ETV Bharat / opinion

టీకాల విపణిలో విదేశీ సంస్థల ఇష్టారాజ్యం!

author img

By

Published : Mar 5, 2021, 7:33 AM IST

కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమంలో చట్టపరమైన సమస్యలతోపాటు.. నైతికత, పారదర్శకతలకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నాయి. టీకా ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియలో లోపాలు.. నిర్లక్ష్యం, అశ్రద్ధల వల్ల కలిగే దుష్పలితాలకు ప్రభుత్వాలు ఎటువంటి రక్షణా కల్పించవు. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని దేశాలు టీకా వికటిస్తే నష్టపరిహారం చెల్లింపు బాధ్యత నుంచి దాని తయారీదారులకు మినహాయింపు ఇచ్చాయి. ఈ జాబితాలో ఇజ్రాయెల్‌, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ఈయూలు ముందుడంగా.. భారత ప్రభుత్వం వ్యాక్సిన్‌ తయారీదారులకు దావాలు, కేసుల నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరిస్తోంది. ఇది ఆహ్వనించదగ్గ పరిణామమే.

corona virus vaccine side effects various governments offering relaxations to vaccine companies except india
టీకాల పంపిణీపై విదేశీ సంస్థల ఇష్టారాజ్యం!

సాధారణంగా ఏదైనా వ్యాక్సిన్‌ రూపొందిన తరవాత అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని జనంలోకి రావడానికి నాలుగైదేళ్లు పడుతుంది. కానీ, కరోనా మహమ్మారి తీసుకొచ్చిన అత్యవసర పరిస్థితిలో ఔషధ కంపెనీలు ఏడాదిలోనే కొవిడ్‌ మహమ్మారికి టీకాలను అందుబాటులోకి తెచ్చాయి. మెరుపు వేగంతో తయారైన టీకాల వల్ల దుష్పలితాలు ఏమాత్రం ఉండవని చెప్పలేం. ఉదాహరణకు అన్ని జాగ్రత్తలూ తీసుకుని రూపొందించిన పోలియో టీకాతో ప్రతి 27 లక్షల మందిలో ఒకరికి దుష్పలితాలు సంభవిస్తాయని దీర్ఘకాల పరిశీలనలో వెల్లడైంది. కరోనా టీకా విషయంలో అంతకాలం నిరీక్షించలేం కాబట్టి ప్రభుత్వాలు వేగంగా అనుమతులిస్తున్నాయి. అవి వికటిస్తే వచ్చే దావాలు, కేసుల నుంచి వ్యాక్సిన్‌ కంపెనీలకు ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తున్నాయి.

మినహాయింపు..
ఫైజర్‌-బయోన్‌ టెక్‌ టీకా వికటిస్తే నష్టపరిహారం చెల్లింపు బాధ్యత నుంచి దాని తయారీదారులకు ఇజ్రాయెల్‌, అమెరికా, బ్రిటన్‌లు మినహాయింపు ఇచ్చాయి. ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌ కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఐరోపా సమాఖ్య (ఈయూ) ఆస్ట్రాజెనెకాకు పరిమిత మినహాయింపు ఇచ్చింది. అమెరికాలో ఫైజర్‌, మాడెర్నా టీకాల వల్ల దుష్పలితాలు కలిగితే నష్టపరిహారం కోసం ఆ కంపెనీలపై పౌరులు దావా వేయలేరు. సివిల్‌ కేసులూ పెట్టలేరు. ప్రజలకు కీలకమైన మందులను అందించే కంపెనీలకు 2024 సంవత్సరం వరకు ప్రజాసన్నద్ధత, అత్యవసర సంసిద్ధత చట్టం కింద దావాల నుంచి రక్షణ కల్పిస్తామని అమెరికా ఆరోగ్య మంత్రి అలెక్స్‌ అజార్‌ ప్రకటించారు. బ్రిటన్‌ ప్రభుత్వం ఫైజర్‌ కంపెనీతోపాటు ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికీ కేసులు, దావాల నుంచి రక్షణ కల్పించడానికి చట్ట సవరణ చేసింది. అయితే, టీకా ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియలో లోపాలు, నిర్లక్ష్యం, అశ్రద్ధల వల్ల కలిగే దుష్పలితాలకు ప్రభుత్వాలు ఎటువంటి రక్షణా కల్పించవు. భారత ప్రభుత్వం వ్యాక్సిన్‌ తయారీదారులకు దావాలు, కేసుల నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరిస్తోంది. చెన్నైకి చెందిన ఓ నలభై ఏళ్లవ్యక్తి కోవిషీల్డ్‌ టీకా వల్ల తనకు దుష్ఫలితాలు వచ్చాయని ఆరోపిస్తూ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ప్రభృతుల నుంచి రూ.5 కోట్ల నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ లీగల్‌ నోటీసు పంపడం తెలిసిందే. కోవిషీల్డ్‌ టీకా కార్యక్రమాన్నీ నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణ, డిమాండ్లను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తోసిపుచ్చడం వేరే సంగతి. మరోవైపు... మనదేశానికి చెందిన కొవాగ్జిన్‌ టీకా 81 శాతం ప్రభావశీలత కనబరచింది. మూడోదశ క్లినికల్‌ పరీక్షల మధ్యంతర విశ్లేషణలో ఈ విషయం నిర్ధారణ అయిందని టీకా తయారీదారు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది.

'ధనిక దేశాలు టీకా సమాచారం పంచుకోవాలి'

జాన్సన్​ & జాన్సన్ సింగిల్ డోస్​ టీకాకు ఆమోదం!

ఫైజర్​ గొంతెమ్మ కోర్కెలు..

మరోవైపు- విదేశీ టీకా ఉత్పత్తిదారులు చట్టానికి లోబడి బాధ్యతాయుతంగా నడుచుకొంటున్నారనీ చెప్పలేం. దక్షిణ అమెరికా ఖండంలోని కొన్ని దేశాల్లో ఫైజర్‌ కంపెనీ మాఫియా శైలి దౌర్జన్యానికి పాల్పడుతోందని ఆరోపణలు వచ్చాయి. ఈ దేశాల్లో తమ టీకా వల్ల దుష్ఫలితాలు ఎదురైతే కోర్టు కేసుల నుంచి రక్షణగా ఆ దేశాల సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయ భవనాలను పూచీకత్తుగా పెట్టాలని ఫైజర్‌ కంపెనీ డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. తన వైపు నుంచి నిర్లక్ష్యం జరిగినా కేసులు పెట్టరాదని ఫైజర్‌ డిమాండ్‌ చేసింది. పెద్ద దేశాలైన అర్జెంటీనా, బ్రెజిల్‌ ఫైజర్‌ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఒక చిన్న దేశంలో ఫైజర్‌ డిమాండ్ల వల్ల ఒప్పందం కుదుర్చుకోవడానికి మూడు నెలలపాటు ఆలస్యమవడంతో కరోనా కేసులు విజృంభించాయి. దక్షిణ అమెరికా ఖండంలో మెక్సికోతో సహా తొమ్మిది దేశాలతో ఫైజర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దానికి సంబంధించిన షరతులు బయటపెట్టేందుకు నిరాకరించింది. ఫైజర్‌ డిమాండ్లు అల్పాదాయ, మధ్యాదాయ దేశాల తలకు మించిన భారమవుతాయి. నిజానికి ఫైజర్‌ కంపెనీ ఈ టీకాను సొంతంగా సృష్టించలేదు. జర్మనీకి చెందిన బయోన్‌ టెక్‌ రూపొందించిన కొవిడ్‌ టీకాపై ఫైజర్‌ క్లినికల్‌ పరీక్షలు చేసి మార్కెటింగ్‌ చేస్తోందంతే! టీకా పరిశోధన-అభివృద్ధికి జర్మనీ ప్రభుత్వం 44.5 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేయగా, మూడో దశ పరీక్షలు పూర్తికాకుండానే టీకా కొనుగోలుకు అమెరికా ప్రభుత్వం 200 కోట్ల డాలర్ల ఆర్డరు ఇచ్చింది. ఈ ఏడాది 1500 కోట్ల డాలర్ల టీకా విక్రయాలు సాధించగలనని ఫైజర్‌ అంచనా.

ఫైజర్‌, మాడెర్నా టీకాలను మైనస్‌ 70-80 డిగ్రీల అతిశీతల ఉష్ణోగ్రతలో నిల్వచేసి సరఫరా చేయాలి. ఈ ప్రక్రియలో లోపాలు జరిగి టీకా వికటించవచ్చు. అలాంటి నిర్వహణ లోపాలకు, నిర్లక్ష్యానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలనడం సబబు కాదు.

కొవిడ్​ టీకా ధరలపై షా అసంతృప్తి!

భారత్‌ విధానమేమిటి?
కొవిడ్‌ టీకా కార్యక్రమంలో చట్టపరమైన సమస్యలతోపాటు నైతికత, పారదర్శకతలకు సంబంధించిన అంశాలూ ముడివడి ఉన్నాయి. ప్రస్తుత మహమ్మారి కాలంలో తమకు అమెరికాలో మాదిరిగా చట్టపరమైన దావాల నుంచి రక్షణ కల్పించాలని భారతీయ వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. భారత్‌లో టీకాల తయారీ, పంపిణీ, వినియోగాలకు సంబంధించి నిర్దిష్ట చట్టమే లేదు. 2019నాటి వినియోగదారుల రక్షణ చట్టం, మరి రెండు ఇతర చట్టాల్లోని కొన్ని నిబంధనల కింద మాత్రమే టీకాల నాణ్యతా లోపంపై కేసులు పెట్టవచ్చు. ఇకనైనా టీకాల విషయంలో భారత్‌ చట్టపరంగా పటిష్ఠ ప్రాతిపదికను ఏర్పరచాలి. అమెరికా, బ్రిటన్‌లలో మాదిరి అత్యవసర పరిస్థితుల్లో మాత్రం మినహాయింపులు ఇవ్వాలి. ప్రపంచ జనాభా అంతటికీ కొవిడ్‌ టీకాలు వేయకతప్పని ప్రస్తుత పరిస్థితుల్లో వందల కోట్ల ప్రజానీకంలో కొందరికి దుష్ఫలితాలు పొడచూపక మానవు. అవన్నీ టీకాల వల్లే వచ్చాయనీ నిర్ధారించలేం. అలా నిర్ధారణ అయిన కేసుల్లో చట్టపరమైన చర్యల జోలికిపోకుండా బాధితులకు సముచిత పరిహారం లేదా చికిత్స అందించడం ఉత్తమ పద్ధతి అవుతుంది. దీనికయ్యే ఖర్చును భరించడానికి వ్యాపారపరంగా విక్రయించే ప్రతి టీకా డోసు మీదా కొంత సెస్సు వసూలు చేసి నిధులు సమీకరించవచ్చు.

భారీ మూల్యం

''అమెరికా ప్రస్తుత కరోనా కాలానికి మాత్రమే దావాల నుంచి రక్షణ కల్పిస్తుందే తప్ప, సాధారణంగా ఆ దేశంలో టీకా దుష్ఫలితాలకు కంపెనీలు భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి జడిసి చాలా కంపెనీలు అమెరికా నుంచి తమ టీకా తయారీ కర్మాగారాలను ఇతర దేశాలకు తరలించేశాయి. టీకా కారణంగా మానసిక, శారీరక వైకల్యం కలిగినట్లు నిర్ద్వంద్వంగా నిరూపించగల వ్యక్తికి బ్రిటన్‌ ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకం కింద పరిహారం చెల్లిస్తుంది. కానీ, ఈ పథకం అమలు ఆశావహంగా లేదు. 2010 నుంచి వివిధ టీకాలు వికటించిన కేసులు 485 వరకు వస్తే, 39 కేసుల్లోనే పరిహారం చెల్లించారు.''

- వరప్రసాద్‌

ఇవీ చదవండి: 'ఆ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా టీకా సరఫరాకు దోహదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.