ETV Bharat / opinion

చిన్నారుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు.. డిజిటల్​ తెరలే కారణం! - eye problems in child

డిజిటల్‌ ఉపకరణాల వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. ఎలెక్ట్రానిక్‌ తెరలను ఎక్కువగా చూస్తుండటంతో చిన్నారుల్లో కంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కరోనా అనంతరం చిన్నారుల్లో దృష్టిలోపం పెరిగినట్లు పలు అధ్యయనాలు చాటుతున్నాయి.

digital screen effect on child eye contact
చిన్నారుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
author img

By

Published : Dec 28, 2022, 11:09 AM IST

లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాలలు మూతపడటంతో పిల్లలకు టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లే కాలక్షేపంగా మారాయి. ఆన్‌లైన్‌ తరగతుల ప్రారంభంతో వాటిద్వారానే పాఠాలు వినాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రత్యక్ష బోధన సాగుతున్నా విద్యార్థులు డిజిటల్‌ ఉపకరణాలను వీడలేకపోతున్నారు. ఫలితంగా ఎలెక్ట్రానిక్‌ తెరను చూసే సమయం అధికమై కంటి సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి. ఎక్కువ సమయంపాటు ఎలెక్ట్రానిక్‌ తెరలను చూడటం వల్ల తేమ తగ్గుతుంది. కళ్లు పొడిబారతాయి. మంట పెట్టడం మొదలవుతుంది. నీరుకారడం, మసకబారడం, కళ్లనొప్పి, తలనొప్పి, మెడనొప్పి తదితర లక్షణాలు మొదలవుతాయి. డిజిటల్‌ తెరల నుంచి వెలువడే నీలికాంతితో రెటీనా దెబ్బతినడమే కాకుండా చర్మ సంబంధ వ్యాధులు, నిద్రలేమి లాంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా 9-13 ఏళ్ల పిల్లలు రోజుకు మూడు గంటలకుపైగా స్మార్ట్‌ఫోన్లు చూస్తున్నట్లు 'లోకల్‌ సర్కిల్స్‌' సంస్థ తాజా సర్వేలో వెల్లడైంది. 13-17 సంవత్సరాల పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు బానిసలైనట్లు 44శాతం తల్లిదండ్రులు చెప్పగా, ఆ వయసు పిల్లలు మూడు గంటలకుపైగా ఫోన్లతోనే గడుపుతున్నారని 62శాతం అమ్మానాన్నలు పేర్కొన్నారు. పట్టణాల్లో ప్రతి పది మంది పిల్లల్లో నలుగురు ఫోన్లతోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్లు తేలింది. పదిహేనేళ్లలోపు పిల్లల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం 83శాతందాకా ఉన్నట్లు సర్వే పేర్కొంది. 9-17 ఏళ్ల వారిలో 30శాతానికి సొంత ఫోన్లు ఉన్నట్లు కొన్నాళ్ల క్రితం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం వెల్లడించింది. చిన్నారుల్లో డిజిటల్‌ తెరపై గడిపే సగటు సమయం 2.45 గంటల నుంచి 6.89 గంటలకు పెరిగిందని చైనీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 8-10 సంవత్సరాల పిల్లలు సగటున రోజుకు ఎనిమిది గంటలు, కౌమారదశ పిల్లలు సుమారు 11 గంటలు డిజిటల్‌ తెరలతో గడుపుతున్నట్లు అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ అధ్యయనం పేర్కొంది.

కంటి సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్న పిల్లల సంఖ్య గతంతో పోలిస్తే సగందాకా పెరిగినట్లు నేత్ర వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి 100 మంది పిల్లల్లో సుమారు 23 మంది కళ్లు సరిగ్గా కనబడక ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. ఎక్కువసేపు ఎలెక్ట్రానిక్‌ తెరలను చూడటం వల్ల పిల్లలు దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేని దృష్టిలోపం బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌కు ముందు ప్రతి వంద మంది చిన్నారుల్లో 5-10 మందిలో దృష్టిలోపం లక్షణాలు కనిపిస్తే, తరవాత 20-30 మందిలో కనిపిస్తున్నట్లు ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైద్యనిపుణులు ఇటీవల వెల్లడించారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి పది మంది పిల్లల్లో అయిదుగురు మయోపియా అనే దృష్టి లోపం బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దృష్టిలోపం నివారణకు పిల్లలు ఎలెక్ట్రానిక్‌ తెరను చూసే సమయాన్ని మూడు గంటలకన్నా తక్కువకు పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు అసలు ఫోన్లే ఇవ్వొద్దని చెబుతున్నారు. చిన్నారుల్లో తొలిదశలోనే కంటి సమస్యలు గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏడాది లోపు చిన్నారులకు డిజిటల్‌ తెర చూపించకూడదని, అయిదేళ్లలోపువారికి గంటకు మించి చూపకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. ఆ పైవయసు పిల్లలకు కూడా రోజుకు రెండు గంటలకు మించకపోవడమే మేలని సూచించింది. ఈ క్రమంలో చిన్నారులు ఎక్కువ సమయం ఎలెక్ట్రానిక్‌ తెరలు చూడకుండా ఉండాలంటే, తల్లిదండ్రులు వారికి పుస్తక పఠనాన్ని అలవరచాలి. అవసరమైన సందర్భాల్లో ప్రతి గంటకు 10 నిమిషాలు కళ్లకు విశ్రాంతి ఇచ్చేలా జాగ్రత్తపడాలి. విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులను 12-16 ఏళ్ల వారికి ఎనిమిది గంటలు, పన్నెండేళ్లలోపు వారికి 3-4 గంటలకే పరిమితం చేయాలి. కంటిచూపు మెరుగుదలకు పిల్లలకు పోషకాహారం, విటమిన్‌-ఎ లభించే ఆహార పదార్థాలు అందించాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే గదుల్లోనే చదువుకునేలా ప్రోత్సహించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.