ETV Bharat / opinion

క్షీర విపణి కొత్తపుంతలు.. సహకార డెయిరీల వెనకంజ

భారత్‌లో 35శాతం ప్రజలు ప్యాకెట్ పాలు వాడుతుండగా మిగిలిన వారు నేరుగా విక్రేతల నుంచి కొనుగోలు చేస్తున్నారు. పల్లెల్లోనూ పాల ప్యాకెట్ల వినియోగం పెరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో ప్యాకెట్‌ పాల వినియోగం గరిష్ఠ స్థాయికి చేరి విస్తరణకు అవకాశాలు సన్నగిల్లాయి. ప్రత్యామ్నాయంగా గ్రామీణ మార్కెట్లపై ప్రైవేటు డెయిరీలు దృష్టి సారించాయి. మండలాల్లోనే పంపిణీ కేంద్రాలు ఏర్పాటుచేసి పల్లెలకు రవాణా చేస్తున్నాయి.

author img

By

Published : Nov 13, 2021, 8:00 AM IST

milk
పాల ఉత్పత్తి

పోషకాహారంలో ప్రధానమైన పాలు, దాని ఉత్పత్తుల మార్కెటింగ్‌ కొత్తపుంతలు తొక్కడం డెయిరీ వ్యవస్థతో మొదలైంది. పాలసమాఖ్యల ఆధ్వర్యంలో మొదలైన డెయిరీలు విజయపథంలో నడిచాయి. ఈ రంగంలో అవకాశాలను గుర్తించిన ప్రైవేటు సంస్థలు ఆ తరవాతి కాలంలో ఇందులోకి అడుగుపెట్టి అధునాతన పద్ధతులు అవలంబించి అనేక మార్పులకు శ్రీకారం చుట్టాయి. సహకార, ప్రైవేటు డెయిరీల మధ్య చాలాచోట్ల ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడంతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. గ్రామాల్లో పశుపోషణ సైతం వాణిజ్య ధోరణిలో మొదలైంది. పాలసేకరణ, శుద్ధి, అమ్మకాల్లో ప్రైవేటు డెయిరీలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి.

సహకార రంగంలోని పాలసమాఖ్యలు అనేక సమస్యలతో సతమతమవుతుండగా ప్రైవేటు డెయిరీలు విస్తరణపై గురిపెట్టి భారీ ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నాయి. దాంతో విపణిలో క్రమంగా పాలసమాఖ్యల ఆధిపత్యం తగ్గి ప్రైవేటు డెయిరీల హవా పెరుగుతోంది. విపణి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఉత్పత్తులు తీసుకురావడం, వేగంగా నిర్ణయాలు అమలుచేయడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీతోపాటు- మార్కెటింగ్‌లో సరికొత్త వ్యూహాలతో ప్రైవేటు డెయిరీలు చొచ్చుకుపోతున్నాయి. ఇక్కడ విస్తృతమైన అవకాశాలు ఉండటం వారికి కలిసివస్తోంది. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. పాలు, పాల పదార్థాలతోపాటు అనుబంధ ఉత్పత్తులకు పెద్దపీట వేస్తున్నాయి. ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో గుర్తించి అక్కడికి ఉత్పత్తులను చేరవేస్తున్నాయి. సహకార డెయిరీలు సంస్థాగత సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ప్రైవేటుకు దీటుగా ఎదగలేకపోతున్నాయి.

విస్తృతమైన అవకాశాలు

సహకార డెయిరీలకు విస్తృతమైన మార్కెట్ ఉన్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనకడుగు వేస్తున్నాయి. అవి అవలంబిస్తున్న విధానాల వల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వాటిలో ఇప్పటికే కొన్ని మూతపడగా మరికొన్ని ఆ స్థితికి చేరువవుతున్నాయి. నిర్మాణాత్మకమైన ప్రణాళికలు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకురావడంలో చొరవ లేకపోవడం సహకార డెయిరీలకు శాపంగా మారింది. వేగంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, రాజకీయ జోక్యం, ఉద్యోగుల బాధ్యతారాహిత్యం, ఉత్పత్తుల్లో నవీకరణ పాటించకపోవడం.. వాటి విస్తరణకు అడ్డంకులుగా మారుతున్నాయి.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంత్ర సామగ్రిని సమకూర్చుకుని విభిన్నమైన ఉత్పత్తుల తయారీకి చొరవ చూపకపోవడం ప్రధానలోపం. ప్రస్తుతం ఉన్న ఒరవడి కొనసాగితే భవిష్యత్తులో ప్రైవేటు డెయిరీల వాటా మరింత పెరిగే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో రోజుకు 80లక్షల లీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 1.5కోట్ల లీటర్ల చొప్పున పాలు ఉత్పత్తి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 కోట్ల లీటర్లు ఉత్పత్తవుతున్నాయి. ఎనిమిది శాతం పాల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడోస్థానంలో ఉంది. తెలంగాణలో పాల ఉత్పత్తి నాలుగు శాతానికి పరిమితమైంది. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రైవేటు వ్యాపారం పెరగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారత్‌లో 35శాతం ప్రజలు ప్యాకెట్ పాలు వాడుతుండగా మిగిలిన వారు నేరుగా విక్రేతల నుంచి కొనుగోలు చేస్తున్నారు. పల్లెల్లోనూ పాల ప్యాకెట్ల వినియోగం పెరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో ప్యాకెట్‌ పాల వినియోగం గరిష్ఠ స్థాయికి చేరి విస్తరణకు అవకాశాలు సన్నగిల్లాయి. ప్రత్యామ్నాయంగా గ్రామీణ మార్కెట్లపై ప్రైవేటు డెయిరీలు దృష్టి సారించాయి. మండలాల్లోనే పంపిణీ కేంద్రాలు ఏర్పాటుచేసి పల్లెలకు రవాణా చేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో పాడిపశువులు తగ్గిపోవడంతో పాల లభ్యత క్రమంగా క్షీణిస్తోంది. ఏటా మార్చి నుంచి జూన్‌ దాకా పాల లభ్యత చాలా తక్కువగా ఉంటుండటంతో ఆ సమయంలో పల్లెల్లోనూ ప్యాకెట్ పాలకు గిరాకీ పెరుగుతోంది. దీంతో ప్రైవేటు డెయిరీలు ప్యాకెట్ పాల వైపు పల్లెవాసులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

స్థానికంగా లభించే పాల ధర ఎక్కువగా ఉండటం, ప్యాకెట్ పాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటంతో అమ్మకాలు పెరుగుతున్నాయి. డెయిరీలు వ్యాపారులకు రిఫ్రిజిరేటర్లు అందించి మార్కెట్ను విస్తృతం చేసుకుంటున్నాయి. క్రమంగా పెరుగు, నెయ్యి వాడకం పెరుగుతోంది. యూరప్‌ దేశాల్లో పాల అమ్మకాల పురోగతి ఒకశాతం ఉంటే మనదేశంలో అది ఆరు శాతంగా నమోదయింది. పాల పదార్థాల విక్రయాల్లోనూ 15-30శాతం పెంపుదల ఉండటంతో అంతర్జాతీయ డెయిరీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక వ్యక్తి రోజువారీ పాలు, పాల పదార్థాల సగటు వినియోగం 600 గ్రాములు. తెలంగాణలో అది 550 గ్రాములు. దేశవ్యాప్తంగా అది 395 గ్రాముల చొప్పున ఉంది.

వెన్న శాతం ఆధారంగా..

పాలను నిల్వచేయడంతోపాటు అనేక రకాల ఆహారపదార్థాలను తయారు చేయడంతో క్షీరానికి గిరాకీ క్రమంగా పెరుగుతోంది. విక్రేతలతోపాటు డెయిరీలు గ్రామాల్లో పాలు కొనుగోలు చేయడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. వ్యవసాయానికి అనుబంధంగా పాడిపశువులను పెంచుకున్న రైతులు ఇప్పుడు వ్యాపార ధోరణిని అవలంబిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుని పాలలో ఉన్న వెన్న శాతం ఆధారంగా ధర నిర్ణయిస్తున్నారు. వెన్న సగటున 10శాతం ఉంటే లీటరు పాలకు రూ.70, ఆరు శాతం ఉంటే రూ.42 చెల్లిస్తున్నారు. కొందరు అధునాతన పద్ధతుల్లో షెడ్లు నిర్మించి సంకర జాతి గడ్డి విత్తనాలు సాగుచేసి పశువులకు దాణా పెట్టి అధిక పాల ఉత్పత్తిని సాధిస్తున్నారు. పాడిరైతులు బృందంగా ఏర్పడి ఉప ఉత్పత్తులు గ్రామాల్లోనే తయారుచేసి సొంతంగా మార్కెటింగ్‌ చేసుకోగలిగితే అదనపు ఆదాయం లభిస్తుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి నాబార్డు తదితర సంస్థల నుంచి ఆర్థిక సహకారం సమకూర్చుకుని ఎదిగే వెసులుబాటు ఉంటుంది.

ఉప ఉత్పత్తులతో అధిక ఆదాయం

ఒకప్పుడు పల్లెల్లో పాడిపశువులు ఉన్నవారు పాలను ఇంట్లో అవసరాలకు వాడుకోగా- మిగిలినవి బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారికి పోసేవారు. ఇందుకు నామమాత్రపు సొమ్ము తీసుకునేవారు. వాణిజ్య ధోరణి మొదలయ్యాక జీవనోపాధి, ఆదాయం కోసం పాడిపశువుల పెంపకం మొదలైంది. దీంతో గ్రామాల్లో అవసరాలకు మించి పాల మిగులు కనిపిస్తోంది. వీటిని విక్రేతలు సేకరించి సమీప పట్టణాలు, నగరాల్లో అమ్మేవారు. పాలను దూరప్రాంతాలకు రవాణా చేయడానికి, మిగిలినవి నిల్వ చేయడానికి తొలుత సహకార రంగం, తరవాత ప్రైవేటు డెయిరీలు కృషి చేశాయి. వినియోగానికి మించి పాలు ఉత్పత్తి అయినప్పుడు పొడిగా మార్చి నిల్వచేస్తున్నారు. వేసవిలో ఉత్పత్తి తగ్గినప్పుడు పొడితో పాలు తయారు చేస్తున్నారు. ఉప ఉత్పత్తులతోనే అధిక ఆదాయం దక్కుతున్నందువల్ల డెయిరీలు ఆ దిశగా దృష్టి సారించాయి. చాలా రోజులపాటు పాలు నిల్వ ఉండేలా టెట్రా వంటి ప్యాకింగ్‌ సాంకేతికత అందుబాటులోకి తీసుకువచ్చాయి.

- పెనికలపాటి రమేష్‌

ఇదీ చదవండి:

చైనాపై అమెరికా దూకుడు- తైవాన్ తరఫున వకాల్తా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.