ETV Bharat / opinion

విదేశీ పెట్టుబడులకు రాచబాటలు - విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉన్న వేళ.. కరోనా వైరస్​ మరింత కలవరపెట్టింది. 'ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ' అంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు తీసుకువచ్చినప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులే శరణ్యమంటూ సాక్ష్యాత్తూ కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ అన్నారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలోకి విస్తృత పెట్టుబడులు ప్రవహిస్తే చతికిలపడ్డ దేశార్థికం తిరిగి ఉరకలెత్తుతుందని అమాత్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Deals in roads sector gather pace as foreign investors buy up assets
విదేశీపెట్టుబడులకు రాచబాటలు
author img

By

Published : Jul 4, 2020, 7:54 AM IST

దేశార్థికం మీద మాంద్యం ముసురుకుంటున్న తరుణంలో కోరసాచిన కరోనా వైరస్‌, వృద్ధి ఆకాంక్షల్ని కుళ్లబొడిచింది. ఆ భీకర దాడికి అనేక రంగాలు పడకేసి, ఉపాధి అవకాశాలు పెద్దయెత్తున కుంగిపోయాయి. కోట్లాది జన జీవితాలను అతలాకుతలం చేసిన అనూహ్య సంక్షోభంనుంచి గట్టెక్కించగలదంటూ ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ప్యాకేజీ వెలుగుచూసిన దరిమిలా- ఆర్థిక వ్యవస్థ పునరుత్థానానికిక ఎఫ్‌డీఐలే (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) శరణ్యమంటున్నారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. మౌలికరంగ ప్రాజెక్టుల రూపంలో, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ(సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ)ల రంగంలోకి విస్తృత పెట్టుబడులు ప్రవహిస్తే చతికిలపడ్డ దేశార్థికం తిరిగి ఉరకలెత్తుతుందని అమాత్యులు ఆశాభావం వ్యక్తీకరిస్తున్నారు. జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, జలమార్గాలు, రైల్వేలు, మెట్రో, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ తదితర రంగాల్లోకి రూ.50-60లక్షలకోట్లు ప్రవహిస్తే ఆ అద్భుతం సుసాధ్యమేనన్నది గడ్కరీ వివరణ. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై ఐరాస ప్రత్యేక విభాగం గణాంకాల ప్రకారం- అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2019-20లో మెరుగ్గా రాణించిన భారత్‌ రాబట్టిన ఎఫ్‌డీఐల రాశి 51బిలియన్‌ డాలర్లు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మే నెలలో వెల్లడించిన లెక్కల మేరకు, ఆ మొత్తం 73 బిలియన్‌ డాలర్లు. రూపాయల్లోకి మారిస్తే సుమారు అయిదున్నర లక్షల కోట్లు. ఇప్పుడు గడ్కరీ లక్షిస్తున్నది అంతకు పదింతల పైమాటే. చైనానుంచి వైదొలగదలచిన సంస్థల్ని ఆకట్టుకోవడానికి లక్సెంబర్గ్‌ పరిమాణానికి రెట్టింపు విస్తీర్ణంలో భూబ్యాంక్‌ సిద్ధపరుస్తున్నామని, సాంకేతికతను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టామని గడ్కరీ చెబుతున్నా- భూరి లక్ష్యాన్ని సాధించడానికి మరెన్నో మైలురాళ్లు అధిగమించాల్సి ఉంది.

ఎఫ్​డీఐల ప్రవాహం

ఎఫ్‌డీఐలలో అమాంతం విశేషవృద్ధి సాధ్యం కాదనడానికి అయిదు నెలలక్రితం విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన సమాచారమే దాఖలా. 2009-14 సంవత్సరాలతో పోలిస్తే 2014-19మధ్య దేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహం 190 బిలియన్‌ డాలర్లనుంచి 284 బిలియన్‌ డాలర్లకు విస్తరించింది. ప్రస్తుత డాలరు మారకం రేటు ప్రకారం లెక్కిస్తే గత అయిదేళ్ల సగటు ఇంచుమించు నాలుగు లక్షల పాతిక వేలకోట్ల రూపాయలు. 1929-1939నాటి మహామాంద్యం తరవాత అంతటి తీవ్రాందోళనకర సంక్షోభం కరోనా కారణంగా దాపురించినదేనని ఐఎమ్‌ఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) సూత్రీకరించడం తెలిసిందే. పర్యవసానంగా, నిరుటికన్నా ఈ ఏడాది అంతర్జాతీయ ఎఫ్‌డీఐల ప్రవాహం 40శాతం మేర సన్నగిల్లుతుందని ఐరాస సంస్థ ఇటీవలే మదింపు వేసింది. ఈ స్థితిలో అసాధ్య లక్ష్యాలు నిర్దేశించుకుని భంగపడేకన్నా స్థిర పురోగతి నిమిత్తం అడ్డంకులు తొలగించుకుంటూ వ్యూహకర్తలు ముందడుగేయడం మేలు.

అన్ని ఎక్కువే..

ఎఫ్‌డీఐలను ఆకట్టుకోవడంలో అమెరికా, చైనా, సింగపూర్‌, బ్రెజిల్‌, యూకే, హాంకాంగ్‌, ఫ్రాన్స్‌ మనకన్నా మిన్నగా రాణిస్తున్నాయి. ఆ జాబితాలో ఇండియా పైకి ఎగబాకాలంటే సులభతర వాణిజ్య నిర్వహణలో భేషనిపించుకోవాలి. కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాకు వాటిల్లుతున్న నష్టం నుంచి తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలు లబ్ధిపొందుతుండగా- ఇండియాకు కొన్ని అంశాలు ప్రతిబంధకాలవుతున్నాయి. అవి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలే. పన్నుల మోత, విద్యుత్‌ సుంకాలు, పెట్టుబడులపై వడ్డీలు, అనుమతుల మంజూరులో జాప్యం, రాష్ట్రాల స్థాయిలో అవినీతి, రవాణాపరమైన సమస్యలు... అన్నీ ఎక్కువే ఇక్కడ. భారత్‌ ప్రగతి వేగాన్ని కుంగదీస్తున్న అంశాల్లో సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టి, మరే దేశానికీ లేని స్థాయిలో అందుబాటులో ఉన్న యువజనాన్ని సుశిక్షిత మానవ వనరులుగా తీర్చిదిద్దుకున్ననాడు. వెలుపలి పెట్టుబడుల్ని ఇండియా సూదంటురాయిలా ఆకర్షించగలుగుతుంది!

ఇదీ చూడండి:అసోం ముఖ్యమంత్రికి మోదీ ఫోన్​.. ఆదుకుంటామని హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.