోంది. 2019 సెప్టెంబరులో ఫేస్‌బుక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు- సామాజిక మాధ్యమాల్లో కొన్ని సందేశాలు దేశ సార్వభౌమత్వానికే ప్రమాదకరంగా పరిణమించవచ్చునని అంటూ అటువంటి వాటిని పోస్టు చేసినవారెవరో తెలుసుకోగలిగేలా ప్రభుత్వం సరైన యంత్రాంగాన్ని కొలువు తీర్చాలని సూచించింది. అదే సమయంలో వ్యక్తుల మధ్య రహస్యంగా సాగే సందేశాల ప్రసారాన్ని సులువుగా తెలుసుకోగలిగేటట్లయితే ప్రాథమిక హక్కు అయిన వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడుతుందనీ న్యాయపాలిక హెచ్చరించింది. నిర్దిష్ట పరిస్థితుల్లోనే వివాదాస్పద సందేశాల మూలాల్ని అన్వేషించాలని, వ్యక్తుల గోప్యతకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలని హితవు పలికింది. జాతి భద్రత పేరిట వ్యక్తి గోప్యతకు విఘాతం కలగరాదని న్యాయపాలిక స్పష్టీకరించినా- పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం చందంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరే తీవ్రాందోళన కలిగిస్తోంది.

భావస్వేచ్ఛకు సంకెళ్లు..!

నిరుడు జులై-డిసెంబరు నడుమ వినియోగదారుల డేటా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏకంగా 40,300 విజ్ఞప్తులు అందాయని ఫేస్‌బుక్‌ వారం రోజుల క్రితం ప్రకటించింది. కేంద్రం నిబంధనలు భావస్వేచ్ఛకు తీవ్ర విఘాతమంటూ వాట్సాప్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది! మరోవంక డిజిటల్‌ మీడియాలో జరుగుతున్న విషప్రచారాలు హింసకు దారితీస్తున్నాయంటూ ఏ దశలోనూ ఎవరితోనూ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్రం ఎథిక్స్‌ కోడ్‌ రూపొందించింది. మూడంచెల క్రమబద్ధీకరణ యంత్రాంగంలో అత్యున్నత స్థాయిలో సర్కారీ కమిటీకే సర్వాధికారాలు కట్టబెట్టి డిజిటల్‌ మీడియాని గుప్పిటపట్టే ధోరణి దేశ ప్రయోజనాలకెంతగానో చెరుపు చేస్తుంది!

ఇవీ చూడండి:

Twitter: 'ఐటీ నియమాలను ట్విట్టర్​ పాటించదా?'

Social media : 'స్థానిక చట్టాలను మేం గౌరవిస్తాం'

whatsapp: కేంద్రం X వాట్సప్‌.. ముదురుతున్న వివాదం

వాట్సాప్​కు కేంద్రం స్ట్రాంగ్​ కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.