ETV Bharat / opinion

కశ్మీర్​​ లెక్కలు మార్చిన​ డీడీసీ ఎన్నికలు! - బిలాల్​ భట్​

జమ్ముకశ్మీర్​లో జరుగుతున్న డీడీసీ ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. అక్కడ ఒక్కప్పుడు ఎన్నికలు జరిగిన తీరు.. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ప్రజలు ఓట్లు వేయడానికి ధైర్యంగా బయటకు వస్తున్నారు. 'కశ్మీర్​ సమ్యకు హింస కాదు.. ఎన్నికలే పరిష్కారమ'ని అని వారు విశ్వసిస్తున్నట్టు కనపడుతోంది. ఫలితంగా చరిత్రలోనే తొలిసారి కశ్మీర్​ ఎన్నికలకు చట్టబద్ధత లభించిందని ఈటీవీ భారత్​ న్యూస్​ ఎడిటర్​ బిలాల్ భట్​ విశ్లేషించారు.

DDC polls: Making elections a legitimate democratic process
కశ్మీర్​లో​ ఎన్నికలకు తొలిసారిగా 'చట్టబద్ధత'
author img

By

Published : Dec 1, 2020, 4:10 PM IST

జమ్ముకశ్మీర్​ వంటి ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించడం పెద్ద సవాలే. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితే ఇందుకు ముఖ్య కారణం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న డీడీసీ(జిల్లా అభివృద్ధి మండలి​) ఎన్నికలకు ప్రజల ఆమోదం లభించినట్టే కనిపిస్తోంది.

జమ్ముకశ్మీర్​లో అనిశ్చితులు సర్వసాధారణం. అదే సమయంలో 1987 నుంచి ఇక్కడ.. ఎన్నికల చట్టబద్ధత కూడా ప్రమాదంలో పడింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు దాడులు చేసేవారు. ఈ తరహాలో ఇప్పటివరకు 5వేల మందికిపైగా నేతలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది ప్రధాన పార్టీలకు చెందినవారు కావడం గమనార్హం.

కానీ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న డీడీసీఏ ఎన్నికలు.. రాజకీయ రూపురేఖలను మార్చేసినట్టు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న 'రక్తపాతం'.. కశ్మీర్​ సమస్యకు పరిష్కారం కాదని అక్కడివారు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలే సమస్యకు పరిష్కారమని అనుకుంటున్నారు. ఫలితంగా జమ్ముకశ్మీర్​ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికలకు చట్టబద్ధత దక్కినట్టైంది.

DDC polls: Making elections a legitimate democratic process
ఓటేసేందుకు ఎదురుచూపు

ఇదీ చూడండి:- కశ్మీర్​లో స్థానిక సమరం- ఎందుకింత ప్రాధాన్యం?

ప్రారంభం అక్కడే!

ఎన్నికల బహిష్కరణ నుంచి పోలింగ్​ను ఆమోదించే స్థాయికి ఇప్పుడు కశ్మీర్​ ఎదిగింది. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దీనికి బీజం పడినట్టు నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:- ఫరూక్ అబ్దుల్లా 'రోష్ని'​ భూములపై రాజకీయ రగడ

కశ్మీర్​లోని పార్టీల మూలాలు, అజెండాలు అన్నీ ఆర్టికల్​ 370 చుట్టూ తిరిగేవి. ఒకానొక సందర్భంలో.. స్వయం ప్రతిపత్తి రద్దుతో ఈ పార్టీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. తేరుకునే లోపే.. పార్టీల అగ్రనేతల్లో కొందరిని కేంద్రం అరెస్ట్​ చేసింది. మరికొందరిని గృహ నిర్బంధంలో పెట్టింది. ఈ జాబితాలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర కేబినెట్​ మంత్రులు, మాజీ పార్లమెంట్​ సభ్యులున్నారు.

నెలల తర్వాత వీరందరిని ఒక్కొక్కరిగా విడుదల చేసుకుంటూ వచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించింది. నిజానికి ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని వేర్పాటువాదులతో కలిసి ఎన్నికలను బహిష్కరిస్తాయని బలంగా విశ్వసించింది.

కానీ భాజపా ప్రణాళికలను పార్టీలు తిప్పికొట్టాయి. అన్ని పార్టీలు ఒక్కటై.. భాజపాకు వ్యతిరేకంగా.. 'గుప్కార్'​ కూటమిగా పోటీకి దిగాయి. ఇది భాజపాకు ఇబ్బందిని కలిగించింది. ఈ నేపథ్యంలోనే.. తమపై పోటీకి దిగిన విపక్షాల అభ్యర్థుల కదలికలను అధికారపక్షం నియంత్రించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలు వేడెక్కకముందే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. భద్రతా చర్యల్లో భాగంగానే ఇలా చేసినట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- ఎన్నికల వేళ ఆంక్షల వలయం- హోటళ్లలోనే నేతలు

ఎన్నికలకు ప్రజామోదం!

ఒక్కప్పుడు కశ్మీర్​లో ఎన్నికలంటే పోలింగ్​ కేంద్రాలు ఖాళీగా కనపడేవి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదుల వల్ల రక్తపాతం కూడా జరిగేది. కానీ ఇప్పుడు టీవీల్లో దృశ్యాలు ఊరటనిస్తున్నాయి. ప్రజలు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అన్ని వయస్కుల వారు ఇందులో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో పాల్గొనడం.. ఇక ఏమాత్రం నిషేధం కాదని వారు భావిస్తున్నారు.

ఓ పోలింగ్​ కేంద్రం వద్ద ఇలా

ఓటేసిన వృద్ధుడు

ఇదీ చూడండి:- జమ్ము కశ్మీర్ 'తొలి దశ' పోలింగ్ ప్రశాంతం

అయితే కేంద్ర పాలిత ప్రాంత రాజకీయాలు ఇంకా ఆర్టికల్​ 370 చుట్టూనే తిరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం మంచిదేనని నిరూపించుకునేందుకు ఎన్నికల బరిలో దిగింది భాజపా. అదే సమయంలో ఆర్టికల్​ 370 పునరుద్ధరించాలని గుప్కార్​ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇందులో గెలుపెవరిది అనేది తెలుసుకోవాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.

(రచయిత- బిలాల్​ భట్​, ఈటీవీ భారత్​ న్యూస్​ ఎడిటర్​)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.